Home Workout । వారాంతంలో ఇంట్లోనే ఉండి చేసుకోగలిగే సులభమైన వ్యాయామాలు!-easy home workouts when you don t want to hit the gym in the weekend ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Workout । వారాంతంలో ఇంట్లోనే ఉండి చేసుకోగలిగే సులభమైన వ్యాయామాలు!

Home Workout । వారాంతంలో ఇంట్లోనే ఉండి చేసుకోగలిగే సులభమైన వ్యాయామాలు!

HT Telugu Desk HT Telugu

Home Workout: వారాంతంలో ఇంట్లో ఉండి చేసుకోగలిగే వ్యాయామాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇండోర్ వ్యాయామాల గురించి తెలియజేశాం. మీరూ తప్పకుండా ప్రయత్నించండి.

Home workout: easy indoor exercises to do at home (Pixabay)

ఈరోజుల్లో డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యంగా ఉండేందుకు ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం కానీ ఫెస్టివల్ సీజన్ ఉన్నప్పుడు లేదా ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పుడు జిమ్‌కి వెళ్లాలని అనిపించదు, బయటకు వెళ్లి వ్యాయామం చేయాలనే ఆసక్తి కలగదు.

కానీ అదే సమయంలో మీ వర్కవుట్‌లను మిస్ చేయకూడదు. వారం మొత్తం చేయకపోయినా, కనీసం వారంలో రెండు రోజులైనా వీకెండ్ వ్యాయామాలు చేయాలనేది నిపుణుల సలహా. మరి బయటకు వెళ్లి వ్యాయామాలు చేసే పరిస్థితి లేనపుడు ఇంట్లో ఉండే చేసుకోగలిగే వ్యాయామాలు ఎన్నో ఉన్నాయి. నడక, స్కిప్పింగ్, జుంబా, పైలేట్స్ లేదా యోగా వంటివి ఇంట్లో ఉండే చేసుకోవచ్చు.

ఇండోర్ వ్యాయామాల (Home Workout) గురించి ఇది వరకే మీకు కొంత తెలుసు. అయితే బెంగళూరులోని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో సీనియర్ ఫిజియోథెరపిస్ట్ అయినటువంటి డా. లాల్చావిమావి వారాంతాల్లో చేసుకొనే సులభమైన మరికొన్ని ఇండోర్ వ్యాయామాలను సూచించారు. అవేంటో చూడండి, మీరూ ప్రయత్నించండి.

స్టేషనరీ వాకింగ్

బహిరంగ ప్రదేశాలకు నడకకు వెళ్లే వీలు లేనపుడు ఇంటివద్దే స్టేషనరీ వాకింగ్ చేయవచ్చు. నడకకు సౌకర్యవంతమైన బూట్లు ధరించి, మంచి మ్యూజిక్ వింటూ ఒక 20 నిమిషాలపాటు వాకింగ్ చేయాలి. గర్భధారణ సమయంలో కూడా స్టేషనరీ వాకింగ్ చేయడం సురక్షితం.

జుంబా

మీరు డ్యాన్స్ చేయడానికి ఇష్టపడితే జుంబా ఏరోబిక్ డ్యాన్స్ కదలికలు అద్భుతమైన వ్యాయామంగా ఉంటాయి. జుంబా అనేది సరదా డ్యాన్స్ మూవ్‌లతో కూడిన విభిన్నమైన నృత్య రీతుల కలయిక. బరువు తగ్గడానికి కూడా ఈ జుంబా డ్యాన్స్ సహాయపడుతుంది. జుంబా డ్యాన్స్ నేర్పించడానికి చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, అయినప్పటికీ ఆన్‌లైన్‌లో ఉన్న వీడియోలను చూస్తూ మీరు నేర్చుకోవచ్చు. పిల్లల నుండి తాతల వరకు ఎవరైనా జుంబా చేయవచ్చు. గర్భధారణ సమయంలో కూడా చేయవచ్చు. అయితే గర్భిణీలు తీవ్రంగా కాకుండా తేలికపాటి నృత్యకదలికలు ఉండేలా చూసుకోవాలి.

ట్రెడ్‌మిల్ లేదా స్టేషనరీ సైక్లింగ్

ట్రెడ్‌మిల్, స్టేషనరీ సైక్లింగ్, స్టెప్పర్ లేదా ఎలిప్టికల్ సైకిల్‌తో వ్యాయామం చేయడం కూడా ప్రయోజనకరమే. మీరు ఇంట్లో ఉండి చేయటానికి ఇవి మంచి కార్డియో లేదా ఏరోబిక్ వ్యాయామాలుగా పరిగణించవచ్చు.

టబాట

Tabata అనేది 20 సెకన్లపాటు అధిక తీవ్రతతో చేసే వ్యాయామం, ఆపై 10 సెకన్లపాటు విరామం. ఇలా విరామాలు ఇచ్చుకుంటూ 20-30 నిమిషాల పాటు చేసే వ్యాయామం. ఉదాహరణకు - బర్పీస్ 20 సెకన్లు, 10 సెకన్ల విశ్రాంతి; సైడ్ లుంజ్ 20 సెకన్లు, 10 సెకన్ల విశ్రాంతి, పర్వతారోహణ 20 సెకన్లు, 10 సెకన్ల విశ్రాంతి, రష్యన్ ట్విస్ట్ 20 సెకన్లు, 10 సెకన్ల విశ్రాంతి. ఇవన్నీ టబాట వర్కవుట్లలో భాగమే. ప్రతి కదలికలో 8 రౌండ్‌లను పూర్తి చేయాలి. టబాటా డంబెల్స్, ఎక్సర్‌సైజ్ బాల్స్, కోర్ స్ట్రాంగ్టింగ్ సెట్‌లు లేదా కిక్‌బాక్సింగ్ మూవ్‌లను చేయవచ్చు. ఇంటి వద్ద చేయగలిగే వ్యాయామం నుండి గరిష్ట ప్రయోజనాలను పొందాలనుకుంటే ఈ రకమైన వ్యాయామం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సంబంధిత కథనం