తెలుగు న్యూస్ / ఫోటో /
Constipation | ఈ చిట్కాలతో మలబద్ధకానికి చెక్!
- Constipation.. ఈ రోజుల్లో మలబద్ధకం చాలా మందిని వేధిస్తోంది. అయితే మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు.
- Constipation.. ఈ రోజుల్లో మలబద్ధకం చాలా మందిని వేధిస్తోంది. అయితే మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు.
(1 / 7)
మీ రోజువారీ కార్యకలాపాల్లో కొన్ని మార్పులు చేసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, కాస్త శారీరకంగా యాక్టివ్‌గా ఉండటం, నీళ్లు, జ్యూస్, సూప్ వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మీ పొట్ట మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. మలబద్ధకం నుంచి బయటపడాలంటే ఇంకా ఏం చేయాలో డైటీషియన్ రిచా దోషి సూచిస్తున్నారు.(Pixabay, Shutterstock)
(2 / 7)
ఒకే సమయానికి తినండి: ప్రతి రోజూ ఒకే సమయానికి తినడం వల్ల మన జీవక్రియ సక్రమంగా ఉంటుంది. ఓ కచ్చితమైన సమయానికి తినకపోవడం, ఓ పూట భోజనం మానేయడం వంటివి మీ జీవక్రియను నెమ్మదించేలా చేసి జీర్ణ సమస్యలను తీసుకొస్తుంంది.(Imaging: Anand Sinha)
(3 / 7)
నీళ్లు ఎక్కువగా తాగండి: మలబద్ధకం వెనుక ప్రధాన కారణం డీహైడ్రేషన్. పొట్టలో తగినన్ని నీళ్లు ఉంటే అది మలాన్ని పలుచగా చేసి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.(Shutterstock)
(4 / 7)
కూరగాయలు, పండ్లు తప్పనిసరి: ప్రతి రోజూ మీ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆపిల్స్, బీన్స్, సిట్రస్ పండ్లు, క్యారెట్లు, బార్లీ వంటివి తీసుకోవాలి. ఈ ఆహారం మలబద్ధకానికి మంచి మందులా పని చేస్తుంది.(Pixabay)
(5 / 7)
ఒత్తిడి తగ్గించుకోండి: ఒత్తిడి హార్మోన్లు మీ జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా మీ ఆహారపు అలవాట్లను కూడా ఈ ఒత్తిడి మారుస్తుంది. ఫలితంగా మలబద్ధకం బారిన పడతారు. ఒత్తిడి తగ్గించుకుంటే అన్ని విధాలుగా మంచిది.(Pixabay)
(6 / 7)
బాగా నమిలి మింగండి: తినేటప్పుడు ఎవరో వెనుకాల తరుముతున్నట్లు గబగబా తినకండి. నెమ్మదిగా, బాగా నమిలి మింగండి. ఇలా చేసినప్పుడు ఆహారం జీర్ణమవడానికి సాయపడే ఎంజైమ్స్ విడుదల అవుతాయి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఒకవేళ సరిగా నమలకుండా అలాగే మింగేస్తే.. ఆహారం జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది.(Pixabay)
ఇతర గ్యాలరీలు