లైంగిక ఆరోగ్యం గురించి అవన్నీ అపోహలే.. మీకు తెలుసా
సెక్స్, లైంగిక ఆరోగ్యం గురించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. లైంగిక విద్యకు సంబంధించిన జ్ఞానం ఉంటే, ఆరోగ్యకరమైన సెక్స్ లైఫ్ ఆస్వాదించవచ్చని చెబుతున్నారు. సెక్స్ గురించి కొన్ని నిజానిజాలు ఇక్కడ తెలుసుకోండి.
మన సమాజంలో సెక్స్ అంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది కానీ, దానిపై సరైన అవగాహన చాలా కొద్దిమందికి ఉంటుంది. సెక్స్ పరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చించరు, చాలా గోప్యంగా ఉంచుతారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని నివేదికలు వెల్లడించిన వివరాల ప్రకారం, చాలా మంది మొదట సెక్స్‌లో పాల్గొంటున్నారు, ఆ తరువాత దాని గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తున్నారు. ముందు రంగంలోకి దూకి, ఆ తర్వాత తేడా వస్తే అప్పుడు వారి సందేహాలకు జవాబులు వెతుక్కుంటున్నారు.
సమస్య వచ్చినపుడు కాకుండా, ఆ సమస్య రాకుండా ముందే లైంగిక విద్యకు సంబంధించి కొంత జ్ఞానం కలిగి ఉండటం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అపోహలతో జీవించకుండా పలు విషయాలపై అవగాహన కలిగి ఉంటే, ఆరోగ్యకరమైన సెక్స్ లైఫ్ ఆస్వాదించవచ్చని చెబుతున్నారు.
Myths About Sex- సైక్స్ గురించి అపోహలు
ఇక్కడ కొన్ని లైంగిక అపోహలు తెలియజేస్తున్నాం. చాలా మందికి అది అపోహ అని ఇప్పటివరకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలుసుకోండి.
పీరియడ్స్‌లో సెక్స్ చేస్తే గర్భం రాదు
పీరియడ్స్ సమయంలో సెక్స్ చేస్తే గర్భం రాదు అనేది అపోహే.. అయితే గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనేది నిజం. నెలసరి ఉన్నప్పుడు సెక్సులో ఎవరూ పాల్గొనడానికి ఇష్టపడరు, ఒకవేళ పాల్గొన్నా గర్భం దాల్చరు. కానీ కొన్ని సందర్భాలలో గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, కొంతమంది మహిళలకు క్రమరహిత పీరియడ్స్ ఉంటాయి. ఋతుస్రావం 24 నుండి 45 రోజుల వరకు ఎప్పుడయినా నెలసరి వస్తుంది. ఇలాంటపుడు అండాశయంలో ఒకటి కంటే ఎక్కువ అండాలు వేర్వేరు సమయాల్లో పరిపక్వం చెందుతాయి. ప్రస్తుతం నెలసరి నడుస్తుండగా అంతకుముందు నాటి ఏదైనా అండం పరిపక్వం చెంది ఉంటే, అలాంటి సమయంలో ఎలాంటి రక్షణ కవచం లేకుండా సెక్స్ చేస్తే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది.
కండోమ్‌లు పూర్తిగా సురక్షితం
STIలు, అవాంఛిత గర్భధారణను నివారించడానికి కండోమ్‌లను ఉపయోగించడం ఉత్తమమైన మార్గాలలో ఒకటి, కానీ అవి 100% సురక్షితమైనవని చెప్పలేం. CDC నివేదిక ప్రకారం, మగవారి కండోమ్ ఫెయిల్యూర్ రేటు దాదాపు 13% ఉండగా, ఆడ కండోమ్ వైఫల్యం రేటు 21% గా ఉంది. అయితే హార్మోన్-ఆధారిత స్త్రీ గర్భనిరోధకాలు గర్భధారణను నివారించడంలో అధిక సక్సెస్ రేటును కలిగి ఉంటాయి, కానీ అవి STIల నుండి ఎటువంటి రక్షణను అందించవు.
యోనిని శుభ్రం చేయడానికి డౌచింగ్ మంచి మార్గం
ఇది నిజం కాదు. యోని అనేది 'స్వీయ-శుభ్రత' కలిగిన అవయవం. ఎప్పటికప్పుడు దానంతటదే శుభ్రం అవుతుంది. సాధారణ స్నానం తప్ప మరే ఇతర ప్రత్యేక శుభ్రతలు అవసరం లేదు. డౌచింగ్ పద్ధతి, ఇతర కెమికల్స్ యోని సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది, బాక్టీరియల్ వాగినోసిస్ వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఎక్కువ సెక్స్ చేయడం వల్ల యోని వదులుగా మారుతుంది
పదేపదే సెక్స్ చేసే వారిలో యోని వదులుగా మారుతుందని భావించడం తప్పు. హార్మోన్లలో మార్పులు, వృద్ధాప్యం వల్ల కూడా ఈ భాగం స్థితిస్థాపకత మారుతుంది. ప్రసవ సమయంలోనూ యోని మారుతుంది. కానీ ఈ వదులవటం అనేది కూడా శాశ్వతం కాదు. శరీరంలోని ఈ భాగం చాలా స్థితిస్థాపకత కలిగి ఉంటుంది. కొంతకాలం విరామం తర్వాత యోని ద్వారం తిరిగి మూసుకుపోతుంది. ఒకవేళ వదులుగా ఉంటే, పెల్విక్ ఫ్లోర్ ఫిజికల్ థెరపీ ద్వారా ఆ ప్రాంతంలోని కండరాలను బలోపేతం చేయవచ్చు.
పురుషుల కంటే స్త్రీలు తక్కువ లేదా ఎక్కువ సెక్స్ డ్రైవ్ కలిగి ఉంటారు
ఇది కూడా అపోహే. సమాజంలోని నిబంధనలు తరచుగా స్త్రీలకు సెక్స్ పట్ల అంతగా ఆసక్తి ఉండదనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. అలాగే పురుషులు కష్టపడి సెక్స్ చేస్తే, స్త్రీలకే ఆనందం ఎక్కువ ఉంటుంది అనే భావన ఉంది. కానీ, అధ్యయనాల ప్రకారం ఇద్దరిలో ఒకేరకమైన అనుభూతి, భావప్రాప్తి ఉన్నట్లు వెల్లడైంది.
సంబంధిత కథనం