World Music Day 2022: సంగీతంతో రాళ్లు కరగడమే కాదు.. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి-world music day 2022 special story on benefits of music ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Music Day 2022: సంగీతంతో రాళ్లు కరగడమే కాదు.. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి

World Music Day 2022: సంగీతంతో రాళ్లు కరగడమే కాదు.. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 21, 2022 11:55 AM IST

సంగీతంతో రాళ్లుకరుగుతాయని ఊరికే అనరు. మానసిక స్థితి, శారీరక మెరుగుదలకోసం సంగీతం ఎంతగానో సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని పలు పరిశోధనలు కూడా రుజువు చేశాయి. మరి సంగీతం వల్ల కలిగే బెనిఫిట్స్​ ఏంటో మీరు తెలుసుకోండి.

ప్రపంచ సంగీత దినోత్సవం
ప్రపంచ సంగీత దినోత్సవం

World Music Day 2022 : సంగీతం అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం. అందుకే చాలా మంది ఖాళీ సమయంలో పాటలు వినడానికి ఇష్టపడతారు. జర్నీల్లో, లేదా ఏదైనా బ్రేక్​ సమయంలో పాటలు వినేందుకు ఇష్టపడతారు. అయితే ప్రపంచ సంగీత దినోత్సవం రోజున.. సంగీతం వినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

చరిత్ర

మొదటిసారి సంగీత దినోత్సవాన్ని 1982లో జరిపారు. ఫ్రాన్స్​లో అప్పటి సాంస్కృతిక మంత్రి జాక్వెస్​ లాంగ్​ సంగీత దినోత్సవాన్ని చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేకమైన రోజు సంగీతం వినడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తారు. 

* ఒత్తిడి తగ్గుతుంది

సంగీతాన్ని వినడం వల్ల బయోకెమికల్ స్ట్రెస్ రిడ్యూసర్‌లను ప్రేరేపించి.. ఒత్తిడి తగ్గుతుందని పరిశోధనలు కూడా తేల్చాయి. 

* గుండె ఆరోగ్యానికి మంచిది

సంగీతాన్ని ప్లే చేస్తే రక్త ప్రసరణ సాఫీగా సాగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది హృదయ స్పందన రేటును, రక్తపోటును తగ్గిస్తుంది. కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 

* చిరస్మరణీయ క్షణాల కోసం.. 

అల్జీమర్స్ వ్యాధి లేదా చిత్తవైకల్యానికి ఎటువంటి నివారణ లేదు. కానీ మ్యూజిక్ థెరపీ దాని లక్షణాల నుంచి కొంత ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది. మ్యూజిక్ థెరపీ వల్ల రోగికి విశ్రాంతి వస్తుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది.

* మానసిక స్థితి కోసం..

పాటలు వినడం వల్ల మూడ్ కూడా చాలా వరకు మారిపోతుంది. పాటలు వినడం ద్వారా మెదడు డోపమైన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ  డోపమైన్ ఆందోళన, డిప్రెషన్ నుంచి ఉపశమనం ఇస్తుంది. అంతేకాకుండా మీకు ఇష్టమైన పాట మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

* నొప్పిని నియంత్రిస్తుంది..

ఒత్తిడి స్థాయిని, మెదడులోకి ప్రవేశించే నొప్పి సంకేతాన్ని తగ్గించడంలో మ్యూజిక్ థెరపీ అద్భుతంగా పని చేస్తుంది. క్రమంగా మీకు నొప్పి తగ్గుతుంది. 

* స్టామినా పెంచుతుంది..

వ్యాయామం చేసే సమయంలో సాంగ్స్ వినడం వల్ల శారీరక పనితీరును మెరుగ్గా ఉంటుంది. కఠినమైన వర్కవుట్‌ల సమయంలో కూడా ఇది శక్తిని పెంచుతుంది.

WhatsApp channel