లైంగిక జీవితంపై ప్రభావం చూపిస్తున్న ఆస్తమా.. ఇలా తగ్గించుకోండి..
చలికాలంలో ఆస్తమా సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. అయితే ఇది మీ లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందా? అంటే అవుననే అంటున్నాయి అధ్యయనాలు. అయితే ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగుతున్న కాలుష్యం వల్ల.. ఆస్తమా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాలుష్య స్థాయిల కారణంగా గాలి నాణ్యత క్షీణించడం అనేది ఆస్తమా ఉన్నవారికి శ్వాస తీసుకోవడం వంటి ప్రాథమిక సమస్యగా మారుతుంది. పైగా చలికాలంలో ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఆస్తమా మీ లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అంటున్నారు నిపుణులు.
అయితే కొన్ని సాధారణ, రోజువారీ అలవాట్లతో ఆస్తమాతో కూడా మీ లైంగిక జీవితాన్ని సులభతరం చేయవచ్చు అంటున్నారు. బ్రిటన్‌కు చెందిన ఆస్తమా UK అనే స్వచ్ఛంద సంస్థ.. సెక్స్ సమయంలో లేదా తర్వాత ఆస్తమా రోగులు ఇన్‌హేలర్‌ను ఉపయోగించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తూ ఒక సర్వేను నివేదించింది. కొందరు వ్యక్తులు సెక్స్ ఫ్రీక్వెన్సీ తగ్గించినట్లు నివేదిక పేర్కొంది. మరికొందరు ఓరల్ సెక్స్ సమయంలో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది.
సెక్స్ అనేది అధిక తీవ్రత కలిగిన వ్యాయామం కంటే తక్కువేమి కాదు. కాబట్టి ఇది శ్వాస రేటును పెంచుతుంది. మీ హృదయ స్పందనను పెంచుతుంది. ఇప్పటికే మీరు శ్వాస సమస్యలతో ఇబ్బందిపడుతూ ఉంటే.. అవి ఆస్తమా లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.
సెక్స్ సమయంలో ఆస్తమా సమస్యలకు గల కారణాలు
* మీరు సాధారణం కంటే ఎక్కువగా బ్రీత్ తీసుకోవచ్చు.
* మీరు అరోమా క్యాండిల్ లేదా పెర్ఫ్యూమ్ ఎసెన్షియల్ ఆయిల్‌ని ఉపయోగిస్తుంటే.. అది ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తుంది.
* లేటెక్స్ కండోమ్‌లు కూడా ఆస్తమా లక్షణాలకు దారితీయవచ్చు.
* కొన్ని పొజిషన్లు శ్వాస తీసుకోవడాన్ని కష్టతరం చేస్తాయి.
* గదిలో దుమ్ము, ధూళి, సిగరెట్ పొగ వల్ల కూడా ఆస్తమా లక్షణాలు ఎక్కువ అవుతాయి.
ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలంటే..
* ఆస్తమా మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని మీరు భావిస్తే.. ఇన్హేలర్ లేదా ఇతర పద్ధతులను ఉపయోగించడం ఉత్తమం.
* మీరు మీ భాగస్వామికి మీ అసౌకర్యం గురించి తెలపండి.
* మీ శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇవ్వండి. బదులుగా ఒక చిన్న విరామం తీసుకోండి.
* మీ ఆస్తమా లక్షణాలను పెంచే సెక్స్ పొజిషన్‌లను నివారించండి.
* మీ శ్వాస సాఫీగా, సౌకర్యవంతంగా ఉన్నప్పుడే లైంగిక చర్యలో పాల్గొనండి.
* సమయానికి ఆస్తమా మందులు వాడాలని గుర్తించుకోండి.
* భారీ భోజనం తీసుకున్న తర్వాత కనీసం 2 గంటల విరామం తీసుకుని.. అప్పుడు శృంగారంలో పాల్గొనండి. మీ పొట్ట నిండుగా ఉంటే.. శ్వాస చాలా వేగంగా ఉంటుంది.
* ధూమపానం, మద్యం సేవించిన తర్వాత దానికి దూరంగా ఉండండి.
* అన్నింటికీ మించి మీ సౌకర్య స్థాయికి ప్రాధాన్యత ఇవ్వండి.
సంబంధిత కథనం