Sex Dreams and Meanings : సెక్స్ కలలు.. వాటి అర్థాలు.. ఇవి తెలిస్తే మీ మతిపోతుంది!
Sex Dreams and Their Meanings : సెక్స్ లో అందరూ తృప్తి పొందకపోవచ్చు. అది కలల రూపంలో రావొచ్చు. మీ సెక్స్ డ్రీమ్‌ను అర్థం చేసుకోవాలనే కోరిక మీకు ఉండవచ్చు. కొన్ని రకాల శృంగార కలలు వస్తాయి. అవి ఎందుకు వస్తాయో మీకు తెలుసా?
మనం తరచుగా కోరికలను దాచుకుంటాం. అన్ని విషయాలూ బయటకు చెప్పలేం కదా. చెబితే అవతలి వారు ఏమంటారో అనే భయం ఉంటుంది. అంతేకాదు.. అలా సెక్స్(Sex) చేయాలి., ఇలా చేయాలి అని కొంతమంది రోజులో ఊహించుకుంటారు. కానీ పరిస్థితుల కారణంగా చేయలేరు. ఇలాంటివి జరిగినప్పుడే కలల(Dreams) రూపంలో వస్తాయి. కొన్నిసార్లు మనం వాటి గురించి కలలు కంటాం. ఎక్కువగా కలలు మనం సాధించాలనుకునే వాటి గురించే ఉంటాయి. అవి సక్సెస్ అవుతాయో లేదో తర్వాత ముచ్చట. కలల రూపంలో అయితే వస్తాయి. మనసులో దాచుకున్న కోరికలతో లైంగిక పరమైన కలలు వస్తాయి. ఇక్కడ చాలా సాధారణమైన సెక్స్ కలలు, వాటి అర్థాలు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
మాజీతో సెక్స్
సాధారణంగా సెక్స్ కలలలో మన మాజీ కూడా ఒకరు(Sex With an Ex). ఇలాంటి కలలు వస్తే.. మీ మాజీతో మీరు సరిగా చేయలేదని, ఆ జంట మధ్య విషయాలు ఇంకా సరిగ్గా జరగలేదని సూచిస్తుంది. సంబంధాలు అసంపూర్తిగా ముగిసిపోవడంలాంటివి ఈ సెక్స్ కలలకు దారి తీస్తుంది. సెక్స్ అనేది సాన్నిహిత్యానికి అత్యున్నత రూపం అని నమ్ముతారు. మీ మాజీ గురించి ఇంకా కలలు కనడం చేస్తున్నారంటే.. ఇంకా వారిపై మనసులో ఏదో ఓ మూలన కోరిక ఉందని చెప్పవచ్చు.
అపరిచితులతో సెక్స్
కొంతమందికి కలలో శృంగారం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది(Sex with strangers). కానీ చేసేవారి ముఖం మాత్రం కనిపించదు. సెక్స్ గురించి కలలు కనడం తెలియని వ్యక్తి పట్ల మీ ప్రేమను సూచిస్తుంది. తెలియని వాటిని అన్వేషించాలనే కోరిక చాలా మందికి టర్న్-ఆన్‌గా పనిచేస్తుంది. మీరు పబ్లిక్‌లో అపరిచితుడి పట్ల ఆకర్షితులవుతున్నట్లు అనిపిస్తే, మీ నిద్రలో అలాంటి కలలు చాలా సాధారణం.
తెలిసిన వారితో సెక్స్
మనందరికీ మన జీవితంలో స్నేహితులు, సహోద్యోగులు ఉంటారు. వారి పట్ల మన లైంగిక కోరికల గురించి చెప్పడానికి భయపడతాం. కాబట్టి దాని గురించి కలలు కంటాం. తెలిసిన వారి గురించి లైంగిక కలలు కనడం(sex with someone known) అంటే మీరు ఆ వ్యక్తి పట్ల లైంగికంగా లేదా ప్రేమపూర్వకంగా భావాలను పెంచుకున్నారని సూచిస్తుంది.
ప్రముఖులతో సెక్స్
సాధారణమైన సెక్స్ కలలలో ప్రముఖులు(sex with celebrity) కూడా ఉంటారు. మనం తరచుగా వారి గురించి ఎందుకు కలలు కంటున్నామో అర్థం కాని విషయం. కానీ వారి చరిష్మా, బాడీ ఫిట్, వారి అందం పట్ల మనం దాచుకున్న లైంగిక కోరికలను రేకెత్తిస్తాయి. సెక్స్‌లో పాల్గొనాలని మీరు తరచుగా కలలు కనే సెలబ్రిటీతో మీకు నచ్చిన వ్యక్తి ఎలా ఉండాలో గుర్తించొచ్చు. ఇది మీ మానసిక స్థితిని బట్టి కూడా మారవచ్చు.
బహిరంగంగా సెక్స్
పబ్లిక్ సెక్స్(sex in public) కలలు కొంతమందికి వస్తాయి. ఏదో ప్రదేశంలో జరిగినట్టుగా అనిపిస్తుంది. అది ఓపెన్ ప్లేస్ అయి ఉంటుంది. కానీ నిద్రలో మాత్రం.. ఎక్కడో జరుగుతున్న ఫీల్ ఉంటుంది. సెక్స్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూడటానికి ఇష్టపడతామని సూచిస్తుంది. సెక్స్ చేస్తున్నప్పుడు ఏదైనా అరుపులు వినడం, చూడటం లాంటివి వాటితో ఇలా వస్తాయి.
సంబంధిత కథనం
టాపిక్