Vaginal Health | యోని ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆడవారు అవి తగ్గించాలి!-women should limit these drinks to maintain vaginal health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vaginal Health | యోని ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆడవారు అవి తగ్గించాలి!

Vaginal Health | యోని ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆడవారు అవి తగ్గించాలి!

HT Telugu Desk HT Telugu
Nov 15, 2022 09:09 PM IST

Vaginal Health: ఆడవారికి యోని ఆరోగ్యం చాలా అవసరం. లేదంటే అది నేరుగా వారి లైంగిక ఆరోగ్యం, సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన యోని కోసం కొన్నింటికి దూరంగా ఉండాలి. అవేంటో చూడండి. Vaginal Health | యోని ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆడవారు అవి తగ్గించాలి!

Vaginal Health- Image used for representation purpose only.
Vaginal Health- Image used for representation purpose only. (shutterstock)

ఆడవారికి శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ప్రత్యేకంగా యోని ఆరోగ్యం చాలా ముఖ్యం. అయినప్పటికీ, చాలా మంది అమ్మాయిలు వారి యోని ఆరోగ్యంపై శ్రద్ధ చూపరు. రజస్వల అయి, పునరుత్పత్తి వయసు ప్రారంభమైనప్పటి నుండి మెనోపాజ్ దశ దాటేంత వరకు, ప్రతి ఒక్కరూ యోని ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. పరిశుభ్రమైన శానిటరీ ఉత్పత్తులు వాడటం, సురక్షితమైన సెక్స్ మాత్రమే కాదు, యోని ఆరోగ్యం కోసం సరైన ఆహారం కూడా తీసుకోవడం ముఖ్యం.

మీకు తెలుసా? కొన్ని రకాల పానీయాలు ఎక్కువగా సేవించడం వలన కూడా మీ యోని ఆరోగ్యం పాడవుతుంది. ఫలితంగా యోని పొడిబారుతుంది, లోపల దురద, మంట సమస్య పెరుగుతుంది. సాధారణంగా చాలా మంది అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు, ఆహార పానీయాలు తీసుకుంటారు. అవి ఆరోగ్యకరమైనవని చాలా మంది భావిస్తారు. కానీ వాటి వల్ల యోని లోపల pH సమతుల్యత దెబ్బతింటుంది. నొప్పి అనేది సహజంగా తగ్గించుకుంటేనే మంచిది. బలవంతంగా నొప్పి నివారణ ప్రయత్నాలు చేసే అవి యోని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇది పలు రకాల లైంగిక సమస్యలు, సంతానం విషయంలో సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

Vaginal Health Care- యోని ఆరోగ్యం కోసం జాగ్రత్తలు

ప్రముఖ గైనకాలజిస్ట్, ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ నీరజ్ శర్మ యోని ఆరోగ్యానికి ఎలాంటి పానీయాలు హానికరమో తెలియజేశారు. యోని బాగుండాలంటే అలాంటి పానీయాలను ఎక్కువగా తాగకూడదని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి.

పసుపు నీరు

నెలసరి సమయంలో చాలా మంది అమ్మాయిలు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పసుపును వివిధ రూపాలలో తీసుకుంటారు. పసుపు కలిపిన నీరు, పాలు తాగుతారు. దీనివల్ల పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది, కానీ పసుపును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఐరన్ లోపం రక్తహీనతకు దారి తీస్తుంది, ఇది మీ లైంగిక ఆరోగ్యం, సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

కాబట్టి అమ్మాయిలు బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి లేదా మెరిసే చర్మం కోసం పసుపు నీటిని ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే తగ్గించండి. రోజూ తాగటం మంచిది కాదు, అప్పుడప్పుడూ తాగితే ఆరోగ్యకరం.

కాఫీ

మూడ్ బాగోలేనపుడు కాఫీ తాగడం అలవాటు. కొంతమంది అమ్మాయిలు కాఫీ తాగకుండా ఉండలేరు. కానీ కాఫీ అధిక మోతాదు యోనిని పొడిగా చేస్తుంది. ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, అమ్మాయిలు కాఫీ ఎక్కువగా తాగటం వలన వారి యోని బయోమ్ దెబ్బతింటుంది. కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్ కలిగి, అది యోని లోపలి పొరను దెబ్బతీస్తుంది. కాఫీలో కెఫీన్ ఉంటుంది, అధిక వినియోగం యోని pH ను భంగపరుస్తుంది. కెఫిన్ వినియోగం మూత్రాన్ని మరింత ఆమ్లంగా మారుస్తుంది.

గ్రీన్ టీ

కాఫీలాగే టీలో కూడా కొంతమేర కెఫీన్ ఉంటుంది. NCBI ప్రకారం, సాధారణ టీలో కెఫిన్ పరిమాణం తక్కువగా ఉంటుంది, కానీ గ్రీన్ లేదా బ్లాక్ టీలో కెఫిన్ సుమారు 90 mg వరకు ఉంటుంది. మంచి ఫిజిక్ కోసం, బరువు నియంత్రణ కోసం కొంతమంది అమ్మాయిలు గ్రీన్ టీ తరచుగా తాగుతుంటారు. కానీ, ఈ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా లేదా డీహైడ్రేషన్‌కు కారణం కావచ్చు. ఇది మీ యోని ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది, యోనిని పొడిబారేలా చేస్తుంది.

స్పైసీ డికాక్షన్‌

డికాక్షన్‌లో లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క మొదలైనవి వేసుకొని తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శీతాకాలంలో ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి, ఇన్‌ఫెక్షన్‌ను దూరం చేయడంలో సహాయపడతాయి. అయినప్పటికీ, అవి మీ యోని pHని చెరిపేస్తాయి. కారణం అవి వేడి ప్రభావాన్ని కలిగి ఉండటమే. అందుకే రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.

శీతల పానీయాలు

శీతల పానీయాలు, సోడా, ఫిజీ డ్రింక్స్ ఆరోగ్యానికి ఏ విధంగానూ ఉపయోగపడవు. ఇవి మీ యోని ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయని మీకు తెలుసా? శీతల పానీయాలు ఎక్కువగా వల్ల మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారి తీస్తుంది. అంటే యోని ఇన్ఫెక్షన్. అదనంగా, ఇది మీ లిబిడోను కూడా ప్రభావితం చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం