Ways to Relieve Stress । ఒత్తిడితో లైంగిక సామర్థ్యంపై పెద్ద దెబ్బ.. ఈ చిట్కాలు పాటించండి!
Ways to Relieve Stress: ఒత్తిడితో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది, మానసిక ఆరోగ్యం తగ్గుతుంది. తగ్గించుకోవటానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి.
ఏమి ఉన్నా, లేకపోయినా మనిషి జీవితంలో ప్రశాంతత అనేది ఒక్కటి ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే. ఈ ప్రశాంతత అనేది లేకనే ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్నాడు. ఇది ఇలాగే దీర్ఘకాలం పాటు కొనసాగితే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం సహా అనేక ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
అంతేకాదు ఈ ఒత్తిడి, ఆందోళనల కారణంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యం కూడా దెబ్బతింటుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. స్పెర్మ్ కౌంట్, చలనశీలత తగ్గిపోతుంది, స్పెర్మ్ నాణ్యత క్షీణిస్తుంది, అంగస్తంభన లోపం మొదలైనవి అన్నీ కలిసి వంధ్యత్వానికి కారణం కావచ్చు. స్త్రీలలో కూడా కార్టిసాల్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి పెరిగి, వారిలో లైంగిక ప్రేరేపణలకు ఆటంకం కలిగిస్తుంది. యోని పొడిబారడం, లిబిడో కోల్పోవడం వంటి సమస్యలతో గర్భందాల్చడం కష్టంగా మారుతుంది.
డిప్రెషన్, ఆందోళనతో నిద్రలేమి కలుగుతుంది. ఇది మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అదనంగా మాదకద్రవ్యాల వ్యసనం ఉంటే అది రోజువారీ జీవితాన్ని ఎదుర్కోవడం మరింత కష్టతరం చేస్తుంది. కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, ప్రశాంతంగా గడపడం నేర్చుకోవాలి.
నడక
ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడటానికి ఆరుబయట ప్రశాంతంగా నడవడం కంటే మెరుగైన పరిష్కారం లేదు.స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతి పొందడానికి ఇది ఒక గొప్ప మార్గం ఒత్తిడిని తగ్గించుకోవడానికి అన్ని వయసుల వారికి నడక ప్రభావవంతమైన వ్యాయామం. నడకతో ఫిట్‌నెస్ కూడా మెరుగుపడుతుంది.
యోగాభ్యాసం
యోగా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శ్రేయస్సును, మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. ఆశావాద దృక్పథంతో జీవించే భావాలను పెంచడానికి సహాయపడుతుంది. మీరు ఒత్తిడిని తగ్గించుకోవడానికి పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే యోగా మీకు గొప్ప ఎంపిక.
మంచి సంభాషణలు
ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి మంచి సంభాషణ కూడా ఒక ఔషధంగా పనిచేస్తుంది. మీ స్నేహితులతోనో, మీకు ఇష్టమైన వారితోనో మీకు నచ్చే విషయాలను మనసు విప్పి మాట్లాడండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, బంధాలను వికసింపజేస్తుంది.
ధ్యానం
లోతైన శ్వాస తీసుకుంటూ ధ్యానం చేయడం అభ్యాసం చేస్తే అది మన హృదయ స్పందన రేటును నెమ్మదింపజేయటానికి సహాయపడుతుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రోత్సహించడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో మెడిటేషన్ సహాయపడుతుంది.
ఆహారంలో మార్పులు
అందరికీ సరిపోయే ఫార్ములా లేనప్పటికీ, డార్క్ చాక్లెట్, చమోమిలే టీ, లావెండర్ టీ వంటి కొన్ని ఆహారపానీయాలు విశ్రాంతిని అందిస్తాయి. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అదే సమయంలో కెఫీన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
సంగీతం
సంగీతంతో రాళ్లు కరిగిపోతాయంటారు, అలాంటిది మీ ఒత్తిడి ఎంత? మనసును రిలాక్స్ చేసే మంచి సంగీతం వినండి, హమ్ చేస్తూ ఉండండి. ఇది ఒత్తిడి తగ్గించి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడుతుంది.
నిద్ర
ఇది చివరిదైనా, చాలా ముఖ్యమైనది. మంచి నిద్రకు మించిన ఔషధం ఏదీ లేదు. కడుపునిండా తిని కంటినిండా నిద్రపోతే ఒత్తిడి పోతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సంబంధిత కథనం
టాపిక్