BIOMILQ | కృత్రిమంగా రొమ్ముపాల తయారీ.. సమీప భవిష్యత్తులోనే మార్కెట్లలోకి?-biomilq lab grown human milk will be made available in markets in the near future ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Biomilq Lab-grown Human Milk Will Be Made Available In Markets In The Near Future

BIOMILQ | కృత్రిమంగా రొమ్ముపాల తయారీ.. సమీప భవిష్యత్తులోనే మార్కెట్లలోకి?

Manda Vikas HT Telugu
May 11, 2022 08:10 PM IST

శిషువుకి తల్లి చనుబాలు దొరకనపుడు సీసా పాలతోనే సరిపెట్టాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యను తీర్చడానికి కృత్రిమంగా మానవ పాలు తయారుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి అచ్ఛంగా రొమ్ముపాలలోని పోషకాలతో నిండి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

Feeding milk
Feeding milk (Unsplash)

ఇటీవల కాలంలో సంతానం లేని వారికి కృత్రిమ విధానాల ద్వారా సంతాన సాఫల్యాన్ని కలిగిస్తున్నారు. గర్భం ధరించలేని సందర్భంలో 'సరోగసీ' గా పిలిచ్చే అద్దె గర్భాల ధోరణులు పెరుగుతున్నాయి. అయితే కృత్రిమ విధానాల ద్వారా శిషువులను పొందవచ్చు. మరి అలాంటి తల్లులకు పాల ఉత్పత్తి ఎలా? అనేది ఇప్పుడు మరొక సమస్యగా మారింది. 

సరోగసీ విధానం ద్వారా బిడ్డను కన్నప్పుడు లేదా శిషుని దత్తత తీసుకున్న సందర్భాల్లో తల్లి ఆ బిడ్డకు తన చనుబాలను పంచలేదు. పుట్టిన శిషువుకి కనీసం 6 నెలల వరకు రొమ్ముపాలు ఇవ్వాలని వైద్యులు సిఫారసు చేస్తారు. కానీ చనుబాల ఉత్పత్తి లేనపుడు వారు శిషువుకి డబ్బాలో ఆవు పాలు అందించడంతోనే సరిపెట్టాల్సి వస్తుంది.

అయితే ఇప్పుడు ఈ సమస్యను అధిగమిస్తూ రొమ్ముపాలను సైతం ప్రయోగశాలలో కృత్రిమంగా ఉత్పత్తి చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.

BIOMILQ అనేది నార్త్ కరోలినాకు చెందిన ఒక స్టార్టప్. ఇది శరీరం లేకుండా కృత్రిమంగా 'మానవ పాలు' సృష్టించడానికి కృషి చేస్తోంది.

అయితే ఇప్పుడు ఈ సమస్యను అధిగమిస్తూ రొమ్ముపాలను సైతం ప్రయోగశాలలో కృత్రిమంగా ఉత్పత్తి చేసే పనులు మొదలయ్యాయి.

BIOMILQ అనేది నార్త్ కరోలినాకు చెందిన ఒక స్టార్టప్. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్‌కు చెందిన సంస్థ నిధులు సమకూరుస్తుంది. ఇది శరీరం లేకుండా కృత్రిమంగా 'మానవ పాలు' సృష్టించడానికి కృషి చేస్తోంది.

కృత్రిమంగా రొమ్ము పాలను సృష్టించాలనే ఆలోచన BIOMILQ సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ సైన్స్ ఆఫీసర్ అయిన లీలా స్ట్రిక్‌ల్యాండ్‌కు వచ్చింది. తాను ఒక బిడ్డకు జన్మనిచ్చినపుడు తనకు కూడా పాల ఉత్పత్తి సరిగ్గా జరగలేదట. అయితే కృత్రిమ గర్భాధారణ, కృత్రిమ మాంసం సృష్టిస్తున్నపుడు కృత్రిమ పాలను ఎందుకు సృష్టించలేం అని భావించిన లీలా.. తనలాగే తమ బిడ్డలకు చనుబాలు ఇవ్వలేక బాధపడుతున్న తల్లుల బాధలను తీర్చాలనే సంకల్పంతో ఈ BIOMILQ అనే స్టార్టప్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ల్యాబ్‌లో ఆ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఎలా తయారు చేస్తారు?

కృత్రిమ మానవ క్షీరం సృష్టించడానికి మొదటగా పాలిచ్చే మహిళా డోనర్ల అవసరం ఉంటుంది. పాలిచ్చే మహిళలకు మంచి పోషణ అందించి వారిలో పాల ఉత్పత్తిని పెంచుతారు. ఆ తర్వాత మహిళల రొమ్ము కణాలను సేకరిస్తారు, అలాగే వారి రొమ్ము పాలను సేకరిస్తారు. వీటిని మిళితం చేసి ఒక ప్రత్యేకమైన బయోరియాక్టర్‌లో అచ్ఛం మహిళ రొమ్ములో ఉండే వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆపై కణాలను పొదిగించి పాల ఉత్పత్తి చేస్తారు. ఇలా ఉత్పత్తి అయిన పాలు పూర్తిగా స్వచ్ఛమైనవే కాకుండా అచ్ఛంగా స్త్రీ రొమ్ము పాలలో ఉండే పోషకాలతో నిండి ఉంటాయి. ఆవుపాల కంటే కూడా శ్రేష్ఠమైనవి అని లీలా చెబుతున్నారు.  ఈ పాలను బాటిళ్లలో ప్యాక్ చేసి మార్కెట్లో విడుదల చేస్తారు. ఈ రకంగా పాల ఉత్పత్తి లేని తల్లులు ఈ రొమ్ముపాలను తమ బిడ్డలకు పట్టించవచ్చు అని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ కృత్రిమ పాల తయారీ ప్రయోగదశలో ఉంది. రానున్న మూడు సంవత్సరాల్లోనే ఇవి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు లీలా స్ట్రిక్‌ల్యాండ్‌ తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్