Pineapple Tea Recipe। రిఫ్రెష్ అవ్వాలంటే తాగండి పైనాపిల్ టీ.. ఇది ఎంతో టేస్టీ!-refresh yourself with the delicious pineapple tea recipe inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Refresh Yourself With The Delicious Pineapple Tea, Recipe Inside

Pineapple Tea Recipe। రిఫ్రెష్ అవ్వాలంటే తాగండి పైనాపిల్ టీ.. ఇది ఎంతో టేస్టీ!

HT Telugu Desk HT Telugu
Sep 06, 2022 05:47 PM IST

మిమ్మల్ని రిఫ్రెష్ చేసే ఒక ప్రత్యేకమైన పైనాపిల్ టీ రెసిపీ ఇక్కడ ఇస్తున్నాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా రుచికరమైనది కూడా. ఎలా చేయాలో చూడండి.

Pineapple Tea
Pineapple Tea (Unsplash)

మనకు సాయంత్రం వేళ టీ టైంలో గుర్తుకొచ్చేదేంటి? ఇంకేంటి.. టీనే. వేడివేడిగా కప్ చాయ్ తాగితే మైండ్ రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. బాడీ కంట్రోల్‌లో ఉంటుంది. అయితే మనకు టీలలో అల్లంటీ, లెమన్ టీ వంటివి సాధారణంగా అందుబాటులో ఉండే ఫ్లేవర్లు. బటర్ ఫ్లై టీ, చామంతి టీ వంటి కొన్ని రకాల హెర్బల్ టీలు బహుళ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అయితే ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల టీ ఫ్లేవర్లు మనకు అందుబాటులో ఉన్నా వాటి గురించి మనకు ఎక్కువగా తెలియదు. అందుకే అలాంటి ఒక టీ రెసిపీని మీకు ఇక్కడ పరిచయం చేస్తున్నాం.

మీరు పైనాపిల్ జ్యూస్ తాగి ఉంటారు, మరి పైనాపిల్ టీ ఎప్పుడైనా తాగారా? ఈ పైనాపిల్ టీ సాయంత్రం వేళ ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అవుతుంది. ఈ పండు తియ్యగానే ఉంటుంది కాబట్టి ఇందులో చక్కెర వేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు తీపి ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇందులో అల్లం, దాల్చినచెక్క, లవంగాలు వేసుకుంటే కొద్దిగా, కొద్దిగా తీపితో ఒక విభిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ టీని వేడిగా తాగవచ్చు లేదా ఐస్ ముక్కలు వేసుకొని చల్లగా కూడా తాగవచ్చు. మరి ఆలస్యం చేయకుండా పైనాపిల్ టీ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోంది.

Pineapple Tea కోసం కావలసినవి

• 1 పైనాపిల్

• 10 కప్పుల నీరు

• 1/4 కప్పు బ్రౌన్ షుగర్

• 1 టీస్పూన్ వెనీలా ఎసెన్స్

• 1 స్టిక్ దాల్చిన చెక్క

• 6 - 8 లవంగాలు

• 1 చిన్న తాజా అల్లం ముక్క, తరిగినది

తయారీ విధానం

  1. ముందుగా పైనాపిల్ పండును తీసుకొని, శుభ్రంగా కడిగి, పైభాగం, కింది భాగం కట్ చేయాలి మిగతా భాగాన్ని ఉపయోగించాలి. ఈ పండును తొక్కతీసుకోవాలి. ఈ తొక్కలతోనే టీ తయారు చేస్తాము. బొడిపెలతో కూడిన తొక్కలను పండు పై నుంచి కిందవరకు పొడవుగా కట్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో సరిపడా నీరు వేడిచేసి అందులో పైనాపిల్ పండు తొక్కలు, అల్లం ముక్క వేసి ఉడికించండి.
  3. అనంతరం బ్రౌన్ షుగర్, వెనీలా ఎసెన్స్, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మీడియం ఫ్లేమ్ మీద మరిగించాలి.
  4. ఆ తర్వాత ఈ పానీయాన్ని వడకట్టి ఒక జార్ లోకి తీసుకోవాలి. లేత పసుపు రంగు పానీయంలా కనిపిస్తుంది.

అంతే, ఇదే పైనాపిల్ టీ. దీనిని సర్వింగ్ కప్పులో పోసుకొని తాగండి. లేదా చల్లబరిచి ఐస్ ముక్కలు వేసుకొని కూడా తాగవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్