శృంగారం బోర్​ కొట్టకూడదంటే.. ఫోర్​ ప్లే ఉండాల్సిందేనట..-5 ways to include foreplay into your sexual routine ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  5 Ways To Include Foreplay Into Your Sexual Routine

శృంగారం బోర్​ కొట్టకూడదంటే.. ఫోర్​ ప్లే ఉండాల్సిందేనట..

foreplay
foreplay

చాలామంది సెక్స్, ఫోర్ ప్లే ఒకటే అని భావిస్తారని.. కానీ వాస్తవానికి రెండూ పూర్తిగా వేరని.. నిపుణులు చెప్తున్నారు. మీ పర్సనల్ లైఫ్​లో ఫోర్​ ప్లేని నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది మీ బెడ్​ రూమ్​లో, బయట కూడా మీ బంధాన్ని పెంచుతుందని వెల్లడిస్తున్నారు. దీనిని మీ రొటీన్​లో ఎలా భాగం చేసుకోవాలో చిట్కాలు ఇస్తున్నారు.

Spice Up Your Sex Life with Foreplay : ఫోర్​ ప్లేను తమ సెక్స్ లైఫ్​లో దాటవేసే వారు.. మానసికంగా, శారీరకంగా అంత ఉత్సాహంగా ఉండరని అంటున్నారు ఇండియానా యూనివర్శిటీ సెక్సువల్ హెల్త్ ప్రమోషన్ సెంటర్ డైరెక్టర్ డెబ్రా హెర్బెనిక్. "మంచి సెక్స్ కోసం ఫోర్‌ప్లే చాలా కీలకమని ఆయన వెల్లడించారు. కేవలం సెక్స్ మీదనే కాకుండా.. ఫోర్ ప్లే మీదు కూడా కాస్త సమయం వెచ్చించాలి." అంటున్నారు హెర్బెనిక్.

ట్రెండింగ్ వార్తలు

ఫోర్‌ప్లే శారీరక, భావోద్వేగ ప్రయోజనాలను ఇస్తుందని.. కాబట్టి దీనిని మీ లైంగిక దినచర్యలో భాగం చేసుకోవాలని అంటున్నారు. స్త్రీలను లైంగికంగా ప్రేరేపించడంలో, పురుషుడు అంగస్తంభనను పొందడానికి ఫోర్ ప్లే ఉపయోగపడుతుందని వెల్లడించారు. వాస్తవానికి ఫోర్​ప్లే సెక్స్ కంటే ఎక్కువ ఆహ్లాదకరంగా ఉంటుంది.. ఇది సెక్స్​ని మరింత రసవత్తరంగా మారుస్తుందని అంటున్నారు డాక్టర్ హెర్బెనిక్. ఇది జరగకపోతే.. సెక్స్ అనేది ఇద్దరికీ అసౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నాడు.

ఫోర్‌ప్లే అనేది జంట మరింత సన్నిహితంగా ఉండటానికి సహాయపడుతుందని.. అది చివరికి ఇద్దరు భాగస్వాములు మరింత ఉద్రేకం కలిగించేలా చేస్తుందని తెలిపారు. ఫోర్‌ప్లే "ఎమోషనల్ కనెక్షన్‌ని పెంచడం కోసం, కొత్త ఉత్సాహాన్ని నింపడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది." అని హెర్బెనిక్ తెలిపాడు.

ఎలా కమ్యూనికేట్ చేయాలంటే..

మీరు మీ భాగస్వామితో ఫోర్​ప్లే గురించి చర్చించుకోవాలి. వారితో బోల్డ్​గా మాట్లాడకుంటే ఇంకెవరితో మాట్లాడతారు. ఇది మీ మధ్య బంధాన్ని మరింత పెంచుతుందే తప్పా.. మిమ్మల్ని వారి దృష్టిలో తక్కువ చేయదు. ఫోర్‌ప్లే సమయంలో మీ భాగస్వామి ఏమి ఇష్టపడతారు.. ఏమి కోరుకుంటున్నారో మీకు తెలుస్తుంది. దీనివల్ల ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీ భాగస్వామిని ఎలా తాకాలి.. ఎలా ఈ డ్రైవ్​లో ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై మీ ఇద్దరికి ఓ క్లారిటీ ఉంటుంది. కాబట్టి.. ఈవిషయాల గురించి చర్చిస్తే చాలా మంచిది.

ఫోర్‌ప్లేలో మంచి లేదా చెడు పద్ధతి అంటూ ఏమి లేదు. మీరు సెక్స్‌కు వెళ్లడానికి ముందు గంటల తరబడి కౌగిలించుకోవడం, టచ్ చేయడం, ముద్దు పెట్టుకోవడం వంటివి అవసరం లేదు అంటున్నారు హెర్బెనిక్. కొన్ని నిమిషాల ఫోర్ ప్లే మిమ్మల్ని, మీ భాగస్వామిని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుందని తెలిపారు.

ఈ రకంగా ట్రై చేయండి..

మీ భాగస్వామితో డర్టీగా మాట్లడవచ్చు. ఒకరినొకరు స్పర్శించుకోవచ్చు. దీనికోసం డ్యాన్స్ చేయవచ్చు. కలిసి స్నానం చేయవచ్చు. విభిన్న మార్గాల్లో ఫోర్​ప్లేని ట్రై చేయవచ్చు అంటున్నారు డాక్టర్ హెర్బెనిక్. టేస్టీ, మంచి సువాసనను అందించే ఆయిల్స్​తో ఒకరికొకరు మసాజ్ చేసుకోవచ్చని.. లేదంటే చాక్లెట్, ఐస్​ క్రీమ్​లతో ఫన్ చేసుకోవచ్చని.. తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం