Sexual Afterglow। శృంగారం తర్వాత ముఖంలో మెరుపు వస్తుందా? ఆసక్తికరమైన కథనం..!
ఎవరైనా శృంగారం చేసుకుంటే ఆ మర్నాడు వారి ముఖంలో ఒక వెలుగు (Sexual Afterglow) వస్తుందని సరదాగా చెప్పడం మీరు వినే ఉంటారు. మరి ఇందులో నిజముందా? ఈ ఆసక్తికరమైన కథనం చదవండి.
సెక్స్ చేయడం వలన ఆ మరుసటి రోజు ముఖంలో మెరుపు వస్తుందా? ఈ విషయం గురించి మీరు వివిధ సందర్భాలలో సరదాగా చర్చించడం గానీ, ఇతరుల నుండి వినడంగానీ చేసి ఉంటారు. అయితే ఇదే అంశంపై పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. సంతృప్తికరమైన సంభోగం తర్వాత ముఖంలో ఒక నూతన కాంతి వస్తుంది. దీని పోస్ట్‌కోయిటల్ గ్లో (Postcoital Glow) అంటారు. సంభోగ అనంతర కాంతి (Sexual Afterglow ) అని పేరు కూడా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముఖంలో ఈ మెరుపు సుమారు 48 గంటల వరకు ఉంటుందని పలు నివేదికలు పేర్కొన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
శృంగారాన్ని ఆస్వాదించిన వారిలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుందని శాస్త్రవేత్తలు, దీనితో 'ఆఫ్టర్ గ్లో' ఉంటుందని పరిశోధకులు తెలిపారు, అయితే ఈ ఆఫ్టర్ గ్లో ప్రయోజనం ఎంత సమయం పాటు ఉంటుందో తెలుసుకోవడానికి అధ్యయనం చేశారు. ఈక్రమంలో ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి.
Sexual Afterglow అంటే ఏమిటి?
పరిశోధకులు ఆండ్రియా మెల్ట్‌జెరాండ్ తన బృందంతో కలిసి ఈ అధ్యయనం చేశారు. తమ అధ్యయనంలో కొత్తగా వివాహం చేసుకున్న సుమారు 200 జంటలపై స్టడీ చేశారు. ఇందులో భాగంగా 14 రోజుల వ్యవధిలో వారి లైంగిక కార్యకలాపాలను ట్రాక్ చేశారు. శృంగార అనంతర కాంతిపై ఆ జంటలను అడిగి తెలుసుకున్నారు. వెచ్చని శృంగారాన్ని ఆస్వాదించిన తర్వాత కలిగే సుఖమైన సంతృప్తిని Sexual Afterglowగా ఆండ్రియా నిర్వచించారు. ఈ రకంగా సంభోగంలో పాల్గొన్న స్త్రీ, పురుషులిద్దరిలో సంతృప్తి స్థాయిలు ఎలా ఉన్నాయి? ఇంకా కోరిక వృద్ధి చెందిందా? సెక్స్ ఫ్రీక్వెన్సీ ఎంత వంటి అంశాలపై ట్రాక్ చేశారు.
ఆసక్తికరంగా పురుషులు, స్త్రీలు ఇద్దరూ సమానమైన లైంగిక సంతృప్తిని వ్యక్తం చేశారు. వారి సంతృప్తి స్థాయిలు 48 గంటల పాటు ఉన్నట్లు చాలా జంటలు నివేదించాయి. అలాగే కొంతమంది సెక్స్ కోరిక ఇంకా బలపడింది, కొంత మంది జంటలు రోజులో సగటున నాలుగు సార్లు శృంగారాన్ని ఆస్వాదించారని తేలింది.
లైంగిక సంతృప్తిని వ్యక్తం చేసిన భార్యాభర్తలు వైవాహిక సంతృప్తిని పొందుతారని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది వారి మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయటానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదీ చదవండి: సుఖమైన నిద్రకు సుఖ సంసారమే మార్గం
సంబంధిత కథనం