శృంగారం జీవితం బాగుండాలంటే.. జంటలు ఎన్నిసార్లు పాల్గొనాలి?
జంటల మధ్య ఆరోగ్యకరమైన లైంగిక జీవితం ఉండాలి. అతిగా సెక్స్ చేయడం ఏ రకంగా మంచిది కాదు. ఎన్ని సార్లు శృంగారం చేయడం ఆరోగ్యకరమో సైన్స్ చెప్తోంది. ఈ స్టోరీ చదవండి.
భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢపడటానికి శృంగారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన లైంగిక జీవితం ఉన్నప్పుడు భాగస్వాముల మధ్య ఆనందం ఉంటుంది. అయితే జంటల మధ్య ఆరోగ్యకరమైన శృంగార జీవితం ఉండాలి కానీ, శృంగారమే జీవితం అనేలా ఉండకూడదు.
శృంగారం ద్వారా పొందే సంతృప్తి వ్యక్తి నుండి వ్యక్తికి, అలాగే జంటకు జంటకు మధ్య భిన్నంగా ఉంటుంది. కొంతమంది తక్కువ సందర్భాలలో సన్నిహితంగా ఉండటానికి ఇష్టపడవచ్చు, మరికొందరు రోజుకు చాలాసార్లు శృంగారం చేయడానికి ఇష్టపడతారు. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు, కలిసి సహజీవనం చేస్తున్నప్పుడు రోజూ తమ భాగస్వామితో శృంగారం చేస్తేనే వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. అలా అయితేనే వారు మీపై సంతృప్తిగా ఉంటారు అనేది అపోహ మాత్రమే.
ఒక జంట మధ్య ఎంతవరకు శారీరక సాన్నిహిత్యం అవసరం అనేది నిపుణులు అధ్యయనం చేపట్టారు. ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి జంటలు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి? అనే దానిపై పరిశోధనలు ఏం వెల్లడించాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నిసార్లు శృంగారం చేయడం ఆరోగ్యకరం?
శృంగారం చేయడం అనేది వ్యక్తుల వయసు, అలాగే వారి శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని ఇన్‌సైడర్ నివేదిక వెల్లడించింది. నిజానికి శృంగారంలో పాల్గొనే భాగస్వాములు ఇద్దరూ తమ సాన్నిహిత్యంపై సంతోషంగా, సుఖంగా ఉన్నంత వరకు శృంగారం గొప్ప శ్రేయస్సును తెస్తుంది. అయితే ఇది కొన్నిసార్లు శృంగారం పాలుపంచుకునే వారికి కొంచెం అతిగా ఓవర్ డోస్ కూడా అనిపించవచ్చు.
అమెరికాలోని కిన్సే రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గతంలో ఈ అంశంపై పరిశోధన చేపట్టారు. ఏ వయసులో ఉన్న జంటలు ఏడాదిలో సగటున ఎన్ని సార్లు శృంగారం చేయడం మంచిదో గణాంకాల ప్రకారం తెలియజేశారు. వారి పరిశోధన ప్రకారం.. 18-29 సంవత్సరాల వయస్సు గల జంటలు సంవత్సరానికి దాదాపు 112 సార్లు సెక్స్‌లో పాల్గొనవచ్చు. అలాగే 30-39 ఏళ్ల మధ్య ఉన్న వారు ఏడాదికి సగటున 86 సార్లు పాల్గొనవచ్చు. అంటే వయసు పెరిగే కొద్దీ శృంగారం చేయటం కూడా తగ్గించాలి. 40-49 మధ్య ఉన్న జంటలు ఏడాదికి 69 సార్లు శృంగారం చేయాలి. ఈ లెక్కన మీరు ఒక వయసులో శృంగారం చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నారంటే అది, అదుపులోని శృంగారమే. ఈ అతి అనర్థాలకు దారి తీస్తుందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.
ఇక, పురుషుల విషయానికి వస్తే విపరీతమైన శారీరక శ్రమ, ఎక్కువ సార్లు స్కలనం జరిగినపుడు, అనారోగ్య సమస్యల కారణంగా బలవంతపు శృంగారానికి ఇష్టపడరు. ఇది వారికి పురుషాంగంలో నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
ఈ అంశాల ఆధారంగా, జంటలు సంతృప్తిగా శృంగారం చేయాలంటే వారి మధ్య మంచి కమ్యూనికేషన్, అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.