Boiled Egg Water Uses | గుడ్లు ఉడకబెట్టిన నీరు పారేస్తున్నారా? ఆ నీటితో ఎన్నో లాభాలు!-here is how you can reuse the water from boiling eggs know benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Boiled Egg Water Uses | గుడ్లు ఉడకబెట్టిన నీరు పారేస్తున్నారా? ఆ నీటితో ఎన్నో లాభాలు!

Boiled Egg Water Uses | గుడ్లు ఉడకబెట్టిన నీరు పారేస్తున్నారా? ఆ నీటితో ఎన్నో లాభాలు!

HT Telugu Desk HT Telugu
Sep 06, 2022 04:55 PM IST

గుడ్లను ఉడకబెట్టిన నీరు వృధాగా పారేస్తున్నారా? కానీ ఆ నీటితోనూ ఎన్నో లాభాలు ఉన్నాయి, అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ చదవండి.

<p>Egg Shell Water</p>
Egg Shell Water (Pixabay)

మన ఆరోగ్యానికి సంబంధించి గుడ్లు ఒక మంచి పోషకాహారం. ఉడికించిన గుడ్లు మన ఆహారంలో చేర్చుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మనం గుడ్లను ఉడకబెట్టిన నీరు కూడా కొన్ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది కూడా నిజం.

అవును, గుడ్లు మరిగించిన నీటిని కూడా మనం వివిధ అవసరాలకు వాడుకోవచ్చు. ఎందుకంటే గుడ్ల పెంకుల్లో కాల్షియం ఉంటుంది. మనం గుడ్లను నీటిలో మరిగించినపుడు ఆ గుడ్ల పెంకుల్లోని కాల్షియం నీటిలో కరుగుతుంది. ఒక్క కాల్షియం మాత్రమే కాదు, ఇంకా కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. అవి నీటిలో కరిగినపుడు ఆ నీరు ఎలా మారుతుంది, గుడ్లు ఉడకబెట్టిన నీటితో ఎలాంటి లాభాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.

గుడ్డు పెంకులోని ఖనిజాలు

గుడ్డు పెంకు అనేది 95 శాతం కాల్షియం కార్బోనేట్ తో తయారవుతుంది. మిగతా పరిమాణాలలో భాస్వరం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, జింక్, మాంగనీస్, ఇనుము, రాగి వంటి మూలకాలు ఉంటాయి. గుడ్డును ఉడకబెట్టినప్పుడు ఈ మూలకాలన్నీ ఆ నీటిలో కలిసిపోతాయి. అప్పుడు సాధారణ నీరు కూడా మినరల్ వాటర్ అవుతుంది. ఈ నీటిని మనం మొక్కలకు ఉపయోగించవచ్చు. గుడ్డు ఉడకబెట్టిన నీరు మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషణను అందించడానికి ఎరువుగా పనిచేస్తుంది. అప్పుడప్పుడూ మొక్కలకు గుడ్ల పెంకులు వేయడం వెనక ఉన్న సైన్స్ ఇదే.

మొక్కలకు ఎరువు

పైన చెప్పినట్లుగా గుడ్డు పెంకులు మొక్కలకు ఎరువుగా ఉపయోగపడతాయి. అయితే నేరుగా పెంకులు వేసే దానికన్నా ఇలా గుడ్లు ఉడకబెట్టిన నీరును పోయడం వల్ల ఆ మొక్కల వేర్లు తొందరగా పోషకాలను గ్రహిస్తాయి. అయితే వేడి నీరు మాత్రం పోయవద్దని గుర్తుంచుకోండి. మీరు ఇంట్లో మొక్కలు నాటేటపుడు, విత్తనాలు చల్లేటపుడు ఇలా గుడ్లు ఉడకబెట్టిన నీటిని వాడవచ్చు. గుడ్డు పెంకులను కూడా పొడిగా చేసి ఆ మట్టిలో కలిపితే ఆ మట్టి మరింత ఫెర్టైల్ గా మారుతుంది.

టొమాటో మొక్కలకు మంచి పోషణ

ఉడికించిన గుడ్డు నీరు టొమాటో మొక్కలకు మంచి పోషణ ఇస్తుంది. సూర్యరశ్మి ఎక్కువగా అందని మొక్కలకు కూడా గుడ్లు ఉడికించిన నీరు వాడవచ్చు. మిర్చి, వంకాయలు మొక్కలకు కూడా ఈ నీరు పట్టించవచ్చు. పూల మొక్కలకు పట్టిస్తే తెగుళ్లను ఎదుర్కొనే శక్తి ఆ మొక్కలకు లభిస్తుంది.

బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర, ఉసిరికాయల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. గుడ్ల పెంకులతో పోటు వీటిని కూడా కలిపితే మరింత సమర్థవంతమైన ఎరువు అవుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం