Coriander benefits: రోజు కొత్తిమీర జ్యూస్‌ తాగితే ఎన్నో ప్రయోజనాలో తెలుసా?-coriander has multiple health benefits surprising health benefits of coriander ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coriander Benefits: రోజు కొత్తిమీర జ్యూస్‌ తాగితే ఎన్నో ప్రయోజనాలో తెలుసా?

Coriander benefits: రోజు కొత్తిమీర జ్యూస్‌ తాగితే ఎన్నో ప్రయోజనాలో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Aug 22, 2022 08:43 PM IST

Coriander health benefits: కొూత్తిమీరలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతి రోజు కొత్తిమీర జ్యూస్ తాగడం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Coriander juice
Coriander juice

కొత్తిమీర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజువారి ఆహారంలో దీనిని తీసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే బరువును అదుపులో ఉంచుతుంది. కొత్తిమీరను నీళ్లలో మరిగించి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే పొటాషియం, క్యాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం మన శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుకుందాం.

కొత్తిమీర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది

బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు కొత్తిమీర నీళ్లు తాగాలి. ఇందుకోసం కొత్తిమీరను నీటిలో వేసి మరిగించాలి. నీరు సగం ఉన్నప్పుడు, దానిని ఫిల్టర్ చేసి.ఆ నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు. దీన్ని రోజుకు రెండుసార్లు త్రాగాలి.

2. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది

కొత్తిమీర నీరు తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఈ నీటితో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు దీనిని తీసుకోవాలి.

3. ఉదర వ్యాధులకు దివ్యౌషధం

కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొత్తిమీర నీరు మేలు చేస్తుంది. కొత్తిమీర నీరు తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు కొత్తిమీరతో పాటు జీలకర్ర, టీఆకులు, పంచదార వేసి ఉడికించాలి. ఈ నీటిని తాగడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

4. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది

కొత్తిమీర నీరు డయాబెటిస్‌లో ఉపశమనం కలిగిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు దీని నీటిని తాగాలి. దీన్ని తాగడం వల్ల రక్తంలో ఇన్సులిన్ పరిమాణం సరిగ్గా ఉండి, మధుమేహం అదుపులో ఉంటుంది.

5. కళ్లకు విశ్రాంతినిస్తుంది

కళ్ల మంటలు, కళ్లలో నీళ్లు కారడం వంటి సమస్యలు ఉన్నవారు కొన్ని కొత్తిమీర గింజలను మెత్తగా చేసి నీటిలో మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి మందపాటి గుడ్డతో వడకట్టి కళ్లలో రెండు చుక్కలు వేయాలి. ఇది ఉపశమనం కలిగిస్తుంది.

6. పీరియడ్స్ కు కొత్తిమీర ఔషధం

పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలు ఉన్న మహిళలు. సమయానికి పీరియడ్స్ రాని వారు, లేదా సాధారణం కంటే ఎక్కువగా ఉన్నవారు కొత్తిమీర నీళ్లలో పంచదార కలిపి తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలుగా, సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. వాటిని ఉపయోగించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం