Lollipop | ఈ ఐస్ క్రీమ్ కోన్‌లలో ఒక లాలీపాప్ దాగి ఉంది, దానిని కనిపెట్టగలరా?-lollipop day can you spot the hidden lollipop among ice cream cones ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Lollipop Day Can You Spot The Hidden Lollipop Among Ice Cream Cones

Lollipop | ఈ ఐస్ క్రీమ్ కోన్‌లలో ఒక లాలీపాప్ దాగి ఉంది, దానిని కనిపెట్టగలరా?

Lollipop Day
Lollipop Day (Gergely Dudás)

ఇది ఒక ఆప్టికల్ భ్రమను కలిగించే ఒక చిత్రం. ఇందులో ఉన్న ఐస్ క్రీమ్ లలో ఒక లాలీపాప్ కూడా దాగి ఉంది. దానిని మీరు కనిపెట్టగలిగితే.. ఈ స్టోరీ చదవండి మీకే తెలుస్తుంది.

ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. మన అరచేతిలోనే మీడియా, సోషల్ మీడియా అందుబాటులో ఉంది. ఎప్పటికప్పుడు వార్తలను తెలుసుకోగలుతున్నాం. బోర్ కొడితే ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియాలో చాటింగ్, రీల్స్ ఇలా ఎన్నో రకాల ఆప్షన్లు ఉన్నాయి. అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేపట్టే కొన్ని రకాల ఛాలెంజ్‌లు మనకు మరింత సరదాను అందిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

పజిల్స్, రిడిల్స్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు వంటివి మన మెదడుకు పనిపెడతాయి. ఇక మన ఐక్యూ లెవెల్స్ తెలిపే కొన్ని రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా మనకు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తగులుతాయి.

ఈ క్రమంలో ఒక ఆప్టికల్ భ్రమను కలిగించే ఫోటో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అది మీకోసం ఇక్కడకు తీసుకొచ్చాం. అందులో ఓ విషయాన్ని కనిపెట్టగలిగితే మీరు చాలా తెలివైన వారు. ఎంత త్వరగా కనిపెట్టగలిగితే అంత ఇంటెలిజెంట్ అన్నమాట.

మరి పైన చిత్రంలో లాలీపాప్ ఎక్కడుందో కనిపెట్టండి. ఒకవేళ మీరు ఆ లాలీపాప్ ఎక్కడ ఇమిడిందో కనిపెట్టలేకపోతే దాని జాడను కింద చిత్రంలో ఇచ్చాం. మీరు కనిపెట్టలేని సందర్భంలో మాత్రమే కింది చిత్రాన్ని చూడాలి. ఈ ఛాలెంజ్ స్వీకరించిన వారిలో నిర్ణీత సమయంలో కేవలం 1 శాతం మంది మాత్రమే లాలీపాప్ కనిపెట్టగలిగారట. మరి మీలో ఎంత మంది ఎంత సమయంలో కనిపెట్టగలరో సోషల్ మీడియాలో కమెంట్ చేసి చెప్పండి.

Lollipop Day 2022

<p>Lollipop Day</p>
Lollipop Day

అన్నట్టూ ఈరోజు లాలీపాప్ డే కూడా. ప్రతీ ఏడాది జూలై 20న లాలీపాప్ డేగా జరుపుకుంటారు. చిన్నప్పుడు చాలా మంది లాలీపాప్ కోసం మారాం చేసేవారు. పెద్దయ్యాక అమ్మాయిలు కూడా లాలీపాప్ చాలా ఇష్టంగా తింటారు. లాలీపాప్ ఆవిష్కరణకు గుర్తుగా లాలీపాప్ డేను జరుపుకుంటున్నారు. మీకు లాలీపాప్ దినోత్సవ శుభాకాంక్షలు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్