Happy Weekend Couple | సంతోషకరమైన జంటలు వారాంతంలో ఏం చేస్తారంటే..!
Happy Weekend Couple: వీకెండ్ లో ఎంజాయ్ చేయాలని, వారాంతంలో సరదాగా ఫ్యామిలీతో గడపాలని చాలా మంది కోరుకుంటారు. అయితే సంతోషకరమైన జంటలు వారాంతంలో ఏం చేస్తారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చదవండి.
Happy Weekend Couple: సోమవారం నుండి మళ్లొచ్చే సోమవారం వరకు ఏకధాటిగా వారం రోజుల పాటు వివిధ పనులతో అలసిపోయే శరీరాలకు, మధ్యలో వచ్చే ఆదివారం సెలవు కొంత విశ్రాంతినిస్తుంది. మిమల్ల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడానికి, మీ వ్యక్తిగత పనులు మీరు పూర్తి చేసుకోవడానికి వారాంతంలో లభించే కాస్త సమయం కాస్త ఉపయోగపడుతుంది. అంతేకాదు, బంధాల మధ్య దూరంను దగ్గర చేసేందుకు, ఒకరితో ఒకరు కలిపి సమయం గడిపేందుకు వారాంతం చాలా అనుకూల సమయం. బంధాలు వికసించాలంటే వారాంతంను సద్వినియోగం చేసుకోవాలని మానసిక నిపుణులు, ఫ్యామిలీ థెరపిస్టులు అంటున్నారు.
సంతోషకరమైన జంటలు వారి వారాంతాలలో ఎలా గడుపుతారో, వీకెండ్ ను ఎలా ఆస్వాదిస్తారో వారి అనుభవాలను వివరించారు. మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే చదవండి..
సమయం కేటాయించుకుంటారు
రోజువారీ జీవితంలో ఎవారికి వారు చాలా బిజీగా ఉండటంతో, ఒకరితో ఒకరు సరిగ్గా కలిసి ఉండలేకపోతారు. అయినప్పటికీ వారి మధ్య అన్యోన్యత కొనసాగుతుందంటే వారాంతంలో తమ భాగస్వామి కోసమే పూర్తి సమయం కేటాయించడం. సంతోషకరమైన జంటలు వీకెండ్ వచ్చిందంటే ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోరు, ఒకరికొకరు సమయం కేటాయించుకుంటారు. కలిసి భోజనం చేయడం, కలిసి ఏదైనా సినిమా చూడటం, రాత్రికి ఏదైనా డిన్నర్ ప్లాన్ చేయడం చేస్తారు. ఇద్దరూ కలిసి నిజమైన రూమ్‌మేట్స్ అనిపించుకుంటారు.
సంతృప్తికరమైన శృంగారంలో పాల్గొంటారు
వారం రోజులు పని చేసి అలసిపోయి, నిద్రపోయే జంటలు.. వారాంతంలో మాత్రం మరింత దగ్గరయ్యేందుకు మొగ్గుచూపుతారు. మరింత సాన్నిహిత్యంతో మెలుగుతారు. ఒకరినొకరు కాగిలించుకుంటారు, ఒకరిపై ఒకరు వాలిపోతారు, వేరే ఎలాంటి ఆలోచనలు తీసుకురాకుండా సంతృప్తికరమైన శృంగారం చేస్తారు. వారి కలయికలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తారు. భౌతికంగా ఏకమైన జంటలు, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు, ఇది వారి ఆరోగ్యకరమైన సంబంధానికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
బయటి ప్రపంచాన్ని చూస్తారు
సంతోషకరమైన జంటలు వీకెండ్ లో ఔటింగ్ వెళ్తారు. తమ ఇంటి నుండి బయటకు వచ్చి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు, కలిసి ప్రపంచాన్ని చూస్తారు. సాయంత్రం వేళలో పార్క్‌లో నడక లేదా స్విమ్మింగ్ పూల్ లో కలిసి ఈతకొట్టడం, సమీపంలో ఏదైనా పర్యాటక ప్రదేశానికి ప్రయాణం వంటి కార్యకలాపాలలో పాల్గొంటారు. కొత్త వాతావరణాన్ని భాగస్వామితో కలిసి అనుభవించడం వల్ల మీ బంధానికి నూతన ఉత్తేజం లభిస్తుంది, మీ బంధాన్ని బలోపేతం చేయవచ్చు.
రాబోయే వారం కోసం ప్రణాళిక
వృత్తిజీవితమే కాదు, ఇద్దరి మధ్య వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యం. సంసారం అన్నాక అనేక బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను ఇద్దరూ పంచుకోవడం ద్వారా ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆనందం సదా వారితో ఉంటుంది. కాబట్టి సంతోషకరమైన జంటలు రాబోయే వారం రోజులు పనులను ఎలా పూర్తి చేయాలి, బిల్లులు, కిరాణా సామాగ్రి, ఆసుపత్రికి వెళ్ళడం లాంటివి పూర్తి చేయడం వంటికి ఒక ప్రణాళికను కలిగి ఉంటారు. వ్యక్తిగత- వృత్తి జీవితానికి మధ్య సమతుల్యతను కనుగొంటారు. తద్వారా రాబోయే వారాంతం కోసం తమ వినోదానికి పూర్తి సంసిద్ధం అవుతారు.
భవిష్యత్తు గురించి కలలు కంటారు
అందమైన భవిష్యత్తును అందరూ కోరుకుంటారు. జంటలు తమ భవిష్యత్తు గురించి జంటగా కలలు కనడం ద్వారా ఆనందం రెట్టింపుగా ఉంటుంది. ఇది వారి జీవితానికి లోతైన అర్థాన్ని ఇస్తుంది. ఆ తాత్కాలిక సమయంలోనే తమ జీవిత లక్ష్యాలు, తమ ఫాంటసీలను స్పృషించిన అనుభూతి కలుగుతుంది, ఇందులో భాగంగా ఏదైనా హిల్ స్టేషన్ లో రిటైర్మెంట్ తీసుకోవడం, విదేశాల్లో సెటిల్ అవ్వడం లేదా దూరంగా పచ్చని పంటపొలాల మధ్య ఒక చిన్న ఇంటిలో హాయిగా జీవించడం వంటి కలలు కనడం, ఇలా ఏవైనా కావచ్చు, ఇవి మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. మీరు హాయిగా ఉంటారు.
ఇలా సంతోషకరమైన జంటలు తమ వారాంతంలో ఇలాంటి కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా జీవితాంతం సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారని నిపుణులు పేర్కొన్నారు. మరి మీరు ఏకీభవిస్తారా? ఆలోచించండి.
Also Read: ఇవీ చదవండి!