First Night Tips । మొదటిరాత్రి మరపురాని రాత్రిగా మారేందుకు చిట్కాలు ఇవిగో!
First Night Tips: వివాహం అయినప్పటికీ మొదటి రాత్రి భార్యాభర్తల మనసులో అనేక ప్రశ్నలు, సందేహాలు ఉంటాయి. మొదటిరోజు మరపురాని రోజుగా మారాలంటే ఈ చిట్కాలు చూడండి.
మొదటి రాత్రి అని ఎందుకు అంటారంటే అది మొదటి రోజున జరిగే రాత్రి కాబట్టి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు (Wife and Husband) మొదటిసారి 'కలిసే' రాత్రి కాబట్టి. ఎన్నో రాత్రులొస్తాయి గానీ మొదటి రాత్రి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో వచ్చే ఒక అద్భుతమైన సందర్భం. ఈ రాత్రి కోసం (Wedding Night) ఎన్నో రాత్రులు ఒంటరిగా వేచి చూసిన రాత్రులు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ జీవితంలో పెళ్లి (Marriage) అనేది ఒక అపురూప ఘట్టం అయితే, భార్యగా మొదటి రాత్రి అనేది ఆ బంధాన్ని ఏకం చేసే క్షణం. ఈ సమయంలో వారి మనసులో ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల సందేహాలు, అంతకుమించిన భయాలు కూడా ఉంటాయి. ఇంతకాలం పాటు ఒక మహిళగా పురుషులతో ఒక దూరం పాటించిన వారు, శోభనం రోజున తమ సర్వస్వాన్ని అర్పించాల్సి ఉంటుంది. గడిపేది తన భర్తే అయినప్పటికీ, ఒక కొత్త ప్రదేశంలో, కొత్త వాతావరణంలో, ఒక కొత్తవ్యక్తితో సన్నిహితంగా మెలగాలంటే కాస్త ఇబ్బందిగా, కాస్త బిడియంగా, ఇంకాస్త ఆందోళనగా ఉంటుంది.
కొత్తగా పెళ్లిన వధువు, అందంగా అలంకరించిన పడకగదిలో తన కన్యత్వంను భర్తకు ధారపోసే మొదటి రాత్రి రోజు ఎలా వ్యవహరించాలి. భయాందోళనలు లేని ఒక అద్వితీయమైన, ఆహ్లాదకరమైన రాత్రిని గడపటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు (First Night Tips for Bride) ఉన్నాయి.
ప్రశాంతంగా ఉండండి
మొదటి రాత్రి ఎలా గడుస్తుందోనని ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకండి. నిజానికి ఈ సమయంలో విభిన్నమైన భావోద్వేగాలు మీ ఇంద్రియాలపై దాడి చేసినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం. మొదటిసారి ఇబ్బందిగా ఉంటుంది కానీ మీరు ప్రశాంతంగా ఉంటే ఆనందంగా ఉంటుంది. భయంభయంగా ఉంటే మాత్రం కలయిక కష్టం అవుతుంది. మనసులో ఏం భయాలు పెట్టుకోకుండా మీ భర్తకు స్వేచ్ఛనివ్వండి, మీ తొలిరేయిని రమ్యంగా ఆస్వాదించండి.
ప్రతి ఒక్కరికీ రక్తస్రావం జరగదు
ఒక స్త్రీ మొదటిసారి శృంగారంలో ఉన్నప్పుడు ఆమె యోనిలో ఉండే పలుచటి హైమెన్ పొర చిట్లిపోతుంది. కాబట్టి మొదటిసారిగా ఆ చర్య జరిగే సమయంలో రక్తస్రావం అవుతుంది. అయితే అందరు అమ్మాయిలకు రక్తస్రావం జరగకపోవచ్చు. దీని అర్థం వారు అంతకుముందే తమ కన్యత్వాన్ని (Virginity) కోల్పోయారని కాదు, అమ్మాయిలు సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్, రైడింగ్ , ఇతర అనేక కఠినమైన శారీరక శ్రమలు చేసినపుడు, ఎక్కువగా వ్యాయామాలు చేసినపుడు కూడా పలుచగా ఉండే వారి హైమెన్ పొర దెబ్బతింటుంది. దాని గురించి కూడా అమ్మాయిలకు తెలియకపోవచ్చు. కాబట్టి, మీ పెళ్లి రాత్రి మొదటిసారి సెక్స్ చేసినప్పుడు మీకు రక్తస్రావం కాకపోయినా పర్వాలేదు.
ల్యూబ్రికెంట్ వాడండి
సెక్స్ అనుభవం (Sex Experience) లేని వారు, తొలిసారి శృంగారంలో పాల్గొంటున్నవారు ల్యూబ్రికెంట్ వాడటం మేలు. ఎందుకంటే ఈ సమయంలో ఉండే ఆందోళన, ముహూర్తం దాటిపోతుందనే తొందరలో కలయిక సాఫీగా సాగకపోవచ్చు. పురుషాంగం లోపలికి వెళ్లాలంటే కష్టంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో జననావయవాలను కాస్త తడిచేసుకోవడం వలన సుఖంగా ఉంటుంది.
భావప్రాప్తి పొందలేకపోవచ్చు
మీరు సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ భావప్రాప్తి పొందడం అంత సులభం కాదు, నిజానికి, చాలా మంది వ్యక్తులు మొదటిసారి సెక్స్‌లో ఉన్నప్పుడు కూడా భావప్రాప్తి (Orgasm) పొందలేరు. శృంగార సంతృప్తి పొందాలంటే అందుకు కొన్ని దశలు దాటాలి. కాబట్టి మున్ముందు ఇంకా చాలా సమయం ఉంటుంది కాబట్టి, మొదటి రాత్రి ఉద్వేగం పొందకపోతే చింతించకండి.
కలయిక జరగకపోవచ్చు
మొదటి రాత్రి అని కొంతమంది ఎంత ఉత్సాహం, ఉల్లాసం చూపినప్పటికీ అసలు సమయానికి సిగ్గు బిడియాలు, భయాలు, మొహమాటాలు, ఇతరత్రా కారణాలు అడ్డు వచ్చి అసలు ఇద్దరి మధ్య కలయిక అనేదే జరగకపోవచ్చు. ఎన్నో ఊహించుకొని, ఏవేవో చేయాలని చివరికీ ఏమి చేయలేనపుడు నిరాశ చెందకండి. పెళ్లి అనేది పెద్ద వేడుక, శరీరాలు అలసిపోతాయి. మంచి సమయం వచ్చినపుడు అదే జరుగుతుంది. మీ ఆశను సజీవంగా ఉంచుకోండి.
చివరగా చెప్పేదేమిటంటే.. మీ మొదటిరాత్రి మీరు సెక్స్ చేసినా, చేయకున్నా, ఇది మీ జీవితంలో మరపురాని క్షణాలలో ఒకటిగా ఉంటుంది. మీ భాగస్వామితో మాట్లాడండి, నవ్వండి, మీ ఆలోచనలను పంచుకోండి. మీ భాగస్వామిని జీవితకాల స్నేహితుడిగా, ప్రేమికుడిగా మార్చుకునేందుకు ఈ సమయం కేటాయించండి.
సంబంధిత కథనం