Epsom Salt Bath Benefits : ఆ సాల్ట్​తో స్నానం చేస్తే.. చర్మానికి, ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో-5 health benefits of epsom salt bath here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Epsom Salt Bath Benefits : ఆ సాల్ట్​తో స్నానం చేస్తే.. చర్మానికి, ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో

Epsom Salt Bath Benefits : ఆ సాల్ట్​తో స్నానం చేస్తే.. చర్మానికి, ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 02, 2022 12:30 PM IST

Epsom Salt Bath Benefits : అదేంటి సాల్ట్​తో స్నానం చేస్తే.. ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనుకుంటున్నారా? కానీ నిజమే అంటున్నారు నిపుణులు. ఈ సాల్ట్​తో స్నానం చేస్తే.. ఒత్తిడి తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అంటున్నారు. ఇంతకీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్సమ్ సాల్ట్ ప్రయోజనాలు
ఎప్సమ్ సాల్ట్ ప్రయోజనాలు

Epsom Salt Bath Benefits : ఎప్సమ్ సాల్ట్ అనేది.. అనేక వ్యాధులకు ఒక ప్రసిద్ధ ఔషధం. ఇది కండరాల నొప్పి, వాపు, నొప్పులు, ఒత్తిడి నుంచి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది. ఈ ఎప్సమ్ లవణాన్ని మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా పిలుస్తారు. ఇది ఆక్సిజన్, మెగ్నీషియం, సల్ఫర్‌లతో కూడిన రసాయన సమ్మేళనం.

ఈ ఉప్పు వందల సంవత్సరాలుగా ఫైబ్రోమైయాల్జియా, నిద్రలేమి, మలబద్ధకం వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఎప్సమ్ సాల్ట్​తో స్నానం చేస్తే కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి..

ఎప్సమ్ సాల్ట్‌లోని ముఖ్యమైన ఖనిజాలు శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మలబద్ధకానికి చికిత్స చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇందులోని మెగ్నీషియం.. దాని లోపం ఉన్నవారికి, ఫైబ్రోమైయాల్జియా ఉన్నవారికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటితో నిండిన బాత్‌టబ్‌లో ఎప్సమ్ సాల్ట్‌ను వేసి అందులో 12-15 నిమిషాలు నానబెట్టి మీ శరీరాన్ని డిటాక్స్ చేసి ఒత్తిడిని వదిలించుకోండి.

చర్మంపై చికాకు లేదా మంటను దూరం చేసుకోవడానికి

ఎప్సమ్ సాల్ట్ బాత్ మీకు విశ్రాంతిని అందించడమే కాకుండా కాంటాక్ట్ డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్, అథ్లెట్స్ ఫుట్ వల్ల కలిగే చర్మపు చికాకు, మంటను కూడా తగ్గిస్తుంది. ఇది క్రిమి కాటు, కాలానుగుణ మార్పులు లేదా పాయిజన్ ఐవీ వల్ల కలిగే పొడి, దురదను దూరం చేస్తుంది.

చర్మాన్ని ఇతర ఇన్​ఫెక్షన్ల నుంచి రక్షిస్తూ.. అదనపు ఉపశమనం పొందడానికి, చనిపోయిన చర్మ కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి మీరు టీ ట్రీ ఆయిల్ వంటి చికిత్సా నూనెలను కూడా కలిపి తీసుకోవచ్చు.

కీళ్లనొప్పులు, నొప్పుల నుంచి ఉపశమనానికై..

మెత్తగా నూరిన ఎప్సమ్ ఉప్పుతో స్నానం చేస్తే.. రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్, లూపస్ వంటి శోథ నిరోధక పరిస్థితులతో సంబంధం ఉన్న నొప్పి, వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇందులోని మెగ్నీషియం.. వ్యాయామం చేయడం వల్ల కలిగే నొప్పిని, కీళ్ల, కండరాల నొప్పులనుంచి ఉపశమనం ఇస్తుంది. అల్లం, గోరువెచ్చని నీరు, ఎప్సమ్ సాల్ట్ కలిపి పేస్ట్ లా చేసి కీళ్లపై రుద్దితే నొప్పి తగ్గుతుంది.

మీ పాదాలను సంరక్షణ ఇస్తుంది..

ఎప్సమ్ సాల్ట్ బాత్ అథ్లెట్స్ ఫుట్ లక్షణాల నుంచి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది. గోళ్ల ఫంగస్, గౌట్ నొప్పి, వాపును నయం చేస్తుంది. అంతేకాకుండా పాదాల దుర్వాసనను కూడా దూరం చేస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.

మీరు ఎప్సమ్ సాల్ట్ బాత్ తీసుకోవచ్చు. టీ ట్రీ ఆయిల్ కలిపిన ఎప్సమ్ ఉప్పు నీటిలో మీ పాదాలను నానబెట్టి పొడి లేదా పగిలిన మడమలను ఎక్స్‌ఫోలియేట్ చేయవచ్చు. దురద నుంచి ఉపశమనం ఇస్తుంది. మీ పాదాలను వేగంగా నయం చేస్తుంది.

ఒత్తిడిని తగ్గించడానికై..

స్వీయ సంరక్షణకై సులభమైన, సరసమైన పద్ధతి.. ఎప్సమ్ సాల్ట్ బాత్. ఇది మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సుదీర్ఘమైన, అలసిపోయిన రోజు తర్వాత మిమ్మల్ని ప్రశాంతపరుస్తుంది.

అంతేకాకుండా ఆందోళన, నిరాశ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. ఎప్సమ్ సాల్ట్‌లోని అధిక మెగ్నీషియం స్థాయిలు మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్‌లను పెంచడంలో సహాయపడతాయి. ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. మీరు మంచిగా, రిలాక్స్‌గా ఉండేలా చేస్తుంది. నిద్రను ప్రేరేపించే హార్మోన్‌ను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.

సంబంధిత కథనం

టాపిక్