How to Boost Sex Drive | మీ సెక్స్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే..
వివిధ కారణాల వల్ల కొందరిలో లైంగిక సామర్థ్యం, ఆసక్తి తగ్గుతుంది. ఒత్తిడి, వయసు కూడా మీ లైంగిక ఆసక్తికి, సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. మీరు కూడా ఇలానే ఇబ్బంది పడుతున్నారా? అయితే కొన్ని ఆహారపదార్థాలు మీకు శారీరక సంబంధంపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి అంటున్నారు నిపుణులు. అవేమిటో మీరు తెలుసుకోండి.
Improve Sex Drive | చాలా మంది వివిధ కారణాల వల్ల సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోతున్నారు. ఒత్తిడి, ఇతర వ్యాధులు, వృద్ధాప్యంతో పాటు అనేక ఇతర కారణాలు సెక్స్‌పై ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల సెక్స్ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. శారీరక బంధాలు అనేవి ప్రతి ఒక్కరి లైఫ్‌లో చాలా ముఖ్యమైనవి. ఇలా ఇతరత్ర కారణాల వల్ల మీకు దాని మీద ఆసక్తి తగ్గిపోతుందంటే మీరు కాస్త అలర్ట్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైనట్లేనని గుర్తించాలి. అయితే ఈ విషయంపై డాక్టర్ని సంప్రదించి.. చికిత్స తీసుకోవడంతో పాటు.. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే సెక్స్ పట్ల ఆసక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఏమి తింటే మీ సెక్స్ డ్రైవ్ ఇంప్రూవ్ అవుతుందో ఇప్పుడు చుద్దాం.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ రుచికరమైనది మాత్రమే కాదు. ఇది లైంగిక స్థాయిని, సెక్స్ పట్ల ఆసక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి ప్రతి పురుషుడు లేదా స్త్రీ ప్రతిరోజూ కొద్ది మొత్తంలో డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు. పైగా బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
పుచ్చకాయ
సమ్మర్లో దొరికే పుచ్చకాయతో మీ సెక్స్ డ్రైవ్ ఇంప్రూవ్ అవుతుందంటే నమ్ముతారా? మీకు ఇంకో ఛాయిస్ లేదు కచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే పుచ్చకాయ అంగస్తంభన వంటి సమస్యలను తగ్గిస్తుంది. రెగ్యులర్ ప్లే లైంగిక పనితీరును పెంచుతుంది.
అంజీర్
అంజీర్ లైంగిక శక్తిని పెంచడంలో చాలా గొప్పగా పనిచేస్తుంది. ఇది సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి పని చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
వెల్లుల్లి
ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బను భోజనంతో కలిపి తీసుకోండి. దీనివల్ల స్త్రీ, పురుషులిద్దరిలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వెల్లుల్లిని వివిధ రకాల ప్రయోజనాలకు కూడా ఉపయోగిస్తారు.
తేనె, కుంకుమపువ్వు మిశ్రమం
తేనే, కుంకుమపువ్వు కలిపిన మిశ్రమం లైంగిక శక్తిని పెంచడానికి బాగా పనిచేస్తుంది. కానీ ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం. ఎందుకంటే నాణ్యమైన కుంకుమపువ్వు చాలా ఖరీదు ఉంటుంది.
పిస్తా
పిస్తా రక్తపోటును నియంత్రించి.. జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయం చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
మెంతులు
శృంగార సామర్థ్యాన్ని కోల్పోతున్నవారు.. శారీరక సంబంధం పట్ల దాదాపుగా ఆకర్షణ లేకుండా ఉన్నవారు.. మెంతికూరను క్రమం తప్పకుండా తినాలని ఆయుర్వేదం చెప్తుంది. ఇది వారి సమస్యను దూరం చేస్తుందని వెల్లడిస్తోంది.
సంబంధిత కథనం