Foods Causing Gas : జీర్ణ సమస్యలు ఉంటే.. వాటికి దూరంగా ఉండండి..
Foods Causing Gas : శరీరంలో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే, జీర్ణ సమస్యలను కలిగించే ఆహారాలు చాలానే ఉన్నాయి. అందరికీ కాకపోయినా.. కొందరికి ఈ సమస్య ఉంటుంది. పైగా ఈ ఆహారాలు సురక్షితమైనవిగా భావించి తీసుకుంటాము కానీ.. ఇవి అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Foods Causing Gas : కొన్ని ఆహారాలు జీర్ణక్రియ సమస్యలను పెంచుతాయి. అవి ఆరోగ్యానికి మంచివని తీసుకుంటాము కానీ.. వాటి వల్ల గ్యాస్ సమస్యలు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. వేయించిన ఆహారం జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అవి జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి. దీంతో గ్యాస్, గుండెల్లో మంట సమస్య పెరుగుతోంది. కాబట్టి వాటిని ప్రారంభంలోనే గుర్తించి.. దూరంగా పెట్టాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏ ఆహారాలు తింటే.. గ్యాస్ సమస్య మరింత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
* వంకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. పెద్ద పరిమాణంలో వాటిని తిన్నప్పుడు గ్యాస్‌ను కలిగిస్తుంది. గుండెల్లో మంట కూడా రావచ్చు.
* గోధుమ పిండిని జీర్ణం చేయడానికి జీర్ణవ్యవస్థ వేగవంతం కావాలి. ఫలితంగా దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
* కడుపు సమస్యలతో బాధపడేవారు కీరదోసకాయ తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. దోసకాయలో కుకుర్బిటాసిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది అజీర్తిని కలిగిస్తుంది.
* క్యాబేజీ కూడా గ్యాస్‌కు కారణమవుతుంది. మీ ఆహారం నుంచి క్యాబేజీని తొలగించే ముందు వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే క్యాబేజీలో చాలా ఆరోగ్యకరమైన పదార్థాలు ఉన్నాయి. ప్రత్యేకంగా వండినట్లయితే, జీర్ణ సమస్యలు రాకపోవచ్చు.
* క్యాబేజీ లాగా కాలీఫ్లవర్‌లో కూడా సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిని గ్లూకోసినోలేట్స్ అంటారు. ఇది అపానవాయువుకు కూడా కారణమవుతుంది. అంతేకాకుండా, గుండెల్లో మంట కూడా సమస్యలను కలిగిస్తుంది.
* సోయాబీన్స్ శరీరంలో అదనపు కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. ఫలితంగా గుండెల్లో మంట సమస్య కూడా పెరుగుతుంది.
* తక్కువ మొత్తంలో ఈస్ట్ శరీరానికి ఆరోగ్యకరం అయినప్పటికీ.. అధిక మొత్తంలో తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం, నోటిపూత, నోటి దుర్వాసన, దురద వంటి సమస్యలు వస్తాయి.
* కొంతమందికి పాలు బాగా జీర్ణం కావు. జీర్ణ సమస్యలు ఉంటే వారు పాలు లేదా పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండాలి. లేకుంటే గ్యాస్, హార్ట్ బర్న్ సమస్యలు పెరుగుతాయి.
సంబంధిత కథనం