Saffron Benefits | కుంకుమ పువ్వు చిటికెడు.. ప్రయోజనాలు బోలెడు!-know the impressive health benefits of expensive indian spice of saffron ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Saffron Benefits | కుంకుమ పువ్వు చిటికెడు.. ప్రయోజనాలు బోలెడు!

Saffron Benefits | కుంకుమ పువ్వు చిటికెడు.. ప్రయోజనాలు బోలెడు!

Nov 09, 2022, 03:51 PM IST HT Telugu Desk
Nov 09, 2022, 03:51 PM , IST

 Saffron Benefits: కుంకుమ పువ్వు గురించి మీరు అప్పుడప్పుడూ వినే ఉంటారు. చిటికెడు కుంకుమ పువ్వును గర్భిణీస్త్రీలు రోజు పాలల్లో కలుపుకొని తాగితే బిడ్డ మంచి రంగులో అందంగా పుడతారని అంటారు. భార్యాభర్తలు రాత్రి పాలల్లో తాగితే యుద్ధమే. ఇంకా ఎన్ని ప్రయోజనాలున్నాయో చూడండి.

 కుంకుమ పువ్వు అనగానే మనకు దారపు పోగుల వంటి పదార్థం గుర్తుకు వస్తుంది. నిజానికి కుంకుమపువ్వు ఊదా రంగు లేదా లేత నీలిరంగులో ఉంటుంది.  కాశ్మీర్ లోయలో పండుతుంది. ఈ పువ్వును ఎండబెడితే చాలా ఖరీదైన మూలికగా మారుతుంది. నాణ్యమైన కుంకుమపువ్వు ధర కిలోకు సుమారు రూ. 4 లక్షల వరకు ఉంటుంది. కానీ ఇది చిటికెడు చాలు, ప్రయోజనాలు బోలేడు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

(1 / 7)

నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది: కుంకుమపువ్వు చిటికెడు పాలల్లో వేసుకొని తాగుతూ ఉంటే ఇది నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది, మెదడుకు ఆక్సీకరణ హానిని నివారిస్తుంది, అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది. కుంకుమపువ్వును బిర్యానీలో కూడా కలుపుతారు.

(2 / 7)

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది: సాఫ్రన్ టీ గురించి వినే ఉంటారు. అసలైన కుంకుమపువ్వుతో తయారు చేసిన టీ తాగితే మూడ్ బాగుంటుంది, ఇది మానసిక స్థితి మెరుగుపరుస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.  కేవలం 30 mg కుంకుమపువ్వు మీ మూడ్ సెట్ చేస్తుంది.

(3 / 7)

స్త్రీ జననేంద్రియ సమస్యలు:   ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ లేదా PMS చికిత్సలో కుంకుమపువ్వు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. స్త్రీలలో జననేంద్రియ సమస్యలకు కూడా ఈ మూలిక ప్రయోజనకరంగా ఉంటుంది.

(4 / 7)

బరువు తగ్గడం - శరీరంలోని అధిక కొవ్వును తగ్గించడంలో కుంకుమపువ్వు చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలో జీవక్రియను పెంచుతుంది.  బరువు తగ్గించే ఆహారాలలో దీని చేర్చుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

(5 / 7)

 మెరిసే చర్మం- కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం ఆరోగ్యాన్ని పెంచుతుంది. మీ చర్మానికిసహజసిద్ధంగా మంచి రంగును అందిస్తుంది.

(6 / 7)

లైంగిక పనితీరు: పురుషుల్లో అంగస్తంభన సమస్యలు, స్త్రీలలో లిబిడోతో సహా వివిధ రకాల లైంగిక సమస్యను తగ్గించి, లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందిరాత్రిపూట పాలలో కుంకుమపువ్వు కలిపి తాగడం వల్ల శృంగార కోరిక పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు