Sex and Health Benefits । నిండైన జీవితానికి శృంగారమే అమృతం!
sex and health benefits: ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటే రెగ్యులర్ గా వ్యాయామం చేసినట్లే. ఒత్తిడి నివారించటం నుంచి బంధాలను బలపరచటం వరకు సెక్స్ వలన కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.

sex and health benefits: ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు? కానీ దానిని పొందడం ఎలా? ఆరోగ్యంగా ఉంటే ఆయుష్షు పెరుగుతుందంటారు. మరి అందుకోసం అమృతం తాగాల్సిన అవసరం లేదు, మధుర అదరామృతంతో ప్రారంభించి, శృంగార రసాలను జుర్రుకుంటే అదే మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. మీరు మానసిక స్థితిని మెరుగుపరుచుకోవాలన్నా, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నా, శరీరం ఫిట్ గా ఉండాలన్నా అందుకు ఏకైక ఔషధం దాని పేరే శృంగారం. అవును, మీరు చదివింది నిజమే. సెక్స్ మీ ఆరోగ్యాన్ని ఆశ్చర్యకరమైన మార్గాల్లో పెంచుతుంది. సెక్స్ అనేది కేవలం సంతానోత్పత్తికి మాత్రమే కాదు, అంతకు మించి. మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి, సామాజిక పురోగతికి సెక్స్ ముఖ్య పాత్ర వహిస్తుంది. సంబంధంలో సాన్నిహిత్యాన్ని పెంపొందించడంలో, బంధం బలపడటంలో ఇద్దరి మధ్య శృంగారం చాలా కీలకమైనది. తనువులు ఏకమైనపుడే వారి మనసులు ఏకమవుతాయి అనేది నిజం. శృంగారంతో కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
తలనొప్పి తగ్గిస్తుంది
ఒక అధ్యయనం ప్రకారం, లైంగిక కార్యకలాపాలు కొన్ని మైగ్రేన్, క్లస్టర్ తలనొప్పి నుండి పాక్షికంగా లేదా పూర్తిగా ఉపశమనం అందించగలవని నిరూపితమయ్యాయి. మైగ్రేన్‌లు ఉన్నవారిలో 60 శాతం మంది, క్లస్టర్డ్ తలనొప్పితో బాధపడుతున్న వారిలో 30 శాతం మంది సెక్స్‌లో పాల్గొంటే వారి తలనొప్పి నుండి ఉపశమనం పొందుతున్నట్లు అధ్యయనం తెలిపింది.
మంచి వ్యాయామం
ప్రతిరోజు సంభోగంలో పాల్గొంటే రెగ్యులర్ వ్యాయామంగా లెక్కించవచ్చు. ఇది మీకు మంచి రోగనిరోధక వ్యవస్థ, ఆరోగ్యకరమైన హృదయాన్ని కలిగి ఉండటానికి సహాయపడుతుంది.
నాణ్యమైన నిద్ర
దుప్పట్ల మధ్య దూరిపోయి భాగస్వాములు ఇద్దరూ ఏకమవుతున్న సమయంలో, మెత్తటి మృదువైన శరీర భాగాలు తాకుతుంటే నరాలు జివ్వుమనే అనుభూతి కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళనలు ఒక్కసారిగా దూరమై గమ్మత్తుగా కమ్మటి నిద్రలోకి జారుకుంటారు. సంతృప్తికరమైన సెక్స్ నాణ్యమైన నిద్రకు దారి తీస్తుంది.
స్ట్రెస్ రిలీఫ్
ఆరోగ్యకరమైన సెక్స్ ఒక గొప్ప ఒత్తిడి నివారిణి. ఇది మీ రోజువారీ టెన్షన్‌ని తగ్గిస్తుంది, మిమ్మల్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.
సంతృప్తికర జీవితం
సంతృప్తికరమైన శృంగార జీవితం మీకు ఒక సంతృప్తికరమైన జీవితాన్ని అందిస్తుంది. మీ జీవితంలో ఏం ఉన్నా, లేకపోయినా చురుకైన సెక్స్ ఉంటే ఆనందం మీ వెంటే ఉంటుంది.
సంబంధిత కథనం