Winter Hair Care Tips । చలికాలంలో ఎలాంటి షాంపూ ఎంచుకోవాలి?-winter hair care tips know what type of shampoo should you use during cold weather ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Winter Hair Care Tips । చలికాలంలో ఎలాంటి షాంపూ ఎంచుకోవాలి?

Winter Hair Care Tips । చలికాలంలో ఎలాంటి షాంపూ ఎంచుకోవాలి?

Published Nov 09, 2022 12:03 AM IST HT Telugu Desk
Published Nov 09, 2022 12:03 AM IST

  • జుట్టు రాలడం, చుండ్రు సమస్యలతో ఆవేదన చెందుతున్నారా? ఈ శీతాకాలంలో మీ జుట్టును ఎలా సంరక్షించుకోవాలో ఇక్కడ 5 చిట్కాలు ఉన్నాయి.

చలికాలంలో వెంట్రుకల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అందమైన జుట్టు కోసం అద్భుత పరిషారాలు ఇక్కడ ఉన్నాయి.

(1 / 7)

చలికాలంలో వెంట్రుకల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అందమైన జుట్టు కోసం అద్భుత పరిషారాలు ఇక్కడ ఉన్నాయి.(Unsplash)

అన్ని వేళలా వేడి నీటి షవర్ స్నానం చేయడం, జుట్టును వేడి గాలిలో ఆరబెట్టడం చేయకండి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. అలాగే అనవసరంగా జుట్టుకు కెమికల్ క్రీమ్స్ వాడితే జుట్టు రాలిపోతుంది. వారానికి 2 లేదా 3 సార్లు మాత్రమే చిక్‌పీ పౌడర్‌తో మీ జుట్టును బ్రష్ చేయడం మంచిది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.  శీతాకాలంలో ఇది తప్పనిసరిగా చేయాలి.

(2 / 7)

చలికాలంలో సరైన షాంపూని ఎంచుకోండి, సాధారణ షాంపూలను ఉపయోగించడం మానేసి, యాంటీ డాండ్రఫ్ షాంపూని కొనుగోలు చేయండి. దీని వల్ల మీ స్కాల్ప్ చాలా సులభంగా క్లీన్ అవుతుంది. అయితే మీ చర్మానికి సరిపోయే షాంపూలను ఎంచుకుని వాడితే మంచిది. షాంపూలో జింక్ పైరిథియోన్ అనే మాలిక్యూల్ ఒక ప్రభావవంతమైన యాంటీ డాండ్రఫ్ ఏజెంట్. ఇది చర్మాన్ని తేమగా చేసి చర్మాన్ని సుసంపన్నం చేస్తుంది. చలికాలంలో మీ జుట్టు సంరక్షణ కోసం వివిధ ఉత్పత్తులను ఉపయోగించకండి.

(3 / 7)

   మీరు షాంపూతో తలస్నానం చేసిన ప్రతిసారీ కండీషనర్‌ను ఉపయోగించడం మర్చిపోవద్దు. షాంపూ జుట్టులోని జిడ్డు, మురికిని తొలగిస్తుంది కాబట్టి, చర్మంలో తేమ తగ్గుతుంది. షాంపూ చేసిన తర్వాత కండీషనర్ అప్లై చేయడం స్కాల్ప్ కోల్పోయిన తేమ తిరిగి వస్తుంది. ఇలా చేయడం వల్ల శిరోజాలు పొడిబారకుండా  నిరోధించవచ్చు.

(4 / 7)

పగటిపూట చల్లని గాలి వల్ల మీ జుట్టు పొడిబారుతుంది కాబట్టి పడుకునేటప్పుడు సీరమ్‌ను అప్లై చేయండి. లేదా హెయిర్ ఆయిల్  రాసుకుని జుట్టును అలాగే వదిలేయండి. ఇలా చేయడం వల్ల ఇది మీ స్కాల్ప్ ను మృదువుగా మార్చుతుంది.

(5 / 7)

 జుట్టుకు కృత్రిమ రంగులను నివారించండి. రంగును పూయడం వల్ల మీ జుట్టు అందంగా కనిపించవచ్చు. కానీ అది శాశ్వతం కాదు, పైగా వాటిలోకి రసాయనాలు మీ జుట్టును చాలా త్వరగా దెబ్బతీస్తాయి, శాశ్వతంగా పాడయ్యే ప్రమాదం కూడా ఉంది.

(6 / 7)

సంబంధిత కథనం

ఇతర గ్యాలరీలు