Sagging Breasts | వక్షోజాలు వదులుగా అవటానికి కారణాలు ఇవే..నివారణ మార్గాలు ఇవిగో!-sagging breasts causes home remedies and treatment details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sagging Breasts | వక్షోజాలు వదులుగా అవటానికి కారణాలు ఇవే..నివారణ మార్గాలు ఇవిగో!

Sagging Breasts | వక్షోజాలు వదులుగా అవటానికి కారణాలు ఇవే..నివారణ మార్గాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

వక్షోజాలు కుంగిపోవటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దీనిని నివారించేందుకు పలు రకాల ఇంటి చిట్కాలు ఉన్నాయి, వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వక్షోజాలకు దృఢత్వాన్నిచ్చే మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.

Breast Shape Matters - Image used for representation purpose only (Unsplash)

వయసు పెరుగుతున్నా కొద్దీ శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి, శరీరాకృతి అనేది మారుతుంటుంది. అదేవిధంగా ఆడవారిలో వక్షోజాల ఆకృతి మారుతుంది, వదులుగా కూడా అవుతాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ, ఇంత మాత్రానికి బాధపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. వక్షోజాల పరిమాణం, ఆకారం అలాగే కోమలత్వం అనేది ప్రతీ స్త్రీకి మారుతూ ఉంటుంది. ఇది వారి శరీరతత్వం, వారు అనుసరించే జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ఈ స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు.

వక్షోజాలు కుంగిపోతాయి. అందుకు అనేక రకాల కారణాలు ఉంటాయి. రొమ్ము కణజాలం బలహీనపడటం వలన ఇది జరుగుతుంది. ఈ పరిస్థితిని వైద్యపరంగా బ్రెస్ట్ ప్టోసిస్ అని పిలుస్తారు. కువక్షోజాలు కుంగిపోకూడదనుకుంటే ఎల్లప్పుడూ వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రోజువారీ సంరక్షణ అవసరం. సరైన వ్యాయామాన్ని చేయాలి, మంచి పోషకాహారం తీసుకోవాలి.

సాగిపోయినటువంటి వక్షోజాలతో కొంతమంది మహిళలు ఆత్మన్యూనతా భావంతో ఉంటారు. తమ రూపాన్ని తిరిగి తెచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది లిఫ్ట్ బ్రాలు ధరిస్తారు. అయితే అవగాహనా రాహిత్యంతో చేసే ప్రయత్నాలు రొమ్ములపై చెడు ప్రభావాన్ని చూపుతాయి, అవి శాశ్వత పరిష్కారం కాదని వైద్యులు చెబుతున్నారు.

HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ది ఏస్తెటిక్ క్లినిక్స్‌' లో కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్, డెర్మాటో-సర్జన్ అయినటువంటి డాక్టర్ రింకీ కపూర్, వక్షోజాలు కుంగిపోవడానికి కారణాలు, పరిష్కార మార్గాలను సూచించారు.

వక్షోజాలు సాగిపోవటానికి గల ప్రధాన కారణాలు

  • వయసు పెరుగుతుండటం
  • గురుత్వాకర్షణ
  • హార్మోన్ల అసమతుల్యత, గర్భ నిరోధకాలు తీసుకోవటం
  • మెనోపాజ్
  • వ్యాయామాలు తప్పుగా చేయడం
  • ధరించే బ్రాలు సరిగ్గా లేకపోవటం
  • బరువు తగ్గడం/పెరగటం- హెచ్చుతగ్గులు ఉండటం
  • ఊబకాయం లేదా అధిక BMI
  • ధూమపానం చేయటం
  • ఎక్కువ సార్లు గర్భం దాల్చటం
  • చనుబాలు ఇవ్వటం
  • వక్షోజాలపై ఒత్తిడి
  • ఎగువ శరీరానికి వ్యాయామం లేకపోవడం

వక్షోజాల దృఢత్వాన్ని పెంచటానికి తీసుకోవాల్సిన చర్యలు

1. ప్లాంక్‌లు, పుష్ అప్‌లు, ఇతర పెక్టోరల్ వ్యాయామాలతో కూడిన ఛాతీ వ్యాయామాలు చేయాలి. అయితే సరైన భంగిమల కోసం శిక్షకుడి సహాయం తీసుకోవాలి.

2. వ్యాయామం చేసేటపుడు సరైన సపోర్టివ్ బ్రాను ధరించాలి. ఎందుకంటే అవి కణజాలానికి రూపాన్ని అందివ్వటానికి సహాయపడతాయి.

3. ధూమపానం మానేయండి

4. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

5. ప్రతిరోజూ మీ రొమ్ములను మాయిశ్చరైజ్ చేయండి.

హోమ్ మేడ్ ప్యాక్స్

వక్షోజాలు సాగిపోవటాన్ని నిరోధించడానికి డాక్టర్ రింకీ కపూర్ ఇంట్లో తయారుచేసిన ప్యాక్‌లను సూచించారు, అవి ఇలా చేసుకోవాలి.

1. ఒక దోసకాయ తురుము, ఒక గుడ్డు పచ్చసొనను ఒక టీస్పూన్ వెన్నతో కలపండి. ఈ మిశ్రమాన్ని రొమ్ములపై ​​పైవైపుగా పూయాలి. వక్షోజాల చుట్టూ అప్లై చేయండి. సుమారు 30 నిమిషాలు ఉంచి, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.

2. గుడ్డులోని తెల్లసొనను నురుగు వచ్చేలా మిక్స్‌ చేయండి. ఇందులో 1 స్పూన్ పెరుగు, తేనె వేసి బాగా కొట్టండి. ​​ఈ మిశ్రమాన్ని మీ రొమ్ములపై వృత్తాకారంలో మసాజ్ చేయండి. సుమారు గంటసేపు అలాగే వదిలివేసి, ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

3. ¼ కప్పు మెంతి పొడిని నీటితో కలపి మందపాటి పేస్ట్ చేయండి ఈ పేస్ట్‌ను మీ రొమ్ములపై ​​అప్లై చేసి, సర్క్యులేషన్ మెరుగుపరచడానికి బాగా మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

కుంగిపోయిన రొమ్ములకు చికిత్స చేసి సరైన ఆకారం తీసుకొచ్చేందుకు ఇప్పుడు పలు రకాల లేజర్ చికిత్సలు, థర్మేజ్, థ్రెడ్ లిఫ్ట్, బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ వంటివి అందుబాటులో ఉన్నాయని డాక్టర్ రింకీ సూచించారు.

సంబంధిత కథనం