Walking on Grass | ఉదయాన్నే చెప్పులు లేకుండా పచ్చికపై నడిస్తే ఏమౌతుందో తెలుసా?
ఉదయం పూట ఒక 15 నిమిషాల పాటు చెప్పులు లేకుండా మంచు బిందువులు కురిసిన పచ్చి గడ్డిపై నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అందులో కొన్ని ఇక్కడ తెలుసుకోండి..
ఉదయం నిద్రలేవగానే కాళ్లకు పాదరక్షలు లేకుండా పచ్చికబయళ్ల మీద నడిస్తే గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. మీరు గమనిస్తే ఉదయం పూట చెట్ల ఆకులు, మొక్కలు, పూలు, పచ్చటి గడ్డిపై చిన్నచిన్న నీటి బిందువులు కనిపిస్తాయి. వాటిని చూస్తే మనసు ఉల్లాసంగా అనిపిస్తుంది. ఈ బిందువులు నీటి ఆవిరితో తయారవుతాయి. ఉదయం పూట చల్లటి వాతావరణానికి ఆ నీటి బిందువులు కూడా చల్లగా మారతాయి. పరిశోధన ప్రకారం, అవి 14-16 ppm వరకు ఆక్సిజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఉదయం పూట పచ్చికబయళ్లపై కురిసిన ఈ మంచు బిందువులపై నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇక్కడ తెలుసుకోండి.
మీ మనసుకు తాజాదనం
ఉదయాన్నే స్వచ్ఛమైన గాలిపీలుస్తూ, పక్షుల కిలకిలరావాలు శబ్దాలు అనుభూతి చెందుతూ ప్రకృతితో గడపడం ఎవరికి ఇష్టం ఉండదు? మీరు ఉదయాన్నే చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు తాజా గడ్డి మీ పాదాలకు కలిగించే అనుభూతి మిమ్మల్ని ఒక మిథ్యలోకి తీసుకెళుతుంది. దీంతో మీకు ఒక తాజాదనపు అనుభూతి కలుగుతుంది. ఎంతో రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. ఉదయాన్ని ఇలా తాజాగా ప్రారంభించడం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
అలసట ఉండదు
రోజంతా పని చేసిన తర్వాత శరీరం అలసిపోతుంది. దీంతో బలహీనంగా మారిపోతారు. పని ఒత్తిడి, ఇతర ఆందోళనల కారణంగా మీ మనసు భారంగా మారుతుందు. అయితే ఉదయం పూట పువ్వులపై, చెట్ల ఆకులపై కురిసిన మంచు బిందువులను సేకరించి మొఖంపై చల్లుకుంటే లేదా త్రాగితే.. అది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. రోజులో మీకు సంబంధించిన అన్ని పనులను చకచకా చేసుకోవడానికి మీలో ఉత్సాహాం ఉంటుంది. తద్వారా ఎలాంటి అలసట అనేది ఉండదంటున్నారు.
పాదాలకు వ్యాయామం
చెప్పులు లేకుండా నడవడం కూడా పాదాలకు గొప్ప వ్యాయామం, ఇది మీ పాదాలు, చీలమండలు తొడ కండరాలు, స్నాయువులను బలపరుస్తుంది. ఇది మీ శరీరాన్ని నిటారుగా ఉంచడానికి మీ శరీరంలో సమతుల్యత తీసుకురావటానికి అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది పాదాల అరికాళ్ళలో మంటలు, నొప్పులు, పగుళ్లు ఇతర సమస్యలు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఒత్తిడిని దూరం చేస్తుంది
మంచు బిందువులు కురిసిన పచ్చిగడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వలన ముఖ్యంగా ఉదయాన్నే ఇలా నడిస్తే మీ ఇంద్రియాలను, మీ మనస్సును పునరుజ్జీవింపజేయడానికి, మిమ్మల్ని అంతర్గతంగా శాంతపరచడానికి సహాయపడుతుంది. తాజా పొగమంచు గాలి, వెచ్చని సూర్యకాంతి, పచ్చని పరిసరాలు, ఆహ్లాదకరమైన ఉదయం వాతావరణం మీ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది]. మీ శరీర అవయవాలకు తాజా ఆక్సిజన్ లభిస్తుంది. ఈ ప్రశాంత వాతావరణం మీ శరీరాన్ని, మనస్సును తేలికపరుస్తుంది. మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మీరు రిలాక్స్‌గా ఉంటారు.
సంబంధిత కథనం