Diwali Hair Care । కాలుష్యంతో జుట్టు నిర్జీవంగా మారితే.. ఇంట్లోనే హెయిర్ స్పా చేసి జీవం పోయండి!-bring damaged hair back to life with instant hair spa at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Bring Damaged Hair Back To Life With Instant Hair Spa At Home

Diwali Hair Care । కాలుష్యంతో జుట్టు నిర్జీవంగా మారితే.. ఇంట్లోనే హెయిర్ స్పా చేసి జీవం పోయండి!

HT Telugu Desk HT Telugu
Oct 25, 2022 11:02 AM IST

Diwali Hair Care: దీపావళి వేళ దుమ్ము, కాలుష్యంతో మీ జుట్టు పొడిగా, నిర్జీవంగా మారిందా? ఇంట్లోనే ఇలా సహజంగా హెయిర్ స్పా చేసుకుంటే మళ్లీ ఆరోగ్యంగా తయారవుతుంది.

Diwali Hair Care
Diwali Hair Care (Unsplash)

Diwali Hair Care: దీపావళి తర్వాత కాలుష్యంతో జుట్టంతా జీవం కోల్పోయి, పొడిగా మారవచ్చు. మళ్లీ మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేయాలనుకుంటే పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉంటూ మీ జుట్టును పార్లర్‌లో చేసేటట్లుగా చేసుకోవచ్చు. ఇందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అయితే ముందుగా జుట్టును శుభ్రం చేసుకోవడం అవసరం. జుట్టులో జిడ్డు ఉంటే శుభ్రపరుచుకోవాలి, ఆ తర్వాత హెయిర్ స్పా చేసుకోవాలి. ఇందుకోసం అనుసరించాల్సిన దశలను ఒక్కొక్కటికి తెలియజేస్తున్నాం. వరుస క్రమంలో అనుసరించండి. ఆ తర్వాత మీ జుట్టు మృదువుగా, ఎంతో అందంగా తయారవుతుంది.

ఆయిలింగ్- షాంపూ

ముందుగా జుట్టుకు కుదుళ్ల నుంచి నూనె పట్టించాలి, ఆపై కొద్దిసేపు మసాజ్ చేసుకోవాలి. నూనె పెట్టిన తర్వాత ఒక 40 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత జుట్టును షాంపూతో కడగాలి. ఇప్పుడు జుట్టుకు హెయిర్ మాస్క్ వేసుకునే సమయం వచ్చింది.

హెయిర్ మాస్క్

హెయిర్ మాస్క్ చేయడానికి అరటిపండు, అలోవెరా జెల్‌ను మిక్సీలో రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. మీరు ఈ హెయిర్ మాస్క్ ను కుదుళ్ల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.

జుట్టుకు ఆవిరి

జుట్టుకు ఆవిరి పట్టడం కూడా చాలా ముఖ్యం. ఈ హెయిర్ మాస్క్‌ను ధరించే స్టీమింగ్ చేసుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటిలో ఒక టవల్‌ను ముంచి, నీరు పిండేసి దానిని జుట్టుకు చుట్టాలి. 5-10 నిమిషాల తర్వాత తీసేసి మళ్లీ తేలికపాటి షాంపూతో కడిగేసుకోండి.

అలోవెరా జెల్

అలోవెరా జెల్ జుట్టుకు కండీషనర్ లాగా పనిచేస్తుంది. షాంపూ చేసిన తర్వాత జుట్టు పొడవుకు కలబంద జెల్ రాయాలి. ఇప్పుడు దీన్ని రెండు నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి.

ఈ రకంగా సహజమైన రీతిలో హెయిర్ స్పా చేసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్