Pre-Sex Checklist | శృంగారం చేసే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!-things couples should remember before getting physical for a happy and healthy sex life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Things Couples Should Remember Before Getting Physical For A Happy And Healthy Sex Life

Pre-Sex Checklist | శృంగారం చేసే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!

HT Telugu Desk HT Telugu
Apr 02, 2023 09:39 PM IST

Pre-Sex Checklist: శృంగారం అనేది నిదానంగా చేసే కార్యం. ఏ వ్యక్తి అయినా సెక్స్ లో పాల్గొనేముందు కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

Things To Remember Before Sex
Things To Remember Before Sex (Unsplash)

Pre-Sex Checklist: సెక్స్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన అంశం, ఎందుకంటే ఇది సంతానోత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తల మధ్య మధ్య సాన్నిహిత్యం పెరగటానికి, అనుబంధం బలపడటానికి ఇది ఒక తియ్యని ఔషధం. జంటలు సంతోషంగా జీవించటానికి, వారి జీవితంలో ఆనందం వెల్లివిరియడానికి శృంగారం ఒక వారధిలా ఉంటుంది.

సెక్స్ పట్ల అభిప్రాయం, దాని ప్రాముఖ్యత వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఇది వారి సామాజిక నమ్మకాలు, వ్యక్తితగ అనుభవాలపై ఆధారపడి ఉంటుంది.

Things To Remember Before Sex- చేసే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

సంతోషకరమైన శృంగార జీవితం (Happy Sex Life) ఉండాలంటే ఏ వ్యక్తి అయినా సెక్స్ చేసే ముందు కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

సమ్మతి

ఏదైనా లైంగిక చర్యలో పాల్గొనే ముందు మీరు మీ భాగస్వామి నుంచి స్పష్టమైన సమ్మతిని కలిగి ఉండాలి. ఇద్దరి అంగీకారం మేరకే కలయిక జరగాలి. ఈ విషయంలో భాగస్వాములు నిజాయితీగా వ్యవహరించాలి. లైంగిక కోరికను తెలియజేయడం, సరిహద్దులను కలిగి ఉండటం, వారికి ఉన్న అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. శృంగారంలో ఇద్దరూ ఉత్సాహభరితంగా పాల్గొన్నప్పుడే ఇద్దరికీ సంతృప్తి అనేది ఉంటుంది.

కమ్యూనికేషన్

సెక్స్ విషయంలో కమ్యూనికేషన్ కీలకం. మీరు ఇష్టపడే వాటి గురించి, మీకు నచ్చని వాటి గురించి లేదా మీకు ఉన్న భయాలు, ఆందోళనలు గురుంచి మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి. మీ భయాలు ఏమిటో నిజాయితీగా పంచుకోండి. ఇది మీ ఇద్దరు స్వేచ్ఛగా, ఇష్టంగా, నమ్మకంగా శృంగారంలో పాల్గొనేందుకు మీకు అనుమతిస్తుంది.

పరిశుభ్రత

సెక్స్ సమయంలో అలాగే కలయిక అనంతరం భాగస్వాములిద్దరూ మంచి పరిశుభ్రత పాటించాలి. సెక్స్‌లో పాల్గొనే ముందు చెమట వాసన రాకుండా, అంటువ్యాధులు అంటుకోకుండా మీ శరీరాలు పరిశుభ్రంగా ఉండేలా స్నానం చేయండి, దంతాలను బ్రష్ చేయండి, మీ గోళ్లను కత్తిరించండి. జుట్టును కూడా శుభ్రం చేసుకోండి. ఇది మీరు శృంగార రసాన్ని ఆస్వాదించేందుకు సహాయపడుతుంది. చర్మ సమస్యలు నివారించేందుకు లైంగిక చర్య తర్వాత కూడా మీ జననావయవాలను నీటితో శుభ్రం చేసుకోండి.

ఫోర్ ప్లే

నేరుగా క్లైమాక్స్ కు వెళ్లకండి, ఆత్రుతతో తొందరతొందరగా పని ముగించకండి. సెక్స్ అనేది నిదానంగా చేసే కార్యం. సెక్స్‌కు ముందు భాగస్వాములిద్దరూ మరింత రిలాక్స్‌గా, ఉద్రేకంతో ఉండేందుకు ఫోర్‌ప్లే సహాయపడుతుంది. భాగస్వామి శరీరాన్ని ఆన్ని మూలలా అన్వేషించండి, ముఖ్యమైన భాగాలను స్పృషించండి, భాగస్వామి శరీరంలో ఏ భాగం బాగుందో తెలియజేయండి, దానికి ప్రేమను అందించండి. ఇందుకోసం కావలసినంత సమయాన్ని వెచ్చించండి

భావోద్వేగ స్థితి

మీ భావోద్వేగ స్థితి కూడా మీ లైంగిక అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ఒత్తిడికి, ఆత్రుతగా లేదా పరధ్యానంగా ఉన్నట్లయితే, ఆ క్షణాన్ని ఆస్వాదించడం కష్టంగా ఉండవచ్చు. లైంగిక చర్యలో పాల్గొనే ముందు ఏదైనా భావోద్వేగ సమస్యల నుంచి బయటపడండి. ప్రశాంతమైన మనస్సుతో పాల్గొనండి, ఇష్టంగా వాంఛను తీర్చుకోండి.

రక్షణ

లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల (STIలు) నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, అవాంఛిత గర్భాలను నిరోధించడానికి సురక్షితమైన సెక్స్‌ను ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. ఈ విషయంలో తొందరపడకుండా, సంభోగ సమయంలో కండోమ్‌లు, డెంటల్ డ్యామ్‌లు, ఇతర రక్షణలను ఉపయోగించండి.

WhatsApp channel

సంబంధిత కథనం