Earthing । నేలను తాకడం ద్వారా గొప్ప శక్తిని పొందవచ్చు, ఆ టెక్నిక్‌లు తెలుసుకోండి!-know what is earthing and how these grounding techniques help release stress transfers inner power
Telugu News  /  Lifestyle  /  Know What Is Earthing And How These Grounding Techniques Help Release Stress, Transfers Inner Power
Earthing Techniques
Earthing Techniques (Unsplash)

Earthing । నేలను తాకడం ద్వారా గొప్ప శక్తిని పొందవచ్చు, ఆ టెక్నిక్‌లు తెలుసుకోండి!

11 March 2023, 8:58 ISTHT Telugu Desk
11 March 2023, 8:58 IST

Earthing Techniques: మీరు నేలను తాకడం ద్వారా నేలలోని శక్తిని పొందవచ్చు. దీనినే ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అంటారు. ఈ టెక్నిక్స్ ఎందుకోసం, మీ ఆరోగ్యం విషయంలో ఎలాంటి ప్రభావాలు చూపుతాయో ఇక్కడ తెలుసుకోండి.

Earthing Techniques: ఎర్తింగ్ చేయడం లేదా దీనినే గ్రౌండింగ్ అని కూడా పిలుస్తారు. ఇది మన శరీరాన్ని నేలకు తాకించడం ద్వారా కలిగే అనుభూతి. ఇది కూడా వ్యాయామం చేయడంలో ఉపయోగించే ఒక టెక్నిక్. నేలపైన పడుకోవడం, చెప్పులు లేకుండా నడవడం లేదా కూర్చోవడం లేదా నేలపైన వ్యాయామాలు చేయడం వంటివి భూమితో, ప్రకృతితో అనుబంధాన్ని సూచిస్తాయి. తద్వారా భూఉపరితలంలోని ఎలక్ట్రాన్‌లు మానవ శరీరంలోని ఎలక్ట్రాన్‌లతో అనుసంధానం అవుతాయి. ఇవి భూమి నుండి శక్తిని శరీరంలోకి బదిలీ చేస్తాయి, శక్తి వికేంద్రీకరణ జరుగుతుంది.

ఈ గ్రౌండింగ్ టెక్నిక్‌లు మీలోని ఆవేశపూరిత భావోద్వేగాలు, గందరగోళ పరిస్థితుల నుండి మీ దృష్టిని మరలుస్తాయి, ప్రస్తుత క్షణంపై దృష్టి కేంద్రీకరించడంలో మీకు సహాయపడతాయి. మీరు మనసులో ఎంతటి బాధను అనుభవించే పరిస్థితుల నుంచైనా మీ ఆలోచనలను క్లియర్ చేయటానికి, మీ ప్రశాంత భావాలను అందించడానికి ఈ గ్రౌండింగ్ టెక్నిక్‌లు ప్రభావవంతగా పనిచేస్తాయి. ఈ పద్ధతుల్లో మీలోని ఐదు ఇంద్రియాల ద్వారా మీరు ప్రత్యక్షంగా తాకగలిగే వస్తువులు, ప్రత్యక్షంగా ఉండే విషయాలపై అనుభూతి చెందేలా అవకాశం కల్పిస్తాయి. అలాంటి కొన్ని ఎర్తింగ్ టెక్నిక్ లను ఇప్పుడు తెలుసుకోండి.

1. మీ చేతులను నీటిలో ఉంచండి

మీ చేతులను ఏదైనా నీటి ఉపరితలంపై ఉంచండి, ఆ నీటి ఉష్ణోగ్రతపై దృష్టి పెట్టండి. అది మీ చేతివేళ్లు, అరచేతులకు ఎలాంటి అనుభూతినిస్తుంది, అలాగే మీ చేతుల వెనుక భాగంలో ఎలా అనిపిస్తుంది. మీ చేతిలోని ప్రతి భాగానికి ఒకే విధంగా అనిపిస్తుందా? అనేది గమనించండి. ముందుగా గోరువెచ్చని నీటిని, తర్వాత చల్లగా వాడండి. ఆ తరువాత, మళ్లీ గోరువెచ్చని నీటిని ప్రయత్నించండి, ఇలా నీరు మార్చటం చేయడం వలన ఎలా అనిపిస్తుందో గమనించండి.

2. మీకు సమీపంలో ఉన్న వస్తువులను తాకండి

మీరు కళ్లు మూసుకొని మీకు సమీపంలో ఉన్న వస్తువులను తాకండి. మీరు తాకిన వస్తువులు మృదువుగా ఉన్నాయా లేక గట్టిగా ఉన్నాయా? బరువైన వస్తువా లేక తేలికైనదా? వెచ్చగా ఉందా లేదా చల్లగానా? ఇలా ప్రతి వస్తువు ఆకృతి, స్వభావంపై దృష్టి పెట్టండి. ఎరుపు లేదా నీలం రంగులకు బదులుగా క్రిమ్సన్, బుర్గుండి, నీలమణి వంటి నిర్దిష్ట రంగుల వస్తువులు ఉన్నాయేమో చూడండి.

3. లోతుగా శ్వాస తీసుకోండి

నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి, ఆపై వదలండి. మీరు తీసుకునే ప్రతి శ్వాసతో "ఇన్" అని చెప్పండి, వదిలేటపుడు "అవుట్" అని చెప్పండి లేదా మనసులోనే అనుకోండి. మీరు తీసుకునే ప్రతి శ్వాస మీ ఊపిరితిత్తులను నింపుతున్నట్లు అనుభూతి చెందండి, శ్వాస వదులుతున్నప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించండి.

4. ఆహారం లేదా పానీయాన్ని ఆస్వాదించండి

మీరు ఇష్టపడే ఆహారం లేదా పానీయం కొద్దిగా తీసుకోండి, ప్రతీసారి దాని రుచి ఎలా ఉందో గమనించండి. దాని వాసన చూడండి, వాసనకు తగినట్లుగా నాలుకపై ఆ రుచి ఉందో, లేదో ఆలోచించండి.

5. ఒక చిన్న నడకకు వెళ్లండి

ఒక చిన్న నడకకు వెళ్లండి, మీ అడుగులపై దృష్టి కేంద్రీకరించండి, మీ అడుగులను లెక్కించండి. అలాగే మీ అడుగుజాడల లయను గమనించండి. మీరు మీ పాదాలను నేలపై ఉంచి, ఆపై దాన్ని మళ్లీ ఎత్తడం చేస్తే ఎలా అనిపిస్తుంది గమనించండి.

చివరగా మీ శరీరాన్ని కదిలించండి, కొన్ని వ్యాయామాలు లేదా స్ట్రెచ్‌లు చేయండి. జంపింగ్ జాక్స్, స్కిప్పింగ్ చేయడం, స్పాట్ జాగింగ్, కండరాలను సాగదీయడం ఇలా ఏదో రకంగా మీ శరీరాన్ని కదిలించండి. ప్రతి కదలికలో మీ చేతులు, పాదాలు నేలను తాకించినప్పుడు లేదా గాలిలో కదులుతున్నప్పుడు మీ శరీరానికి ఎలా అనిపిస్తుంది అనే దానిపై శ్రద్ధ వహించండి. ఈ మొత్తం అభ్యాసం సాధన చేసిన తర్వాత మీరు చాలా తేలికగా అనుభూతి చెందుతారు, విషయాలపై స్పష్టతతో ఉంటారు.

సంబంధిత కథనం