Moon Eclipse 2022 : చంద్రగ్రహణం సమయంలో చేయవలసినా, చేయకూడని పనులు ఇవే..-dos and don ts on lunar eclipse follow these rituals during moon eclipse ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moon Eclipse 2022 : చంద్రగ్రహణం సమయంలో చేయవలసినా, చేయకూడని పనులు ఇవే..

Moon Eclipse 2022 : చంద్రగ్రహణం సమయంలో చేయవలసినా, చేయకూడని పనులు ఇవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 02, 2022 01:43 PM IST

Moon Eclipse 2022 : మరికొన్ని రోజుల్లో చంద్రగ్రహణం రాబోతుంది. ఇదే ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజు చేయవలసినా, చేయకూడని పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రగ్రహణం 2022
చంద్రగ్రహణం 2022

Moon Eclipse 2022 : 2022లో నవంబర్ 8వ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం అవుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం ప్రజల జీవితంలో చాలా ఆకస్మిక మార్పులను తెస్తుంది. ఇది కొన్ని నిర్దిష్ట రాశిచక్ర గుర్తులపై కూడా ప్రభావం చూపిస్తుంది అంటారు. చంద్రగ్రహణం కొన్ని పనులు చేయాలని.. మరికొన్ని పనులు చేయకూడదని అంటారు. ఇంతకీ చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రగ్రహణం సమయంలో చేయకూడని పనులు ఇవే

* గ్రహణం సమయంలో ఆహారం లేదా నీరు తాగకూడదు అంటారు. ఇలా చేయడం వల్ల మనిషి జీర్ణశక్తి బలహీనపడుతుందని చెప్తారు. దీని కారణంగా వ్యక్తి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

* గ్రహణ సమయంలో కొత్త పనులు, శుభ కార్యాలు చేయకూడదని చెప్తారు. అలా చేయడం వల్ల ఆ పనిలో అపజయం వస్తుందని భావిస్తారు.

* గ్రహణ సమయంలో గోళ్లు కత్తిరించడం, జుట్టు దువ్వడం, పళ్లను శుభ్రం చేయడం వంటివి అశుభమైనవిగా పరిగణిస్తారు. గ్రహణ సమయంలో నిద్రపోకూడదని కూడా చెప్తారు.

* గ్రహణ సమయంలో కత్తులు లేదా పదునైన వస్తువులు ఉపయోగించరాదని చెబుతారు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని అంటారు.

చంద్ర గ్రహణం సమయంలో చేయాల్సిన పనులేమిటంటే..

* గ్రహణం ప్రారంభమయ్యే ముందు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. స్నానం చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు.

* చంద్రగ్రహణం సమయంలో దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.

* గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో గంగాజలం చల్లాలి.

* గ్రహణం ముగిసిన తర్వాత మరోసారి స్నానం చేయాలి. ఇలా చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయని అంటారు.

* గ్రహణ కాలంలో తులసి లేదా గరిక ఆకులను ఆహార పదార్థాలలో వేయాలి.

Whats_app_banner

సంబంధిత కథనం