Coriander Leaves Tea । రోజూ ఉదయం కొత్తిమీర ఉడికించిన నీటిని తాగండి.. ఎందుకంటే?!
Coriander Leaves Tea: ప్రతిరోజూ ఉదయం కొత్తిమీర ఉడికించిన నీటిని తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గటం, మెరిసే చర్మం మొదలుకొని నిద్రలేమి, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి. మరింత సమాచారం చూడండి.
కొత్తిమీర దాదాపు అందరూ తమ వంటల్లో ఉపయోగిస్తారు. కొత్తిమీరను ఆహారంలో కలపడం లేదా పైనుంచి చల్లటం చేస్తారు. ఇది కేవలం గార్నిషింగ్, ఫ్లేవర్ కోసమే కాకుండా పలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. కొత్తిమీర సువాసన గల ఒక మూలిక, ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది మీ బ్లడ్ షుగర్‌ని తగ్గించడానికి, ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి అలాగే గుండె, మెదడు, చర్మం, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కొత్తిమీరలో పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోజూ ఉదయం ఉడికించిన నీటిలో కొత్తిమీర వేసుకొని 'టీ' (Coriander Leaves Tea) లాగా చేసుకొని తాగితే, ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.
ఇది రోగనిరోధక శక్తిని పెంచి, అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణకు, చర్మంలోని కాంతిని తిరిగి తీసుకు రావటానికి, నిద్రలేమి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజూ ఉదయం కొత్తిమీర ఆకులను ఉడికించిన నీటిని తాగండి.
Coriander Leaves Tea Recipe
ఒక కుండలో ఒక కప్పు నీటిని ఒక నిమిషం పాటు మరిగించండి. నీరు మరిగిన తర్వాత అందులో ఒక స్టార్ సోంపు, ఒక చిటికెడు ఉప్పు వేసి ఒక నిమిషం పాటు ఉడికించడి, ఆపై కొత్తిమీర ఆకులు వేసి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు ఈ నీటిని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోండి. ఇదే కొత్తిమీర టీ.
Coriander Leaves Tea Health Benefits:
ఉడికించిన కొత్తిమీర నీటిని తాగటం వలన కలిగే ప్రయోజనాలు
మెరుగైన జీర్ణక్రియ
కొత్తిమీర ఆకులలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యను నివారించవచ్చు.
కాలేయ శుద్ధి
కొత్తిమీర ఆకుల రసం గొప్ప డిటాక్స్ డ్రింక్‌గా పరిగణించవచ్చు, ఎందుకంటే ఇది మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది, రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.
బరువు నియంత్రణ
మీరు బరువు తగ్గాలనుకుంటే, ఒక గ్లాసు నీటిలో మూడు టేబుల్ స్పూన్ల ధనియాలను ఉడకబెట్టండి. నీరు సగానికి తగ్గినప్పుడు, దానిని ఫిల్టర్ చేయండి. ఈ నీటిని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు.
మెరిసే చర్మం కోసం
కొత్తిమీర ఆకుల రసం రక్తాన్ని నిర్విషీకరణ చేస్తుంది, అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ఇది చర్మంపై మొటిమలు, మచ్చలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ఇది బ్లాక్‌హెడ్స్‌ను తొలగిస్తుంది, వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది.
జీవక్రియకు బూస్టింగ్
కొత్తిమీర ఆకులను మరిగించిన నీటిని తాగడం వల్ల శరీరంలో జీవక్రియలు పుంజుకుని శక్తి లభిస్తుంది. కడుపు ఎక్కువసేపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీని కారణంగా ఆహారం తినాలనే కోరిక కలగదు, తద్వారా పేగులకు ఆహారాన్ని జీర్ణం చేయడానికి తగినంత సమయం లభిస్తుంది.
అలసట వెంటనే తొలగిపోతుంది
కొత్తిమీర ఆకులను మరిగించిన నీటిని తాగడం ద్వారా, అలసట వెంటనే తొలగిపోతుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పార్కిన్సన్స్, అల్జీమర్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో సహా అనేక మెదడు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరం, మనస్సును ఒత్తిడి లేకుండా ఉంచడంలో సహాయపడతాయి.
ఎముకల ఆరోగ్యం
కొత్తిమీరలో కాల్షియం కూడా ఉంటుంది, ఇది మీ ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
సంబంధిత కథనం