Guava for Health। శీతాకాలంలో మీ ఆరోగ్యం కోసం తినండి జామ.. విశ్వదాభిరామ వినురవేమ!
Guava for Health: ఈ శీతాకాలంలో జామపండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ జామపండు, దాని ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, ఏ విధంగా మేలు చేస్తుందో చూడండి.
కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచివని మనందరికీ తెలుసు. ప్రతీ కాలంలో మనకు కొన్ని రకాల పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తాయి, ఈ శీతాకాలం సీజన్‌లో జామపండ్లను ఎక్కువగా లభిస్తాయి. ఈ జామ పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్స్ ఉంటాయి. జాంపండు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది.
జామపండ్లే కాదు జామ ఆకులు కూడా ఆరోగ్యానికి కొన్ని విధాల మేలు చేస్తుంది. జామ ఆకులతో టీ తయారు చేసుకొని తాగవచ్చు. అలాగే ఆకులను ఎండబెట్టి, పొడి చేసి నీటితో కలిపి తీసుకుంటారు.
మొత్తంగా జామను పండు రూపంలో తినవచ్చు, జామ ఆకులను కూడా వివిధ రూపాలలో తీసుకోవచ్చు. రెండింటితోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే జామ ఆకులలోనూ ఔషధ గుణాలు ఉంటాయని, కాబట్టి వీటిని విస్మరించవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Guava Leaf Health Benefits- జామ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకులు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.
బ్లడ్ షుగర్ నియంత్రణ
ఒక అధ్యయనం ప్రకారం, భోజనం తర్వాత జామ ఆకు టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఈ ప్రభావం రెండు గంటల పాటు ఉంటుంది. అదే సమయంలో, మరొక అధ్యయనం ప్రకారం, టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు జామ ఆకు టీ ఇచ్చినప్పుడు, తిన్న తర్వాత వారి రక్తంలో చక్కెర 10 శాతానికి పైగా తగ్గింది.
పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది
ఆడవారికి పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే జామ ఆకులు తీసుకుంటే ప్రభావవంతంగా పనిచేస్తాయి. జామ ఆకుల సారం నెలసరి నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, జామ ఆకుల రసం ప్రభావం పెయిన్ కిల్లర్ కంటే ఎక్కువగా ఉంటుంది.
డయేరియాను పోగొడుతుంది
జామ ఆకులు విరేచనాలలో కూడా మేలు చేస్తాయి. మీకు విరేచనాలు ఉంటే, జామ ఆకు సారాన్ని సేవించాలి. ఇలా చేస్తే డయేరియా త్వరగా నయమవుతుంది. జామ ఆకులు యాంటీ మైక్రోబియల్ అని చాలా అధ్యయనాలు కనుగొన్నాయి. ఇది మీ ప్రేగులలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులను చంపుతుంది.
క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు
జామ ఆకులను క్యాన్సర్ నిరోధకంగా కూడా పరిగణిస్తారు. టెస్ట్-ట్యూబ్ ల ద్వారా నిర్వహించిన కొన్ని ఫలితాల ఆధారంగా, జామ ఆకులు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలవని రుజువైంది. జామ ఆకుల్లోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సెల్ డ్యామేజ్‌ని నిరోధించి, క్యాన్సర్ కారకంగా మారకుండా నిరోధిస్తాయి.
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి
జామపండు లాగానే దీని ఆకులో కూడా విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. ఆకులు యాంటీ మైక్రోబియల్, ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షిస్తాయి.
టీ తాగండి లేదా పౌడర్ తీసుకోండి
జామ ఆకులను ఎండబెట్టి, నీటిలో మరిగించి, తేనెతో కలిపి, టీగా త్రాగవచ్చు. అదే సమయంలో, మీరు ఆకు పొడిని తయారు చేసి గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగవచ్చు, సలాడ్‌లు, సూప్‌లు మొదలైన వాటిలో చల్లుకోవచ్చు.
సంబంధిత కథనం