విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారా? అయితే ఈ పండ్లను తినండి!-vitamin c deficiency tips to acquire it through food ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారా? అయితే ఈ పండ్లను తినండి!

విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారా? అయితే ఈ పండ్లను తినండి!

HT Telugu Desk HT Telugu
Jun 24, 2022 10:17 PM IST

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారంలో విటమిన్స్ తప్పనిసరిగా ఉండాలి. వీటి లోపం కారణంగా అనేక ఆనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి.

<p>vitamin c</p>
vitamin c

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి శరీరానికి అన్ని రకాల విటమిన్‌లు అవసరం. ముఖ్యంగా 'విటమిన్-సి' శరీరానికి ఎంతగానే ఉపయోగపడుతుంది. శరీరంలో అనేక రసాయన చర్యలు సజువుగా జరగడంలో సహాయపడుతుంది. ఇది మన శరీరంలోని నరాలకు, కణాలకు శక్తిని అందించడానికి పనిచేస్తుంది. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది శరీరంలోని కణాలను బంధించి అవయవాలను ఆకృతి దెబ్బ తినకుండా చూస్తుంది.విటమిన్ సి మీ శరీరంలోని రక్త నాళాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

మరీ శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి . అటువంటి పరిస్థితిలో ఎలాంటి ఆహారం తీసుకుంటే విటమిన్ సి లోపాన్ని కవర్ చేయెుచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ సి లోపం ఉన్న వ్యక్తులు

ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్, సిగరెట్లు తీసుకునే వారిలో విటమిన్ సి లోపం ఉంటుంది. అలాగే కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో విటమిన్ సి లోపం ఉంటుంది.

విటమిన్ సి ఎక్కువగా పండ్లలో లభిస్తోంది. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:

విటమిన్ సి ఉన్న పండ్లు -

ఆరెంజ్, గ్రీన్, రెడ్ క్యాప్సికమ్, అరటి, బ్రోకలీ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, పైనాపిల్, కివీ, నిమ్మ, మామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీరు కూడా విటమిన్ సి లోపంతో బాధపడుతున్నట్లయితే, మీరు మీ ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవచ్చు.

విటమిన్ సి లోపం యొక్క లక్షణాలు -

గాయాలు త్వరగా మానవు -

గాయం రక్తంలో విటమిన్ సి స్థాయిని తగ్గిస్తుంది. కొల్లాజెన్ తయారు చేయడానికి శరీరానికి విటమిన్ సి అవసరం. కొల్లాజెన్ అనేది చర్మంలో కనిపించే ప్రోటీన్. ఇది చర్మానికి కావాల్సిన పోషణ అందుతుంది, గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రొటీన్ స్కిన్ రిపేర్ కోసం పనిచేస్తుంది. విటమిన్ సి ఇక్కడ సహయపడుతుంది. ఇది విటమిన్ సి లేకపోవడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పదార్థాలు అందవు. గాయం మానడానికి చాలా సమయం పడుతుంది.

ముక్కు, చిగుళ్ళ నుండి రక్తస్రావం -

విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. ముక్కు నుండి నిరంతరంగా రక్తస్రావం అవుతున్నట్లయితే, విటమిన్ సి లోపంగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది.

బరువు పెరుగుట -

శరీరంలో విటమిన్ సి లేకపోవడం బరువు పెరగడానికి దారితీస్తుంది. విటమిన్ సి శరీరం కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

ముఖం మీద ముడతలు -

విటమిన్ సి లోపం వల్ల చర్మం చాలా పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. విటమిన్ సి లేకపోవడం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయి. అకాల వృద్ధాప్యం కూడా ఏర్పడుతుంది. విటమిన్ సిలోని యాంటీఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్స్ చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

అలసట, చిరాకు -

విటమిన్ సి లోపం తరచుగా అలసట, చిరాకుకు దారితీస్తుంది. ఈ విటమిన్ శరీరంలోని కార్నిటైన్‌ను తగ్గిస్తుంది. ఇది జీవక్రియను, శక్తిని పెంచుతుంది. విటమిన్ సి లోపం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం