Breast Size। వక్షోజాల పరిమాణం పెద్దగా మారడానికి కారణాలు.. తగ్గించేందుకు మార్గాలు!-why breast size increases here are the natural ways to reduce fat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Why Breast Size Increases, Here Are The Natural Ways To Reduce Fat

Breast Size। వక్షోజాల పరిమాణం పెద్దగా మారడానికి కారణాలు.. తగ్గించేందుకు మార్గాలు!

HT Telugu Desk HT Telugu
Nov 10, 2022 09:12 PM IST

Breast Size: వక్షోజాల పరిమాణం పెద్దగా, బరువుగా ఉండటం వలన కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. సహజంగా సైజ్ తగ్గించుకోవటానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Natural Ways to Reduce Breast Size
Natural Ways to Reduce Breast Size (feepik)

ఆడవారిలో రొమ్ము సైజు అందానికి కొలమానంగా చాలా మంది భావిస్తారు. వక్షోజాల పరిమాణం, ఆకారం అలాగే కోమలత్వం అనేది ప్రతీ స్త్రీకి మారుతూ ఉంటుంది. ఇది వారి శరీరతత్వం, వారు అనుసరించే జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ఈ స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొంతమంది ఆడవారికి పెద్దని, బరువైన రొమ్ములు ఉంటాయి. ఇలా ఉండటం వలన వారికి శారీరకంగా, మానసికంగా, అలాగే సామాజికంగా కొన్ని రకాల ఇబ్బందులను కలిగిస్తాయి. (Also Read: చనుమొనలు రంగు మారుతున్నాయంటే కారణం ఇదే)

పెద్దని, బరువైన వక్షోజాలు కలిగిఉన్న వారికి వాటి బరువు కారణంగా వెన్ను లేదా మెడ భాగంలో నొప్పులు కూడా కలగవచ్చు. అయితే ఈ రొమ్ములు బరువుగా మారడానికి అనేక కారణాలు ఉంటాయి. గర్భధారణ సమయంలో రొమ్ము పరిమాణం పెరుగుతుంది. అదే సమయంలో, హార్మోన్ల ప్రభావం వలన కూడా ఛాతీ పరిమాణం పెరుగుతుంది. . కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు ఉండవచ్చు.


Natural Ways to Reduce Breast Size- వక్షోజాల పరిమాణం తగ్గించటానికి సహజ మార్గాలు

పరిమాణం పెద్దగా ఉండే స్తనాలను తగ్గించుకోవటానికి ఇప్పుడు గైనెకోమాస్టియా, బ్రెస్ట్ లంప్ సర్జరీ వంటి పలు రకాల బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజ మార్గాలలో సైజ్ తగ్గించుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉన్నవారు, తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉంటే నిపుణులు సూచించిన కొన్ని మార్గాలను ఇక్కడ జాబితా చేస్తున్నాము, వీటిని ప్రయత్నించడం ద్వారా వాటి సైజ్ తగ్గే అవకాశం ఉంటుంది.

ఆహారం

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ల ప్రభావం కారణంగా రొమ్ములు బరువుగా మారతాయి. సంతులన ఆహారాన్ని తీసుకోవడం, శారీరకంగా చురుకుగా ఉండటం ద్వారా వక్షోజాల కొవ్వును చాలా వరకు తగ్గించవచ్చు. పండ్లు, తాజా కూరగాయలు తినడం వల్ల మీ కొవ్వు కరిగిపోతుంది.

గ్రీన్ టీ

బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఒక సహజ మార్గం. గ్రీన్ టీలో జీవక్రియను వేగవంతం చేసే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉన్నాయి. ఇది మీ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది, కేలరీలను కూడా తగ్గిస్తుంది. రొమ్ములో నిల్వ ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుంది.

ఒమేగా 3

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మీ హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. దీనివల్ల రొమ్ముల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీని కోసం మీరు అవిసె గింజలు, అక్రోట్లను లేదా చేపలను తినవచ్చు.

వ్యాయామం చేయండి

బ్రెస్ట్ సైజు తగ్గించుకోవడానికి మీరు కొన్ని ప్రత్యేక వ్యాయామాలు కూడా చేయవచ్చు. వారానికి కనీసం నాలుగు సార్లు 30 నిమిషాల పాఅటు వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తున్నారు. రొమ్ములను ఆకృతిలో ఉంచడానికి పుషప్‌లు మంచి మార్గం. చాప మీద మీ ఛాతీపై పడుకోండి. మీ భుజాల పక్కన అరచేతులను ఉంచడం ద్వారా మీ శరీరాన్ని విస్తరించండి. కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండండి.

డ్యాన్స్, సైక్లింగ్

మీరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండటం లేదా సైక్లింగ్ చేయడం ద్వారా కూడా మీ ఛాతి కొవ్వును తగ్గించుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్