Relaxing Weekend Ideas । వారాంతంలో మీలోని అంతరాత్మను సంతృప్తిపరిచే విలాసవంతమైన ఉపాయాలు!-from taking soothing salt baths to spending time in nature best relaxing ideas for weekend ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relaxing Weekend Ideas । వారాంతంలో మీలోని అంతరాత్మను సంతృప్తిపరిచే విలాసవంతమైన ఉపాయాలు!

Relaxing Weekend Ideas । వారాంతంలో మీలోని అంతరాత్మను సంతృప్తిపరిచే విలాసవంతమైన ఉపాయాలు!

HT Telugu Desk HT Telugu
Mar 11, 2023 03:09 PM IST

Relaxing Weekend Ideas: వారం మొత్తం పనిచేసి వారాంతపు విరామం కోసం తహతహలాడుతున్నారా? మీకు, అలాగే మీలోని మీకు మీ అంతరాత్మకు సంతృప్తిపరిచే కొన్ని ఉపాయాలు ఇక్కడ చూడండి.

Relaxing Weekend Ideas
Relaxing Weekend Ideas (Unsplash)

Weekend: మనం ఉదయం లేచిన దగ్గర్నించీ, రాత్రి వరకు వివిధ రకాల పనులతో బిజీగా గడుపుతాం. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ మార్పులేని రొటీన్ దినచర్యలో మన జీవితాన్ని కోల్పోతున్నామనే కఠోర వాస్తవాన్ని గుర్తించడం లేదు. మన కోసం మనం కొంత సమయాన్ని వెచ్చించుకోలేమా?

నిరంతరంగా పనిచేస్తున్నప్పుడు విరామాలు, విశ్రాంతి (Relax) తీసుకోవడం వలన మనదైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. మీ రోజువారీ కార్యకలాపాల నుండి విరామం తీసుకునేందుకు వారాంతాలు గొప్ప అవకాశం. ఇప్పుడు వీకెండ్ వచ్చింది, మీరు ఎంత కష్టపడి పనిచేసే ప్రొఫెషనల్ అయినా ఈ వీకెండ్‌లో కూడా పనిచేయడం మానేయండి. మీ కష్టపడే క్యారెక్టర్ కాసేపు పక్కనపెట్టి సుఖపడే క్యారెక్టర్‌లోకి రండి.

నిర్విరామంగా గడిచే రోజులతో అలసిపోయిన మీలోని మీ అంతరాత్మ (inner soul) కు ఉత్సాహాన్ని, ఉపశమనాన్ని కలిగించేలా ఈ వారాంతంలో గడపండి. (Also Red- ఇదీ చదవండి: వారాంతపు వివాహం.. వారానికి ఒక్కసారి మాత్రమే కాపురం)

Relaxing Weekend Ideas- వారాంతంలో విశ్రాంతి పొందే ఉపాయాలు

మిమ్మల్ని మీరు విలాసపరచుకోవడానికి ఇక్కడ కొన్ని అద్భుతమైన స్వీయ-సంరక్షణ (self care) ఆలోచనలు ఉన్నాయి, వీటిని పరిగణలోకి తీసుకోండి.

రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించండి

మీరు రోజు తినే ఆహారం కాకుండా ఈ వారాంతంలో మీకు నచ్చిన ఆహారం లేదా ఎప్పుడూ తినని ఏదైనా కొత్త వంటకం రుచిని ఆస్వాదించండి. ఇందుకోసం ఒక డిన్నర్ నైట్ ప్లాన్ చేసుకోండి, ఏదైనా మంచి రెస్టారెంట్ వెళ్లండి లేదా మీ స్నేహితుడి ఇంట్లో ప్లాన్ చేయండి లేదా మీకు మీరే ఏదైనా రెసిపీని (Food Recipe) ప్రయత్నించండి. కొత్త రుచులను, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించండి.

