Teas for Headaches | తలనొప్పిగా ఉందా? అయితే ఈ రకమైన హెర్బల్ టీలు తాగండి!
తలనొప్పిగా ఉంటే ఒక కప్ చాయ్ తాగటం చాలా మందికి అలవాటు. అయితే ఈ తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. మధ్యాహ్నం సరైన భోజనం చేయకపోయినా అది తలనొప్పికి దారితీస్తుంది. మీకు తలనొప్పి దీర్ఘకాలికంగా ఉంటే ఇక్కడ కొన్ని చాయ్ రకాలు ఉన్నాయి. వీటిని తాగి చూడండి.
తలనొప్పిగా ఉంటే ఒక కప్ చాయ్ తాగటం చాలా మందికి అలవాటు. అయితే ఈ తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. మధ్యాహ్నం సరైన భోజనం చేయకపోయినా అది తలనొప్పికి దారితీస్తుంది. మీకు తలనొప్పి దీర్ఘకాలికంగా ఉంటే ఇక్కడ కొన్ని చాయ్ రకాలు ఉన్నాయి. వీటిని తాగి చూడండి.
(1 / 7)
తేమతో కూడిన వాతావరణం, ఆఫీసులో పని ఒత్తిడి ఇతరత్రా కారణాల చేత మనం తరచుగా తలనొప్పిని ఎదుర్కొంటాము. సాయంత్రం వేళ ఒక టీ తాగకపోతే మనకు పనిచేయాలని కూడా అనిపించదు. మీరూ తలనొప్పి నుంచి వెంటనే రిలీఫ్ అవ్వాలంటే అందుకు మామూలు టీ కాకుండా స్పెషల్ టీ తాగాలి.
(Unsplash)(2 / 7)
అల్లం టీ తలనొప్పిని నయం చేయడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్స్ జీర్ణశక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. మధ్యాహ్నం నుంచి మీకు తలనొప్పి సమస్య వేధిస్తుంటే ఒక కప్ అల్లం టీ తాగండి.
(Unsplash)(3 / 7)
మీరు మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటే అందుకు తులసి టీ అద్భుతమైన నివారణ. ఒక కప్పు టీలో తులసి ఆకులను కలిపి తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా తులసి టీకి ప్రాధాన్యం ఉంది.
(Unsplash)(4 / 7)
పుదీనా టీ గ్యాస్ట్రిక్ సమస్యలు, ఒత్తిడి, ఆందోళనను నయం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇది తలనొప్పిని నయం చేయడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
(Unsplash)(5 / 7)
గ్రీన్ టీ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది కండరాలను బలోపేతం చేయడంలో, శరీరంలో నొప్పిని తీసివేయడంలో కూడా సహాయపడుతుంది.
(Unsplash)(6 / 7)
లావెండర్ టీ శరీరాన్ని డీటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. ఈ టీ తాగితే తలనొప్పి, మైగ్రేన్ లక్షణాలు తగ్గుతాయి. మంచి నిద్రను కలిగించడంలో కూడా సహాయపడుతుంది.
(Unsplash)ఇతర గ్యాలరీలు