Intimacy In a Relationship | ప్రేమ చేజారిపోతుందా? మళ్లీ దగ్గరయ్యేందుకు మార్గాలివిగో!
Intimacy In a Relationship: భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం తగ్గితే ఆ బంధం త్వరలోనే చేజారిపోయే అవకాశం ఉంటుంది. ప్రేమ, సాన్నిహిత్యం బలపడాలంటే ఈ చిట్కాలు పాటించండి.
ఆడ, మగ ఇద్దరు కలిసి జీవించాలంటే వారి మధ్య ప్రేమ, సాన్నిహిత్యం అనేది ఉండాలి. ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడే కలిసి జీవించాలని ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ప్రేమ తగ్గినట్లు అనిపిస్తే, అది మరింత లోతైన అర్థాలు వెతకడానికి ప్రేరేపిస్తుంది. ఈ క్రమంలో వారిని దక్కించుకునేందుకు ఎక్కువగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం, మీ పరిధి దాటి వారి స్వేచ్ఛకు భంగం కలిగించడం, వారిని ఒక కంట కనిపెడుతూ ఉండటం చేస్తారు. ఫలితంగా అనుమానాలు పెరిగి, ఒకరి పట్ల ఒకరికి అపనమ్మకం కలుగుతుంది. ఈ పరిస్థితి మీ నుంచి మీ ప్రియమైన వారిని శాశ్వతంగా దూరం చేస్తుంది.
ఒకసారి ప్రేమతో ఒకరికి దగ్గరయ్యాక మళ్లీ ఆ ప్రేమ నుండి బయటపడటం అనేది ఎవరికైనా చాలా కష్టతరమైన దశ. అవతలి వ్యక్తి పట్ల మీ భావాలు మసకబారడం ప్రారంభించినప్పుడు, మీరు వారికి సంబంధించిన విషయాల పట్ల తక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు మీ భాగస్వామితో మాట్లాడటం తగ్గిస్తారు. అంతేకాదు మీ ఇద్దరి మధ్య ప్రేమ, సాన్నిహిత్యం తగ్గిపోతాయి. మీరు మునుపటి విధంగా వారితో కనెక్ట్ అవ్వడం మానేస్తారు, వారిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. ఫలితంగా, ఇంతకాలం నాటి మీ ప్రేమ బంధం ఒక్కసారిగా ముగింపుకు వచ్చేస్తుంది. ఇది కొంతకాలం పాటు తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తుంది. మళ్లీ కొత్త జీవితం ప్రారంభించటానికి చాలా సమయమే పడుతుంది. అందుకే ఈ పరిస్థితి రావద్దు అనుకుంటే ముందు నుంచే మీ బలం దృఢంగా ఉండాలి. కాలం గడిచే కొద్దీ వైన్ రుచిలా మీ బంధం రుచిగా తియ్యగా ఉండాలి.
Intimacy In a Relationship- సంబంధంలో సాన్నిహిత్యం
ఇరువురి మధ్య దీర్ఘకాలికమైన, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన సంబంధానికి ప్రేమతో పాటుగా సాన్నిహిత్యం చాలా అవసరం అని నిపుణులు అంటున్నారు. ఈ సాన్నిహిత్యం భౌతికంగా ఉండాలి, భావోద్వేగపూరితంగా ఉండాలి. అప్పుడే ఇరువురి మధ్య కనెక్షన్ ఎవరు విడదీసే ప్రయత్నం చేసినా, విడిపోనంత దృఢంగా మారుతుంది.మీ సంబంధంలో సాన్నిహిత్యం పెంచడంలో సహాయపడే కొన్ని చిట్కాలను ఇక్కడ పేర్కొన్నాం చూడండి.
శారీరక సాన్నిహిత్యం
మీకు, మీ భాగస్వామికి మధ్య సాన్నిహిత్యం తగ్గకుండా ఉండాలంటే ఇరువురి మధ్య శారీరక సంబంధం చాలా అవసరం. ఇరువురి తనువులు ఏకం అవుతుండాలి. ఈ రకమైన శారీరక స్పర్శ వారికి ఆప్యాయతను తెలియజేస్తుంది, సాంత్వనను కలిగిస్తుంది. మీరు మీ భాగస్వామితో కలిసి నడకకు వెళ్లినప్పుడు గానీ లేదా వారితో కూర్చున్నప్పుడు, మీ చేతులు వారితో సౌకర్యంగా పెనవేసుకోవాలి. ఇది మీ మధ్య బంధాన్ని దృఢపరచటంతో పాటు, మీ ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తుంది.
మాట్లాడకుండా దూరం చేసుకోవద్దు
ఇరువురి మధ్య కనెక్షన్ చనిపోకుండా ఉండటానికి అత్యంత కీలకమైనది కమ్యూనికేషన్. చాలా మంది శారీరకంగా దగ్గరయ్యాక వారితో మాట్లాడటం తగ్గిస్తారు. ఈ గ్యాప్ క్రమక్రమంగా పెరుగుతూనే ఉంటుంది. ఒకానొక దశకు వచ్చేసరికి మీరు మాట్లాడకపోయినా, వారికి అది అలవాటు అయిపోతుంది. ఇదే సమయంలో వారి భావాలను వ్యక్తపరచటానికి వారికి వేరొక తోడు దొరికితే ఇక మీకు సమస్యలు మొదలైనట్లే. కాబట్టి ఎల్లప్పుడూ సరదాగా ఉండండి, వారి అవసరాలు తెలుసుకోండి. మేసేజులు, కాల్స్ చేస్తుండాలి. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి.
దుర్బలంగా ఉండండి
మీరు చాలా ధైర్యవంతులు, తెలివైన వారు అవ్వొచ్చు. అయినప్పటికీ మీరు ఇష్టపడే వ్యక్తి చుట్టూ దుర్బలంగా ఉండటం సరైంది. జీవితంలో వారి అవసరం మీకు ఉన్నట్లు తెలియజేయండి. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడానికి, మీకు ఎల్లప్పుడూ అండగా ఉండటానికి సహాయపడుతుంది. మీరే అంతా అని అనుకోకుండా, ప్రతి విషయంలో ఒకరికొకరు అన్నట్లుగా ఓపెన్‌గా ఉండటం వల్ల మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రేమ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తుంది.
సంబంధిత కథనం