చాలా మందికి ఉదయం ఛాయ్ లేనిదే రోజు ప్రారంభం కాదు. మన ఇండియాలో ఎన్నో రకాల ఛాయ్ వెరైటీలు అందుబాటులో ఉంటాయి. అయితే ఆరోగ్యంపైన శ్రద్ధ ఉన్నవారు, ఫిట్ నెస్ కోరుకునేవారు ఎక్కువగా హెర్బల్ టీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ హెర్బల్ టీల లోనూ ఎన్నో వెరైటీలు ఉన్నాయి అందులో ఒక వెరైటీ.. బటర్ ఫ్లై టీ. దీనినే బ్లూ టీ అని కూడా అంటారు. ఈ ఛాయ్ చూడచక్కని నీలిరంగులో ఉంటుంది. దీని కలర్ ఒక హైలైట్ అయితే, ఇది తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా హైలైట్. అంతేకాదు ఇది చేసుకోవడం చాలా తేలిక, దీనికి ఛాయ్ పత్తి కూడా అవసరం లేదు. మరి ఈ బ్లూటీ ఎలా చేసుకోవాలి? ఏమేం కావాలో ఇక్కడ తెలుసుకోండి.
ముందుగా..
ముందుగా శంఖ పూలను సేకరించాలి. ఈ పూలు ఎక్కడైనా విరివిగా లభిస్తాయి. ఈ శంఖపూల మొక్కలు ఎక్కడైనా మొలకెత్తుతాయి.
ఇలా శంఖపూలను సేకరించి 2-3 రోజుల పాటు ఎండ బెట్టుకొని ఆ తర్వాత ఏదైనా సీసాలో నిల్వ చేసుకోవాలి.
బ్లూటీ అనేది కెఫిన్ లేని ఒక ఆయుర్వేద మూలికా ద్రావణంగా చెప్పవచ్చు. దీని ఒక కప్పు టీ తాగితే ఒత్తిడి తగ్గుతుంది. రిలాక్స్ గా అనిపిస్తుంది. ఏదైనా పని ప్రారంభించటానికి మంచి ఉత్సాహం లభిస్తుంది. హెర్బల్ డ్రింక్ కావడంతో శరీర బరువును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా, మూత్రం సజావుగా వస్తుంది, మలినాలు తొలగిస్తుంది, రక్తంలో గ్లూకోజు స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
సంబంధిత కథనం