Dreamy Moon Milk। రాత్రి ఈ ఒక్క పానీయం తాగండి.. మిమ్మల్ని జోలపాటలా నిద్ర పుచ్చుతుంది!-this wonderful dreamy moon milk will make you sleep like a lullaby ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  This Wonderful Dreamy Moon Milk Will Make You Sleep Like A Lullaby

Dreamy Moon Milk। రాత్రి ఈ ఒక్క పానీయం తాగండి.. మిమ్మల్ని జోలపాటలా నిద్ర పుచ్చుతుంది!

HT Telugu Desk HT Telugu
Nov 02, 2022 09:49 PM IST

Dreamy Moon Milk Recipe: నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఈ అద్భుతమైన పానీయం తాగితే వెంటనే మిమ్మల్ని పడుకోబెట్టేస్తుంది.

Dreamy Moon Milk Recipe
Dreamy Moon Milk Recipe (unsplash)

Dreamy Moon Milk Recipe: ఈ రోజుల్లో అదృష్టవంతులు ఎవరూ అంటే డబ్బు, ఐశ్వర్యం ఉన్నవారు కాదు, పదవులు హోదా, దర్పం ప్రదర్శించే వారూ కాదు. కడుపు నిండా తిండి, కమ్మటి నిద్ర ఉన్నవారే నిజమైన అదృష్టవంతులు. ఉద్యోగాలు, వ్యాపారాలతో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ, ప్రతిరోజూ ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడి, ఆందోళలకు గురవుతూనే ఉన్నారు. వారికి ఎన్ని రకాలుగా ఉన్నా, కమ్మని నిద్ర అనేది కరువైపోతుంది. దీంతో మనిషి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు, తన చుట్టూ ఉన్న వాళ్లను ప్రశాంతంగా ఉంచలేకపోతున్నాడు.

నిద్రలేమి సమస్యలు మనిషిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తున్నాయి. ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్రపోతే చాలు అనుకునే వారు మనలో చాలా మందే ఉంటారు.

మరి నిద్ర రావాలంటే ఏం చేయాలి? ముందుగా ప్రశాంతంగా ఉండటం అలవర్చుకోవాలి. కనీసం రాత్రి పడుకునే ముందైనా ఒత్తిడి, ఆందోళనలు పక్కనబెట్టి విశ్రాంతి తీసుకోవాలి. అయితే ప్రశాంతంగా ఉండేదుకు యోగా, ధ్యానం వంటి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల ఆహారాలు కూడా మనసును శాంత పరుస్తాయి. మీకు మంచి నిద్ర కలిగేలా చేస్తాయి. దీనిని మూన్ మిల్క్ (Moon Milk), లేదా కలల పానీయం (Dreamy Nighttime Drink) అంటూ వివిధ పేర్లతో పిలుస్తారు. మరి అది ఎలా తయారు చేయాలి, ఏమేం పదార్థాలు కావాలి తెలుకోండి, డ్రీమీ మూన్ మిల్క్ రెసిపీ ఈ కింద చూడండి.

Dreamy Moon Milk Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు పాలు
  • 1 టీస్పూన్ తేనె
  • 2 చుక్కల వెనీలా ఎసెన్స్
  • 1 చిటికెడు దాల్చినచెక్క పొడి

డ్రీమీ మూన్ మిల్క్ రెసిపీ- తయారీ విధానం

ఒక కప్పు పాలు మరిగించాలి లేదా మీకు కావలసిన మోతాదులో మరిగించాలి. పైన పేర్కొన్న పరిమాణాలు ఒక్క కప్పు కోసం ఇచ్చినది.

పాలు నురగలు వచ్చే వరకు ఎక్కువ మంట మీద మరిగించి, నురగలు వచ్చాక మంట తక్కువ చేయండి. ఇప్పుడు తేనే, వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. కప్పులోకి తీసుకొని పైనుంచి దాల్చినచెక్క పొడి చల్లుకోండి.

మీ Dreamy Moon Milk సిద్దంగా ఉంది. దీనిని మంచి రిలాక్సింగ్ సంగీతం వింటూ లేదా పుస్తకం చదువుతూ లేదా మీకు నచ్చిన పనిచేస్తూ సిప్ చేస్తూ ఉండండి. ఈ అద్భుతమైన పానీయం మీకు వెంటనే విశ్రాంతి, హాయిని కలిగించి, మిమ్మల్ని పడుకోబెట్టేస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్