First Time Pregnancy । గర్భిణీలు మొదటి త్రైమాసికంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?!
Ileana D'cruz Pregnant: నటి ఇలియానా తాను గర్భవతిని అని తెలియజేసింది. మొదటిసారి గర్భం దాల్చినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Ileana D'cruz Pregnant: సన్నజాజిలాంటి నడుమును కలిగిన అందాల నటి ఇలియానా తాజాగా తన అభిమానులతో ఒక శుభవార్తను పంచుకుంది. తాను గర్భవతి అని (Ileana Announces Pregnancy) అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. మొదటిసారిగా ఒక బిడ్డకు జన్మనిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేసింది. ఎప్పుడెప్పుడు తన బిడ్డను చూస్తానా అన్న అత్రుతతో ఉన్నట్లు తెలిపింది.
ఏ స్త్రీకైనా మాతృత్వపు (Motherhood) మధురానుభూతిని అనుభవించడం, అమ్మ అని పిలుపించుకోవడం, చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఒక స్త్రీ గర్భం దాల్చిన రోజు నుంచి బిడ్డను జన్మనివ్వటం వరకు తొమ్మిది నెలల పాటు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ స్థితిలో వారిలో అనేక రకాల భావోద్వేగాలకు లోనవుతారు. వారి శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. స్త్రీ గర్భవతిగా మారిన తర్వాత తన ఆరోగ్యంతో పాటు శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా తొలిసారిగా గర్భందాల్చిన వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
మొదటి త్రైమాసికంలో (first trimester of pregnancy) గర్భవతి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
విటమిన్‌లను తీసుకోండి
గర్భిణీ స్త్రీలకు (Pregnant Women) మల్టీవిటమిన్‌లు అవసరం లేకపోయినప్పటికీ, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు వంటి గర్భధారణలో చాలా అవసరం. కొంతమందికి ఫోలిక్ యాసిడ్ ఎక్కువ మోతాదు అవసరం కావచ్చు ఉదాహరణకు, మధుమేహం ఉన్న సందర్భంలో. కాబట్టి గర్భిణీలు తమ వైద్యులు సూచించిన మోతాదు మేరకు విటమిన్ సప్లిమెంట్లను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి.
సరైన ఆహారం తీసుకోండి
గర్భధారణ సమయంలో ఆహార నియమాలు (Pregnancy Diet) పాటించాలి. సరైన ఆహారం పుష్టిగా తినాలి. అలాగని ఏదిపడితే అది తినకూడదు. కొన్ని ఆహారాలు, పానీయాలు, పండ్లు ఆరోగ్యకరమైనప్పటికీ అవి శిశువుకి ప్రమాదకరం, కాబట్టి అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఏం తినాలి, ఏం తినకూడదు అని మీ వైద్యులను సంప్రదించి మాత్రమే తీసుకోండి.
కదులుతూ ఉండండి
గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం మీకు, మీ కడుపులోని బిడ్డకు చాలా ఆరోగ్యకరం. అయితే మీరు జిమ్‌లో చేరాలని దీని అర్థం కాదు. గర్భధారణ సమయంలో చురుకుగా ఉండాలనేది ఉద్దేశ్యం. తేలికైన యోగా వ్యాయామాలు (Prenatal Yoga Poses) చేయవచ్చు. రోజువారీ నడక లేదా కొద్దిగా ఈత గొప్ప మార్గం.
ఇంటి పనులు చేయకండి
బరువులు ఎత్తడం, ఇంటిని శుభ్రపరచటం, ఎక్కువ శారీరక శ్రమ కలిగిన పనులు చేయకండి. పరిశుభ్రతకు సంబంధించిన పనులకు వాడే ద్రావణాలలో కెమికల్స్ ఉండవచ్చు, ఇవి మీ ఆరోగ్యానికి, శిశువు ఆరోగ్యానికి హానికరం. ఈ సమయంలో సున్నితంగా వ్యవహరించాలి, విశ్రాంతి తీసుకోవాలి. శ్రమ ఉండకూడదు.
ఆల్కహాల్ తాగడం మానేయండి
మీకు వైన్, బీర్ వంటి ఆల్కహాల్ పానీయాలు తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఆల్కాహాల్ తాగడం వల్ల మీ బిడ్డ ఎదుగుదల దెబ్బతింటుంది. త్రాగడానికి సురక్షితమైన ఆల్కహాల్ ఏదీ లేదు, కాబట్టి మీ గర్భధారణ సమయంలో పూర్తిగా ఆల్కహాల్‌ను నివారించడం ఉత్తమమైన పని.
కెఫీన్ పానీయాలకు దూరం
కాఫీ, గ్రీన్ టీ, ఎనర్జీ డ్రింక్స్ మొదలైన పానీయాలను తగ్గించండి. ఎందుకంటే వీటిలో కెఫిన్ ఉంటుంది. ఇవి గర్భిణీ స్త్రీలకు సిఫార్సు చేసే పానీయాలు కావు. అయితే ఎంపిక చేసిన పండ్ల రసాలు, కొబ్బరి నీరు వంటివి తాగాలి.
ధూమపానం మానేయండి
ధూమపానం ఎవరికీ మంచిది కాదు. ధూమపానం మానేయడం మీ కోసం, మీ శిశువు ఆరోగ్యం కోసం మీరు చేయగలిగే ఉత్తమమైన వాటిలో ఒకటి.
ఏ మందులు సురక్షితమైనవో తెలుసుకోండి
గర్భంతో ఉన్నప్పుడు మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మీ స్వంత వైద్యం గానీ, ఇంటి చిట్కాలు అనుసరించటం కానీ అస్సలు చేయకూడదు. దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి ఇలా అన్ని అనారోగ్యాలకు మీ వైదుడిని సంప్రదించి మాత్రమే ఔషధాలు తీసుకోండి. మీరు ఏదైనా చికిత్స కోసం వెళ్లినా, లేదా ఏదైనా టీకా తీసుకుంటున్నా వైద్యులకు మీరు గర్భవతి అనే విషయం తెలియజేయండి.
ఈ జాగ్రత్తలను (Pregnancy Precautions) ఇలియానాకు తెలియజేయండి, షేర్ చేయండి. మీలో లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గర్భవతిగా ఉంటే వారికి తెలియజేయండి. వారిని క్షేమంగా చూసుకునే బాధ్యతను తీసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్