shruti haasan: శారీరకంగా ధృడంగా లేను...కానీ మనసు మాత్రం పర్ ఫెక్ట్ అంటున్న శృతిహాసన్
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శృతిహాసన్. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోస్ అనే హార్మోన్ల అసమతుల్యత సమస్యతో బాధపడుతున్నట్లు శృతిహాసన్ వెల్లడించింది.
మ్యూజిక్ తో పాటు వ్యక్తిగత కారణాల వల్ల రెండేళ్ల పాటు సినిమాలకు విరామం ప్రకటించింది శృతిహాసన్. క్రాక్ సినిమాతో తిరిగి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆమె ఈ సినిమా విజయంతో తిరిగి బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో కీలక పాత్రను పోషిస్తోంది. బాలకృష్ణ 107 సినిమాతో పాటు చిరంజీవికి జోడీగా వాల్తేర్ వీరయ్య లోను నటిస్తోంది. ఈ షూటింగ్ లతో బిజీగా ఉన్న ఆమె పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోస్ అనే హార్మోన్ల సమస్యతో చాలా కాలంగా తాను బాధపడుతున్నట్లు షాకింగ్ విషయాల్ని వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
ప్రస్తుతం తాను శారీరకంగా ఫిట్ గా లేనని, కానీ తన మనసు మాత్రం శక్తివంతంగా ఉందని తెలిపింది.. పీసీఓఎస్ కారణంగా రుతుక్రమం సరైన సమయంలో రాకపోవడం, ఇన్ ఫెర్టిలిటీ, ఒబెసిటీ, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటోంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ తో పాటు ఎండో మోట్రియోసిస్ హోర్మన్ల సమస్య గురించి తాను ఇన్నాళ్లు ఎవరితో పంచుకోలేదని తెలిపింది. చెత్త హార్మోన్ల సమస్య నుంచి బయటపడేందుకు చాలా కాలంగా పోరాటం చేస్తున్నానని చెప్పింది.
ఈ హోర్మన్ల అసమతుల్యత, మెటాబాలిక్ ఛాలెంజెస్ ను ఎదుర్కోవడం అంత సులభం కాదని, కానీ తన పోరాటాన్ని మాత్రం ఏ రోజు ఆపడం లేదని చెప్పింది. మనసుకు నచ్చిన ఆహారాన్ని స్వీకరించడం, బాగా నిద్రపోవడం, వర్కవుట్స్ ద్వారా పీసీఓఎస్ నుండి బయటపడేందుకు కృషిచేస్తున్నానని చెప్పింది. అంతుకుమించి తాను చేయగలిగింది ఏమీ లేదని తెలిపింది.
సంబంధిత కథనం