Fenugreek Benefits । మెంతులను ఇలా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!
Fenugreek Health Benefits: మెంతులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మెంతులతో టీ కాచుకుని తాగితే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవి ఎలాంటివో తెలుసుకోండి.
Fenugreek Seeds Health Benefits: మెంతి టీ అనేది ఒక ప్రసిద్ధ హెర్బల్ టీ. దీనిని మెంతులతో తయారు చేస్తారు. మెంతులు ఆహారంగా వాడే ఒక సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాకుండా ఔషధ గుణాలు (Medicinal Properties) కలిగిన దినుసులుగా ప్రసిద్ధి. వీటిని చాలాకాలంగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు.
మెంతులు చూడటానికి బంగారు పసుపు రంగులో, రుచిలో చేదుగా ఉంటాయి. అయితే వీటిని నీటిలో మరిగించినపుడు ఆ నీరు ప్రత్యేకమైన వాసన, రుచిని పొందుతుంది. ఇందులో కొద్దిగే తేనె కలిపితే మెంతి టీ (Fenugreek Tea) తయారవుతుంది. ఈ రకంగా మెంతి టీ చేసుకొని తాగితే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మెంతి టీని ఎందుకు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ ఆరోగ్యం
మెంతి టీ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ టీ తాగితే జీర్ణవ్యవస్థలో మంటను తగ్గుతుంది, మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
నొప్పి నిరోధక లక్షణాలు
మెంతి టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండే కాంపౌండ్స్ ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరం అంతటా మంటను, వాపును (Inflammation) తగ్గించడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్, ఇతర కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు ఒక కప్పు మెంతి టీ తాగాలి.
రక్తంలో చక్కెర నియంత్రణ
మెంతి టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలదు. ఈ టీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, తద్వారా మధుమేహం (Diabetes) ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కోసం సహజ ఔషధంగా పని చేస్తుంది.
శ్వాసకోశ ఆరోగ్యం
మెంతి టీ శ్వాసకోశ ఆరోగ్యం (Respiratory health)పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ టీ వాపును తగ్గించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడం ద్వారా ఆస్తమా, బ్రోన్కైటిస్ మొదలైన లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
ఋతు తిమ్మిరి
మహిళలు నెలసరి సమయంలో మెంతి టీ తాగితే ఋతు తిమ్మిరి (Period Cramps) నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ టీ గర్భాశయంలోని, కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
చనుబాల ఉత్పత్తి
మెంతి టీ పాలిచ్చే తల్లులలో రొమ్ము పాల (Breast Milk) ఉత్పత్తిని పెంచుతుందని బలంగా నమ్ముతారు. ఈ టీలో పాల ఉత్పత్తిని ప్రేరేపించే సమ్మేళనాలు ఉన్నాయి, ఇది పాలిచ్చే తల్లులకు సిఫారసు చేసే ఒక గొప్ప పానీయం.
సంబంధిత కథనం
టాపిక్