Dark Chocolate : డార్క్ చాక్లెట్​ను రోజులో కొంత తీసుకుంటే.. ఎన్ని ప్రయోజనాలో..-having dark chocolate daily is good for health and skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dark Chocolate : డార్క్ చాక్లెట్​ను రోజులో కొంత తీసుకుంటే.. ఎన్ని ప్రయోజనాలో..

Dark Chocolate : డార్క్ చాక్లెట్​ను రోజులో కొంత తీసుకుంటే.. ఎన్ని ప్రయోజనాలో..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 06, 2022 01:55 PM IST

Dark Chocolate Health Benefits : చాక్లెట్ తినడానికి ఇష్టపడని వ్యక్తి దొరకడం చాలా అరుదు. కానీ చాక్లెట్స్ తింటే అంత మంచిది కాదు అంటారు కొందరు. కానీ డార్క్ చాక్లెట్స్ తింటే ఎన్నిప్రయోజనాలున్నాయో.. అందుకే నిపుణులు కూడా వాటిని తినమని సూచిస్తారు.

డార్క్ చాక్లెట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
డార్క్ చాక్లెట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Dark Chocolate Health Benefits : మీకు చాక్లెట్స్ ఇష్టమున్నా.. లేకున్నా.. రోజులో ఏదొక టైంలో కాస్త డార్క్ చాక్లెట్ తింటే మంచిది అంటున్నారు నిపుణులు. ఇది మిమ్మల్ని అనేక రకాల ప్రమాదాలనుంచి దూరం చేస్తుంది. ఫలితంగా శరీరానికి మేలు చేస్తుంది. మీ చర్మానికి, గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా డార్క్ చాక్లెట్ తింటే ఎటువంటి ప్రయోజనాలు పొందగలమో ఇప్పడు చుద్దాం.

ముడతలు తగ్గుతాయి..

డార్క్ చాక్లెట్ వయస్సు పెరుగుదల వల్ల వచ్చే ముఖ ముడతలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వారు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలరు. శరీరంలోని కాలుష్య కారకాలను తొలగిస్తుంది. ఫలితంగా ముడతలు తగ్గుతాయి.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది..

గుండె సమస్యలకు ప్రధాన కారణాలలో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది. డార్క్ చాక్లెట్ ఈ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని బాగా తగ్గిస్తుంది. ఫలితంగా ఈ చాక్లెట్‌ని రెగ్యులర్‌గా తినగలిగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చర్మ రక్షణకు..

చర్మం దెబ్బతినడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి సూర్యుని అతినీలలోహిత కిరణాలు. ఈ డ్యామేజ్​ను నివారించడానికి చాలా మంది సన్‌స్క్రీన్‌ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తుంటారు. అయితే అది బయటి నుంచి రక్షణ కల్పిస్తుంది. కానీ లోపల నుంచి కూడా రక్షణ కల్పించాలంటే డార్క్ చాక్లెట్ తినొచ్చు. దాని ఫ్లేవనోల్స్ చర్మానికి రక్షణ అవరోధాన్ని ఏర్పరుస్తాయి. ఇది UV కిరణాలతో పోరాడగలదు.

జ్ఞాపకశక్తి కోసం..

ఏదైనా గుర్తుంచుకోవడంలో సమస్య ఉందా? అయితే డార్క్ చాక్లెట్​ను రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందులోని అనేక పదార్థాలు జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో గొప్పగా సహాయపడతాయి. అంతేకాకుండా.. ఈ రకమైన చాక్లెట్‌లోని కొన్ని పదార్థాలు మెదడు కణాలలో ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి.

సిక్ అయినప్పుడు..

ఒంట్లో మంచిగా లేదా? సిక్​గా ఉందా? అయితే డార్క్ చాక్లెట్ ముక్క తినండి. మనసు చాలా బాగుంటుంది. డార్క్ చాక్లెట్ కార్టిసాల్, ఎపినెఫ్రిన్ అనే రెండు హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. తత్ఫలితంగా మీ మూడ్ కూడా మారుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం