Winter Honeymoon । చలికాలంలో వెచ్చని అనుభూతులు.. హనీమూన్ జంటలకు ప్రత్యేకం!
Winter Honeymoon Destinations: చలికాలంలో హనీమూన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? మీకు పూర్తి సంతృప్తిని మిగిల్చే వెచ్చని ప్రదేశాల జాబితా ఇక్కడ ఉంది చూడండి.
హనీమూన్‌కి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? మీరు మీ ప్రియమైన భాగస్వామితో ఏకాంతంగా గడపటానికి, మీ యాత్ర శృంగారభరితంగా సాగటానికి అనువైన ప్రదేశాల గురించి వెతుకుతున్నట్లయితే.. మీ వెతుకులాటకు ఇక్కడ 'హ్యాపీ ఎండింగ్' దొరుకుతుంది. ఇందుకోసం భారతదేశంలోనే ఎన్నో అద్భుతమైన, సురక్షితమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు వెళ్లి మీరు మీ భాగస్వామితో మరపురాని క్షణాలను ఆస్వాదించవచ్చు. అంతేకాదు, ఇవి మీ బడ్జెట్ కు అనుగుణంగా ఉంటాయి. మీకు కావలసిన ధరల్లో వివిధ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడకు వెళ్లటానికి ఎలాంటి రవాణా ఇబ్బందులు ఉండవు, హాయిగా ప్రయాణించవచ్చు.
ఈ చలికాలంలోనూ ఈ ప్రాంతాలలో ఉండాల్సిన స్థాయిలలో చల్లదనం ఉంటుంది, పచ్చని తోటల నడుమ వెచ్చని అనుభూతులు పొందవచ్చు.
కూర్గ్, కర్ణాటక
కూర్గ్ ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడ జలపాతాల నుండి పచ్చని కాఫీ తోటల వరకు ప్రతీది నచ్చుతుంది. ఈ ప్రదేశాన్ని 'స్కాట్‌లాండ్ ఆఫ్ ఇండియా' గా అభివర్ణిస్తారు. డిసెంబర్‌లో భారతదేశంలోని అత్యంత ఆహ్లాదకరమైన హనీమూన్ గమ్యస్థానాలలో కూర్గ్ ఒకటి.
ఊటీ, తమిళనాడు
మీ శీతాకాలపు హనీమూన్ సంపూర్ణ సంతృప్తిని మిగిల్చాలంటే ఊటీకి ఓటేయండి. చుట్టూ పచ్చని పర్వతాలు, ఆకుపచ్చని మైదానాలు, కాఫీతోటలు మిమ్మల్ని పరవశింపజేస్తాయి. గుంపుకు దూరంగా, మీ భాగస్వామితో ఏకాంత క్షణాలను గడపగలుగుతారు. ఇక్కడ మీరు బొటానికల్ గార్డెన్, కారా జలపాతం, ఊటీ సరస్సు వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.
ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్
హనీమూన్ కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్రదేశం మిమ్మల్ని మరొక లోకంలో విహరింపజేస్తుంది. ఇక్కడ మీరు భాగ్సు జలపాతం, దలైలామా ఆలయం, మస్రూర్ రాక్ కట్ టెంపుల్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.
నైనిటాల్, ఉత్తరాఖండ్
నైనిటాల్ నిజంగా కొత్త జంటలను మంత్రముగ్ధులను చేసే ప్రదేశం. మీరు నైని సరస్సులో బోటింగ్ ఆనందించవచ్చు. ఇది కాకుండా ఇక్కడ స్నో వ్యూ పాయింట్, టిఫిన్ టాప్, నైని దేవి ఆలయాన్ని సందర్శించవచ్చు.
జైసల్మేర్, రాజస్థాన్
రాజస్థాన్ రాష్ట్రంలోని ఈ నగరాన్ని గోల్డెన్ సిటీ అని కూడా అంటారు. ఎడారిలో ఎండమావి నుంచి పైకిలేచిన అద్భుతమైన దృశ్యాలు, ఇసుక దిబ్బలు, రాజ కోటలు ఇలా ఎన్నో ఆస్వాదించవచ్చు. పట్వోన్ కి హవేలీ, బడా బాగ్, జైసల్మేర్ వంటి ప్రదేశాలను సందర్శించడానికి మీరు ఇక్కడకు వెళ్లవచ్చు. మీరు ఈ స్థలాన్ని నిజంగా ఇష్టపడతారు.
సంబంధిత కథనం