ప్రకృతిలో సమయం గడపండి

మీరు ప్రకృతిలో సమయం గడిపినప్పుడు మీ శరీరం, మనస్సు రెండూ విశ్రాంతి పొందుతాయి. మీ సమీపంలోని పార్క్ లేదా నేచర్ రిజర్వ్‌ని సందర్శించండి. ప్రకృతిలో షికారు చేయండి, సఫారీ ప్లాన్ చేయండి, లేదా బైక్ రైడ్ చేయండి. మీరు మరింత వినోదం, థ్రిల్ కోరుకుంటే ఏదైనా అమ్యూస్‌మెంట్ పార్కుకు వెళ్లండి.

మసాజ్ లేదా స్పా చికిత్స పొందండి

మసాజ్ లేదా స్పా (spa massage) ట్రీట్‌మెంట్‌ను బుక్ చేసుకోవడం మిమ్మల్ని మీరు విలాసపరుచుకోవడానికి ఒక విలాసవంతమైన మార్గం. ఇది మీ శరీరంలోని ఒత్తిడి, టెన్షన్ నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది, మీకు పునరుజ్జీవనం లభించిన అనుభూతిని కలిగిస్తుంది. మీరు రిఫ్రెష్ ఆవుతారు.

రిలాక్సింగ్ బాత్ తీసుకోండి

కష్టతరమైన వారం రోజుల తర్వాత, వారాంతంలో మీకు ఓదార్పునిచ్చేలా విలాసవంతమైన స్నానం (Relaxing Bath) చేయడం మీకు హాయినిస్తుంది. విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన మార్గం. మీరు చేసే స్నానపు నీటిలో కొంచెం ఎప్సమ్ సాల్ట్ లేదా సుగంధ నూనెలను కలపండి. అలాగే, గదిలో లైట్స్ ఆఫ్ చేసి కొన్ని కొవ్వొత్తులను వెలిగించడం, ప్రశాంతమైన సంగీతాన్ని ఆన్ చేయడం వంటివి ఆలోచించండి.

డిజిటల్ డిటాక్స్ చేయండి

ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు, సోషల్ మీడియా నుంచి కొంత విరామం (Digital Detox) తీసుకోండి. కొన్ని గంటలు లేదా ఒక రోజు వరకు వాటికి పూర్తిగా డిస్‌కనెక్ట్ అవ్వండి. ఈ సమయంలో మీపై మీరు దృష్టి పెట్టడానికి, మీకు ఇష్టమైన అభిరుచిలో పాల్గొనడానికి లేదా ప్రియమైనవారితో గడపడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. ఏవైనా మంచి కథలు చదవండి. వంట చేయడం, పెయింటింగ్ వేయడం, మ్యూజిక్ వాయించడం వంటివి ప్రయత్నించవచ్చు.

బహుమతి ఇచ్చుకోండి

మనకు ఎవరైనా బహుమతులు ఇస్తే ఆనందంగా ఉంటుంది, ఎవరూ ఇవ్వనపుడు మీకు మీరే ఏదైనా బహుమతి ఇచ్చుకోండి. మీకోసం ఏదైనా స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేసుకోవడం, దుస్తులు, యాక్ససరీస్ వంటివి కొనుగోలు చేయడం, తలకు రక్షణగా టోపి, కళ్లకు రక్షణగా షేడ్స్ వంటివి కొనుగోలు చేసి మీకు మీరుగా బహుమతి ఇచ్చుకోండి.

యోగా లేదా ధ్యానం సాధన చేయండి

యోగా, ధ్యానం (Yoga- Meditation) ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని ప్రోత్సహిస్తాయి. కండరాలాలో వశ్యతను పెంచడానికి ఇవి అద్భుతమైనవి. యోగా సెషన్‌లో పాల్గొనండి లేదా గైడెడ్ మెడిటేషన్ కోసం ఆన్‌లైన్‌లో శోధించడం చేయండి లేదా ఇంట్లోనే ఒక 10-15 నిమిషాలు సాధన చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం