Avarekalu Upma Recipe : అవరెకైలతో క్రంచీ, టేస్టీ ఉప్మా.. రెసిపీ ఇదే..
Avarekalu Upma Recipe : అవరెకై బీన్స్ మనకు ఈ కాలంలో బాగా దొరుకుతాయి. వాటిని ఉపయోగించి.. క్రంచీ, టేస్టీ ఉప్మాను చేయొచ్చు తెలుసా? అదేంటి అవరెకైతో కూర చేసుకుంటాము కానీ.. ఉప్మా కూడా చేయవచ్చా? అని అనుకుంటున్నారా.. అయితే ఈ రెసిపీ మీకోసమే..
Avarekalu Upma Recipe : అవరెకై ఉప్మా అంటే తెలుగువారికి అంతగా తెలియదు కానీ.. అది కర్నాటక స్టైల్ రెసిపీ అనమాట. ప్రస్తుతం మనకు మార్కెట్లలో దొరికే అవరెకైలను ప్రధానంగా ఉపయోగించి ఈ ఉప్మా చేస్తారు. దీనిని మీరు బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. లేదా డిన్నర్గా చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* రవ్వ - ½ కప్ సూజీ
* ఉల్లిపాయ - 1 మీడియం (తరిగినవి)
* అవరెకై - ¾ లేదా 1 కప్పు (ఉడికించినవి)
* ఆవాలు - ½ టీస్పూన్
* జీలకర్ర - ½ టీస్పూన్
* మిన పప్పు - ½ టీస్పూన్
* పచ్చిమిర్చి - 2 పొడవుగా కోయాలి
* కరివేపాకు - 1 రెమ్మ
* పసుపు - ¼ టీస్పూన్
* నూనె - 2-3 టేబుల్ స్పూన్లు
* నీరు - 1.5 కప్పులు
* కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
* తురిమిన కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు
* నిమ్మ రసం - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం
రవ్వను కడాయిలో వేసి అది బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. దానిని పక్కన పెట్టేయండి. అవరెకై (సుర్తిపాప్డి కాయలను) (Avarekai) కట్ చేసి.. వేడినీటిలో వేసి.. కాస్త ఉప్పు వేసి.. మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
ఇప్పుడు కడాయి తీసుకుని దానిలో నూనె వేయండి. ఆవాలు, జీరా, మిన పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 30 సెకన్ల పాటు వేయించాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ఉడికించిన సుర్తిపాపడి కాయలను వేసి.. ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి 2-3 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు 1.5 కప్పుల నీటిని వేసి.. మరిగించాలి. నీరు మరుగుతున్న సమయంలో వేయించిన రవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ.. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. అది ఉడికిన తర్వాత నిమ్మరసం, కొత్తిమీర, కొబ్బరి తురుము వేయాలి. అంతే హెల్తీ, టేస్టీ Avarekai ఉప్మా రెడీ.
సంబంధిత కథనం