Tips for Newlyweds | కొత్త జంట దగ్గరయ్యేందుకు మార్గాలు.. నమ్మకం ఇలా ఇవ్వండి!
Tips for Newlyweds: కొత్తగా పెళ్లైనా ఒకరికొకరు దగ్గరయ్యేందుకు జంకుతున్నారా? మనసు విప్పి మాట్లాడుకోండి, వారికి గతంలో ఏవైనా చేదు జ్ఞాపకాలు ఉన్నాయేమో తెలుసుకోండి, ఒకరిపై ఒకరు నమ్మకం ఇలా కలిగించుకోవాలంటే ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.
Tips for Newlyweds: Tips for Newlywedsఏ బంధం అయినా దృఢంగా పెనవేసుకోవాలంటే ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూనే ఒకరి పట్ల ఒకరు నమ్మకం, గౌరవం కూడా కలిగి ఉండాలి. మీరు కొత్త జంట అయితే, మీరిద్దరూ ఒకరి స్వభావాన్ని మరొకరు అర్థం చేసుకునేలా ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలి. అయితే ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా గతంలో చేదు అనుభవాలు చవిచూసినట్లతితే, వాటి నుంచి పూర్తిగా తేరుకోరు. అందరు అమ్మాయిలు ఒక్కటే లేదా అందరు అబ్బాయిలు ఒక్కటే. ఈ ప్రేమ, గీమ అనేది అంతా ట్రాష్. ప్రేమ అంటే సెక్స్ మాత్రమే, సెక్స్ కోసం ప్రేమను నటిస్తారు. అవసరాలు తీర్చుకున్నాక వదిలేస్తారు అనే భావనలో ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో వారు కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాక కూడా ఆనందంగా ఉండలేరు. ఎప్పుడూ తమ భాగస్వామిపై అనుమానంతో, అపనమ్మకంతో ఉంటారు.
మరి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే, ఒకరిపై ఒకరు నమ్మకం ఏర్పర్చుకోవాలంటే ఇద్దరూ కలిసి కొన్ని పనులు చేయాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
ఓపెన్‌గా మాట్లాడండి
మీ ఇద్దరి లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా, రోజులో ఒక్కసారైనా ప్రతి విషయంలోనూ ఓపెన్‌గా మాట్లాడుకునేలా మీరిద్దరూ ప్రయత్నించాలి. దీని వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవడమే కాకుండా, మీ భాగస్వామికి ఏదైనా బహిరంగంగా చెప్పగలరనే ధైర్యం కలిగించిన వారు అవుతారు. ఇలా మీ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది.
మీ తప్పులను అంగీకరించండి
మన తప్పులను అంగీకరించినప్పుడే ఏ తప్పునైనా సరిదిద్దుకోగలం. అటువంటి పరిస్థితిలో, మీరు పొరపాటు చేసినప్పటికీ, దానికి ఇగో సమస్యగా కాకుండా, క్షమించండి అని చెప్పడం చాలా ముఖ్యం. దీంతో మీ ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది.
తప్పులను సరిదిద్దుకోండి
తప్పులను అంగీకరించిన తర్వాత, వాటిని సరిదిద్దుకోవడం రెండవ దశ. అది ఎలా అనేది మీరే ఆలోచించుకోవాలి. జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు, కానీ మరోసారి చేయకుండా ఉంటే మనిషి అనిపించుకుంటారు. కాబట్టి మీ భాగస్వామిని ఒక అవకాశం కోరండి. కూల్ మైండ్‌తో ఆలోచిస్తే, ఏదైనా సాధ్యమే. ఇది మీ బంధాన్ని మెరుగుపరచడమే కాకుండా భాగస్వామికి మీ సంబంధంపై నమ్మకాన్ని, ప్రేమను పెంచుతుంది.
బాధ్యత తీసుకోవడం నేర్చుకోండి
మీరు కొత్తగా వివాహం చేసుకున్నట్లయితే, ఇరువురు వారికి చెందిన బాధ్యతలను చేపట్టాలి. ఏ విషయంలోనైనా మీ భాగస్వామి వైపు నుంచి కూడా సానుకూలంగా ఆలోచించాలి, ఈ క్రమంలో మీరు మీ కొత్త జీవితంలో సర్దుబాట్లు చేసుకోగలుగుతారు. మీరు మీ భాగస్వామితో సగం బాధ్యతలను పంచుకుంటే, ఇది మీ ఇద్దరి పనిని సులభతరం చేస్తుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా పెరుగుతుంది.
ఏకాంతంలో ఏకం అవ్వండి
కొత్త జంట రత్రిక్రీడలో కూడా ఆసక్తి కనబరచాలి. మీ భావాలను నిరభ్యంతరంగా పంచుకోండి. ఇది మీ దాంపత్య జీవితాన్ని బలోపేతం చేస్తుంది. అయితే శృంగారం ఇద్దరి అనుమతి మేరకే జరగాలి, అప్పుడే ప్రేమ వికసిస్తుంది. మీ భాగస్వామికి ఇష్టం లేకపోయినా, తన పరిస్థితి తెలుసుకోకుండా మీ వాంఛ తీర్చుకుంటే, ప్రేమ వికటిస్తుంది. ఇది మీ మధ్య మానసికంగా దూరాన్ని సృష్టిస్తుంది. తనువుపై మీరు ఉన్నా, వారి మనసు మాత్రం వేరే చోటకు మల్లుతుంది జాగ్రత్త.
నిజాయితీగా ఉండండి
మీరు ఎలాంటి వారైనా, ఎంత మొరటు వారైనా మీ భాగస్వామితో మీరు నిజాయితీగా ఉంటే. నెమ్మదిగా మీపై సదాభిప్రాయం కలుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఏ సంబంధంలో విశ్వసనీయంగా ఉండటం చాలా ముఖ్యం.
సంబంధిత కథనం