Spice Up Your Sex Life | తొందరెందుకు? నెమ్మదిగా సెగలు రేపండి.. ఇవిగో చిట్కాలు!-spice up your sex life with these passionate tips from the experts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spice Up Your Sex Life | తొందరెందుకు? నెమ్మదిగా సెగలు రేపండి.. ఇవిగో చిట్కాలు!

Spice Up Your Sex Life | తొందరెందుకు? నెమ్మదిగా సెగలు రేపండి.. ఇవిగో చిట్కాలు!

HT Telugu Desk HT Telugu
Apr 14, 2023 09:43 PM IST

Spice Up Your Sex Life: శృంగారం విసుగు తెప్పిస్తుందా? సంతృప్తికరమైన శృంగార జీవితం కోసం మీ రతిక్రీడను రసవత్తరంగా మార్చే చిట్కాలు ఇక్కడ చూడండి.

Spice Up Your Sex Life:
Spice Up Your Sex Life: (pexels)

Spice Up Your Sex Life: లైంగిక సాన్నిహిత్యం (Sexual Intimacy) అనేది ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన సంబంధంలో ముఖ్యమైన భాగం. ఇది జంటల మధ్య లోతైన సంబంధాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది. ఇరువురి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుంది. అయితే, పెళ్లైన కొత్తలో ఉండే ఆ ఉత్సాహం కాలక్రమేణా మసకబారుతుంది. మసకమసక చీకట్లో ఫసక్‌మని శృంగార కార్యాన్ని ముగిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా, యాంత్రికంగా చేస్తున్నారే తప్ప అందులో మసాలా ఉండటం లేదు. ఫలితంగా సెక్స్ లైఫ్ (Sex life) అనేది చప్పగా సాగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే సెక్స్ అనేది విసుగు తెప్పిస్తుందే తప్ప, సంతృప్తి కలిగించదు. ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలిగిన ఈ వ్యాయామాన్ని ముగించడానికి తొందరెందుకు? నెమ్మదిగా సెగలు రేపండి. రతి క్రీడలో లీనమై ఆడుతూ ఇద్దరూ విజేతలుగా నిలవండి. మీ శృంగారాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు నిపుణులు అందించిన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.

మాట్లాడుకోండి

మాట్లాడటం, ఊసులు చెప్పుకోవడం (Romantic Whispers) అనేది ఆరోగ్యకరమైన సంబంధానికి మూలస్తంభం. సెక్స్ విషయంలో ఇది చాలా అవసరం. సిగ్గులేకుండా మీ కోరికలు, ఊహల గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. ఒకరికొకరు మీలోని భావాలను నిజాయితీగా వ్యక్తపరుచుకోండి. లైంగిక సంభాషణలు, శరీర భాగాల అన్వేషణల గురించి మాట్లాడుకోండి. ఆ మాటలే మీలో కోరికను తట్టి లేపుతాయి.

మనోహరమైన వాతావరణాన్ని సృష్టించండి

మీ సంభాషణలకు తోడు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనోహరంగా ఉంటే మీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. మిమ్మల్ని రతిక్రీడకు సిద్ధం అయ్యేలా ప్రేపిస్తుంది. పడకగదిలో ప్రకాశవంతమైన లైట్లను ఆర్పివేసి కొవొత్తుల వెలుగులు ఉంచడం, సువాసనల పరిమళాలు వెదజల్లే ఏర్పాట్లు చేసుకోవడం, పడకగదిని అందంగా అలంకరించడం వంటివి మీలోని ఇంద్రియాలను (sensual spots) ఉత్తేజపరుస్తాయి.

సమయాన్ని వెచ్చించండి

వెంటనే రంగంలోకి దూకకుండా నెమ్మదిగా ఇద్దరూ దగ్గరయ్యేందుకు ప్రయత్నించండి. మీ భాగస్వామిని దగ్గరకు తీసుకొని కళ్లలో కళ్లు పెట్టి చూడండి, ముంగురులను సింగారించండి, శరీర సుగంధాన్ని ఆస్వాదించండి. ఇలా మీ సాన్నిహిత్యాన్ని పెంచుకోండి, ప్రేమను ప్రేమగా (Lovemaking) పంచుకోండి. ఇందుకోసం కావలసినంత సమయాన్ని వెచ్చించండి.

ఫోర్ ప్లే మరిచిపోవద్దు

అసలు ఆటకు ముందు ఫోర్ ప్లే (Foreplay) ప్రధానం. ఒకేసారి ఫోర్లు, సిక్సులు కొట్టకుండా సింగిల్స్ కోసం ప్రయత్నం చేయండి. భాగసామి ఒళ్లు తడమడం, ముద్దులతో తడి చేయడం, వెచ్చగా హత్తుకోవడం ఇందులో ప్రధానం. సంతృప్తికరమైన శృంగారంలో ఫోర్ ప్లే చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

క్రొత్తగా ప్రయత్నించండి

ఫోర్ ప్లే తర్వాత అసలైన క్రీడలోకి వెళ్లండి. ఇప్పుడు మీరు శృంగారానికి అన్ని మసాలాలు (Spice) వేసినట్లే, ఇక రుచులను ఆస్వాదించడమే తరువాయి. మీ మనసుకు నచ్చినట్లుగా సంతోషంగా సెక్స్ చేయండి. కొత్తకొత్త భంగిమలను ప్రయత్నించండి. వివిధ రకాల భంగమలు కనుగొనండి. అలసి పోయేంత వరకు ఆటను కొనసాగిస్తూనే ఉండి, చివరకు భావప్రాప్తితో (Orgasm) సంతృప్తిగా మీ భోజనాన్ని ముగించండి.

WhatsApp channel

సంబంధిత కథనం