Turmeric Tea । శీతాకాలం సమస్యలకు ఒక కప్పు 'పసుపు టీ' తో చెక్ పెట్టండి!-beat the winter blues with a cup of turmeric tea here is recipe in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Turmeric Tea । శీతాకాలం సమస్యలకు ఒక కప్పు 'పసుపు టీ' తో చెక్ పెట్టండి!

Turmeric Tea । శీతాకాలం సమస్యలకు ఒక కప్పు 'పసుపు టీ' తో చెక్ పెట్టండి!

HT Telugu Desk HT Telugu

Turmeric Tea Recipe: శీతాకాలంలో హెర్బల్ టీలు తాగితే చాలా మంచిది. అందులో పసుపు టీ తాగితే మరెంతో మంచిది. పసుపు టీ ఎలా చేసుకోవాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.

Turmeric Tea Recipe (Unsplash)

సాయంత్రం వేళలో ఒక కప్పు టీ తాగితే చాలా రిలీఫ్‌ గా అనిపిస్తుంది. అయితే మమూలు టీ కాకుండా హెర్బల్ టీ వంటివి తీసుకుంటే టీ తాగినట్లు ఉంటుంది, ఆరోగ్యమూ బాగుంటుంది. మనకు సహజంగా అందుబాటులో హెర్బల్ టీలలో పసుపు టీ ఒకటి. ఇది యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ సమ్మేళనాల సంపూర్ణ కలయిక.

పసుపు చాలా శక్తివంతమైన సుగంధ ద్రవ్యం, ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరచడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకాఅ ఈ పసుపు టీలో అల్లం చేర్చడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫలితాలు రెట్టింపు అవుతాయి.

పసుపు టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పసుపు చాలా శక్తివంతమైన కాలేయాన్ని శుభ్రపరిచే సుగంధ ద్రవ్యం కాబట్టి ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లం చేర్చడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫలితాలు రెట్టింపు అవుతాయి. అదనంగా నల్ల మిరియాలు, తేనే కూడా కలుపుకోవచ్చు. ఈ శీతాకాలంలో ఇలాంటి ఒక పానీయాన్ని సేవించడం ఎంతో అవసరం.

శీతాకాలంలో ఇలాంటి ఒక పానీయాన్ని సేవించడం ఎంతో అవసరం. పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపి, సీజనల్ వ్యాధులకు ఎదుర్కునే శక్తిని ఇస్తుంది. చలికాలంలో వచ్చే సైనస్, జలుబులతో పాటు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మరి ఆలస్యం ఎందుకు? పసుపు టీ తయారు చేయటానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి. పసుపు టీ రెసిపీ ఈ కింద చూడండి.

Turmeric Tea Recipe కోసం కావలసినవి

  • 1/2 టీస్పూన్ పచ్చి పసుపు
  • 1/2 tsp అల్లం తురుము
  • 1/4 స్పూన్ నల్ల మిరియాలు
  • 1 స్పూన్ తేనె
  • 2 కప్పుల నీరు

పసుపు టీ రెసిపీ- తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో నీరు వేడి చేయండి, అనంతరం పైన పేర్కొన్న వాటిలో తేనె మినహా మిగతావీ అన్నీ వేసి మరిగించండి.
  2. నీరు సగానికి ఇనికిపోయాక ఒక కప్పులోకి ఫిల్టర్ చేసుకొని, రుచికోసం తేనెను కావలసిన మేర కలుపుకోండి.

అంతే, ఇదే పసుపు టీ. వేడివేడిగా తాగేయండి.

సంబంధిత కథనం