Nipple Problems । చనుమొనలు రంగు మారుతున్నాయంటే కారణం ఇది కావొచ్చు!
Nipple Problems: చనుమొనల్లో నొప్పి మంట ఉంటున్నాయా? చనుమొనల రంగు మారడం, సైజ్ పెరగడం ఇతరత్రా కారణాలతో ఆందోళన చెందుతుంటే అలా ఎందుకు అవుతుందో ఇక్కడ తెలుసుకోండి.
చనుమొనలు (Nipples) శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలలో ఒకటి. కాబట్టి వాటిలో సంభవించే ఏ చిన్న సమస్య అయినా అది తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లు ఆడవారి చనుమొనల్లో పొడిచినట్లు నొప్పి పుడుతుంది. దీంతో ఇలా ఎందుకు అవుతుంది, ఇదేమైనా తీవ్రమైన సమస్యకు సంకేతమా అని లోలోపల చాలా ఆందోళన చెందుతారు, ఎవరికైనా తమ బాధ చెప్పుకోవాలన్నా, చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది.
మరికొన్ని సార్లు మొత్తం స్తనంలో పట్టేసినట్లుగా నొప్పి కలుగుతుంది, చనుమొనల చుట్టూ ఎరియొల (areola) అని పిలిచే ముదురు రంగు చర్మంలో కూడా మంట పుడుతుంది. స్తనాలను పట్టుకున్నప్పుడు గడ్డలాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇవి రొమ్ము క్యాన్సర్‌కు సంకేతాలు కూడా కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఆడవారు మరింత తీవ్రంగా ఆందోళన చెందుతారు. మరి ఇలాంటి సంకేతాలన్నీ ఏదైనా తీవ్రమైన సమస్యను సూచిస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడవారూ, మీరు పైన పేర్కొన్న సంకేతాలు గమనించినట్లయితే ప్రతీసారి అదేదో తీవ్రమైన సమస్యగా భావించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇది చిన్న హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా కావచ్చు. ఉదాహరణకు పీరియడ్స్ సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉంటాయి, అప్పుడు కొంతమంది ఇలాంటి అసౌకర్యాన్ని అనుభవిస్తారు. అలాగే గర్భధారణ జరిగే సమయంలో లేదా హర్మోన్ల సమతుల్యత కోసం మందులు తీసుకుంటున్నప్పుడు కూడా ఇలాంటి సంకేతాలు ఉంటాయని గైనకాలజిస్టులు అంటున్నారు.
ఏదేమైనా ఉరుగుజ్జుల్లో నొప్పి, అసౌకర్యం, దురద పెరగడం రొమ్ము క్యాన్సర్‌కు చిహ్నంగా భావిస్తాము. కాబట్టి శరీరంలోని ఈ సున్నితమైన భాగం గురించి సరైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. చనుమొనలకు సంబంధించిన కొన్ని సాధారణ సమస్యల గురించి ఇక్కడ తెలుసుకోండి.
చనుమొన రంగులో మార్పు
యుక్తవయస్సు, గర్భం. ఈ రెండు దశలలో చనుమొనల్లో మార్పులు సాధారణం. మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యుక్తవయస్సులో ఉరుగుజ్జులు తరచుగా నల్లబడటం ప్రారంభిస్తాయి. లైంగిక అవయవాల పరిపక్వత కారణంగా ఇదంతా జరుగుతుంది. ఇది మీ ఎరియొలాలో కూడా చాలా మార్పులకు కారణమవుతుంది.
చనుమొన పరిమాణంలో మార్పు
చనుమొనలు, దాని చుట్టూ ముదురు చర్మం పరిమాణంలో మారుతూ ఉంటాయి. ఎరియొలా సాధారణంగా 3 సెం.మీ నుంచి 6 సెం.మీ వరకు విస్తరిస్తుంది. తల్లిపాలను అందివ్వడం లేదా గర్భధారణ సమయంలో చనుమొనల పరిమాణం మారడం సాధారణం. ఇది చాలా సాధారణ ప్రక్రియ.
చనుమొనల చుట్టూ జుట్టు
ఏ స్త్రీకి అయిన చనుమొనల చుట్టూ ఎరియొలాపై ఒకటి- రెండు వెంట్రుకలు ఉండవచ్చు. మీ విషయంలో కూడా ఇలా ఉంటే చింతించాల్సిన పనిలేదు. కానీ ఆ ప్రాంతంలో వెంట్రుకలు ఎక్కువ పెరిగితే, అది PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) సంకేతం కావచ్చు. వక్షోజాలు వదులుగా అవడానికి కూడా వేరే కారణాలు ఉంటాయి. కాబట్టి ఏది ఉన్నా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
సంబంధిత కథనం