Weekend Fun Workouts। వారాంతంలో ఆహ్లాదకరమైన వ్యాయామాలు.. చేస్తే ఉల్లాసం ఉత్సాహం!-bid farewell to lazy sundays here are the fun ways to do workouts during weekends ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Bid Farewell To Lazy Sundays, Here Are The Fun Ways To Do Workouts During Weekends

Weekend Fun Workouts। వారాంతంలో ఆహ్లాదకరమైన వ్యాయామాలు.. చేస్తే ఉల్లాసం ఉత్సాహం!

HT Telugu Desk HT Telugu
Dec 18, 2022 09:06 AM IST

Weekend Fun Workouts: ఆదివారం రోజు వ్యాయామం చేయడం ఇష్టం లేకపోతే మరో రకంగా ఆహ్లాదకరమైన కార్యకలపాల్లో పాల్గొనండి, అది కూడా మీకు మంచి వ్యాయామం అవుతుంది.

Weekend Fun Workouts
Weekend Fun Workouts (Unsplash)

మీ ఆరోగ్యం గురించి ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వారంలో అన్ని రోజులు కుదరకపోతే కనీసం వీకెండ్‌లో అయినా ఒకటి రెండు రోజులు మీ ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం సమయం కేటాయించాలి. ప్రతి వారం ఒకటి లేదా రెండు రోజులలో కనీసం 75 నిమిషాల తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ లేదా 150 నిమిషాల మితమైన వ్యాయామం చేసే వారి ఆయుర్దాయం పెరుగుతుందని వివిధ అధ్యయనాలు కూడా తెలియచేశాయి.

అయితే చాలామంది వ్యక్తులు ఆదివారం రాగానే వ్యాయామం చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని చూస్తారు. వ్యాయామానికి విరామం ప్రకటిస్తారు. కానీ ఈ అలవాటు రోజూవారీ అలవాటుగా మారి మొత్తానికే వ్యాయామం చేయాలనే ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి జిమ్‌కు వెళ్లడం, బయట వ్యాయామ సెషన్‌లలో పాల్గొనడం ఇష్టం లేకపోతే, ఇంట్లోనే ఏదైనా ఇండోర్ వ్యాయామాన్ని ఎంచుకోవాలి.

Weekend Fun Workouts- వారాంతంలో ఆహ్లాదకరమైన వ్యాయామాలు

మీకు అసలు ఆదివారం రోజు వ్యాయామం చేయడం ఇష్టం లేకపోతే మరో రకంగా అయినా ప్రయత్నం చేయవచ్చు. ఆదివారం ఆహ్లాదకరమైన కార్యకలపాల్లో పాల్గొనండి, అది కూడా మీకు మంచి వ్యాయామం అవుతుంది. వీకెండ్‌లో కొన్ని బెస్ట్ వ్యాయామాలు మీకోసం.

టీమ్ స్పోర్ట్ ఆడండి

ఆదివారం వ్యాయామం చేయడానికి టీమ్ స్పోర్ట్స్ గొప్ప ఛాయిస్ అవుతుంది . మీరు మీ స్నేహితులతో జట్టుకట్టి క్రికెట్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, వాలీబాల్ లేదా మీకు నచ్చిన ఏ క్రీడలో అయినా పాల్గొనవచ్చు. ఈ క్రీడలు చాలా సరదాగా ఉంటాయి. మీ స్నేహితులతో సరదాగా సమయాన్ని గడిపవచ్చు, మరోవైపు మీ క్యాలరీలు కూడా కరుగుతాయి. ఈ విధంగా మీకు మంచి వ్యాయామం లభిస్తుంది.

సైక్లింగ్‌కు వెళ్లండి

వారాంతంలో సైక్లింగ్‌ అనేది ఒక ఆహ్లాదకరమైన వ్యాయామం. మీ ప్రాంతంలోని కొన్ని అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ, వ్యాయామాన్ని పొందడానికి ఇది ఒక అద్భుత మార్గం. ఈ సైక్లింగ్ అనేది మీ జీవితంలోని ఒత్తిడి మాయమయ్యేలా చేస్తుంది. మీకు మీరుగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లొచ్చు లేదా వారాంతంలో సైక్లింగ్ మారథాన్ వంటివి నిర్వహిస్తారు. అందులో పాల్గొనవచ్చు. సైక్లింగ్ చేసుకుంటూ మీ కలల గురించి కూడా ఆలోచించవచ్చు. ఈ సెషన్ మీకోసం మీరే ఆలోచించే సమయాన్ని కూడా అందిస్తుంది.

హైకింగ్ వెళ్ళండి

హైకింగ్ అనేది మీరు, మీ స్నేహితుడితో కలిసి చేసే ఒక మంచి వీకెండ్ యాక్టివిటీ. ఇది ఎవరి తోడు అవసరం లేకుండా ఒంటరిగా కూడా చేయవచ్చు. ఉదయాన్నే స్వచ్ఛమైన చల్లటిగాలిలో బయటికి రావడానికి , ప్రకృతిని ఆస్వాదించడానికి హైకింగ్ మరొక గొప్ప మార్గం. వేర్వేరు భూభాగాలపై నడిచేటప్పుడు హైకింగ్ మీకు గొప్ప వ్యాయామాన్ని అందిస్తుంది. ఇది యాక్టివిటీ మీకు వ్యాయామాన్ని ఇవ్వడం మాత్రమే కాదు. కొండలు ఎక్కడం, లక్ష్యాన్ని చేరుకోవడం వంటివి ఉండటం మూలానా, ఇది మీలో ఏదైనా సాధించాలనే తపన పెంచుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా మంది శీతాకాలాంలో హైకింగ్ కోసం వెళ్తారు, మీరు జాబితాలో చేరిపోండి.

స్విమ్మింగ్ చేయండి

ఆదివారం వర్కవుట్ చేయడానికి ఇష్టం లేకపోతే, నేరుగా స్విమ్మింగ్ పూల్ లో దూకి ఈత కొట్టండి. ఈత రాకపోతే నిపుణుల సహాయం పొందండి. తద్వారా మీరు ఈతకొట్టడం నేర్చుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ ఈత మీకు మంచి వ్యాయామం అవుతుంది. ఇది ఒక ఆహ్లాదకరమైన వర్కవుట్, మీకు విశ్రాంతి అనుభూతిని కలిగిస్తుంది. మరి ఇలాంటి వర్కవుట్ చేయడానికి ఇష్టపడనిది ఎవరు.

అర్బన్ పార్కులో గడపండి

మీ ఆదివారం మరింత వినోదాత్మకంగా మారేందుకు ఇది మరొక ఐడియా. ఇప్పుడు నగరాలలో లేదా నగర శివారుల్లో ఎన్నో రకాల అర్బన్ పార్కులు ఏర్పాటవుతున్నాయి. అందులో మీకు నచ్చే ఎన్నో కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. కొన్ని ప్రైవేట్ అర్బన్ పార్కుల్లో మీకు పైన పేర్కొన్న అన్ని ఆప్షన్స్ లభిస్తాయి. అంతకుమించి కూడా యాక్టివిటీస్ జరుగుతాయి, మీకు ఉదయం వేళ అల్పాహారం, మధ్యాహ్నంకు లంచ్ కూడా సిద్ధం చేస్తాయి. మరి ఇలాంటి ఒక చోటుకు వెళ్లి సమయం గడపండి. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్